USA: పాకిస్థాన్‌ ISI కుట్రను భగ్నం చేసిన అమెరికా.. ఏకంగా అధ్యక్షుడి సతీమణి భద్రతా విభాగంలోకి చొరబడేందుకు..

|

Apr 08, 2022 | 1:33 PM

USA: పాకిస్థాన్‌ (Pakistan)కు చెందిన ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐ (ISI) కుట్రను అగ్రరాజ్యం అమెరికా భగ్నం చేసింది. ఈ ఉగ్రవాద సంస్థకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఏకంగా అమెరికా భద్రతా విభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నించారు...

USA: పాకిస్థాన్‌ ISI కుట్రను భగ్నం చేసిన అమెరికా.. ఏకంగా అధ్యక్షుడి సతీమణి భద్రతా విభాగంలోకి చొరబడేందుకు..
America
Follow us on

USA: పాకిస్థాన్‌ (Pakistan)కు చెందిన ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐ (ISI) కుట్రను అగ్రరాజ్యం అమెరికా భగ్నం చేసింది. ఈ ఉగ్రవాద సంస్థకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఏకంగా అమెరికా భద్రతా విభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నించారు. అయితే అమెరికా నిఘా సంస్థ ఫెడరల్‌ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌ (FBI) వారిని అరెస్ట్‌ చేసింది. అరియన్ తాహిర్‌జాదే, హైదర్‌ అలీలు పాక్‌లోని ఐఎస్‌ఐ కోసం పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరు గత కొన్ని నెలల నుంచి అమెరికాలో నకిలీ ధ్రువపత్రాలతో ఫెడరల్‌ ఏజెంట్‌ అధికారులు అంటూ చలామణి అవుతున్నారని ఎఫ్‌బీఐ తెలిపింది.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. వీరిద్దరు 2021లో జరిగిన క్యాపిటల్‌ హిల్‌ అల్లర్ల కేసు దర్యాప్తు కోసం అండర్‌కవర్‌ ఆపరేషన్‌ చేస్తున్న అధికారులమంటూ అందరినీ నమ్మించారు. ఇలా ఫెడరల్‌ లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌, డిఫెన్స్‌ కమ్యూనిటీకి చెందిన వారితో పరిచయాలు పెంచుకునేందుకు ప్రయత్నించారు. ఇందులో భాగంగానే అమెరికా నిఘా వర్గాలకు చెందిన సిబ్బంది నివాసముండే అపార్ట్‌మెంట్‌ ప్రాంగణాలపై నిఘా పెట్టారు. కొంత మంది సిబ్బందికి ఖరీదైన బహుమతులు ఇచ్చి వారిని మచ్చిక చేసుకునే ప్రయత్నం కూడా చేశారని అధికారుల దర్యాప్తులో తేలింది.

అమెరికా అధ్యక్షుడు జో బెడైన్‌ సతీమణి జిల్‌ బైడెన్‌ భద్రతా విభాగంలో పనిచేసే వారితో ఈ ఉగ్రవాదులు పరిచయం చేసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. దీంతో వీరితో సత్సంబంధాలు కలిగిన వారిని అధికారులు అడ్మినిస్ట్రేషన్‌ లీవ్‌లో పంపించి, నిందితులను విచారిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రక్షణ వ్యవస్థ ఉన్న అమెరికాలాంటి అగ్ర రాజ్యంలో ఇలాంటి వ్యవహారం వెలుగులోకి రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఉగ్రవాద సంస్థకు చెందిన వ్యక్తులు అగ్ర రాజ్య ప్రథమ పౌరురాలి భద్రతా విభాగంలోకి చేరేందుకు ప్రయత్నించారన్న అంశం ఒక్కసారి ఉలిక్కి పడేలా చేసింది.

Also Read: Aliens Humans: భూమి మీద గ్రహాంతరవాసుల లైంగిక దాడి.. బాధితుల్లో ఒకరు గర్భవతి.. పెంటగాన్ సంచలన నివేదిక

Watch Video: తృటిలో తప్పిన పెనుప్రమాదం.. ల్యాండింగ్ సమయంలో రెండు ముక్కలైన కార్గో విమానం.. వీడియో

Thalapathy Vijay-Rashmika Mandanna: దళపతి విజయ్ అంటే రష్మిక కు ఇంత ఇష్టమా..! అసలు ఆ ఎగ్జైట్‌మెంట్ మాములుగా లేదుగా..