Pak-Afghan: అఫ్గాన్ పై పాక్ దాడులు.. సరిహద్దు గ్రామాల్లో రాకెట్ ప్రయోగాలు

|

Apr 17, 2022 | 9:44 AM

అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు చేజిక్కించుకున్నప్పటి నుంచి అఫ్గానిస్థాన్‌(Afghanistan), పాకిస్తాన్ (Pakistan) రెండు దేశాల మధ్య సరిహద్దు గొడవలు తలెత్తుతున్నాయి. అంతే కాదు.. అఫ్గానిస్తాన్‌ తమపై దాడులు చేస్తోందని ఇటీవల పలుమార్లు పాక్‌...

Pak-Afghan: అఫ్గాన్ పై పాక్ దాడులు.. సరిహద్దు గ్రామాల్లో రాకెట్ ప్రయోగాలు
Rocket Attack
Follow us on

అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు చేజిక్కించుకున్నప్పటి నుంచి అఫ్గానిస్థాన్‌(Afghanistan), పాకిస్తాన్ (Pakistan) రెండు దేశాల మధ్య సరిహద్దు గొడవలు తలెత్తుతున్నాయి. అంతే కాదు.. అఫ్గానిస్తాన్‌ తమపై దాడులు చేస్తోందని ఇటీవల పలుమార్లు పాక్‌ చెబుతోంది. పాకిస్తాన్ తన సరిహద్దుల్లోని అఫ్గానిస్థాన్ గ్రామాలపై రాకెట్‌ దాడులతో విరుచుకుపడుతోంది. సరిహద్దు ప్రాంతమైన తూర్పు అఫ్గాన్‌ ప్రావిన్స్‌పై పాక్‌ సైనిక దళాలు జరిపిన రాకెట్‌ దాడుల్లో(Rocket Attacks) ఆరుగురు మృతిచెందినట్లు ఓ అధికారి వెల్లడించారు. మృతుల్లో ఐదుగురు చిన్నారులు, ఓ మహిళ ఉన్నారు. ‘కునార్‌లోని షెల్టాన్‌ జిల్లాలో పాకిస్థాన్‌ ప్రయోగించిన రాకెట్‌ దాడుల్లో ఐదుగురు చిన్నారులు సహా ఓ మహిళ మృత్యువాతపడ్డారు. మరో వ్యక్తికి గాయమైందని’ ప్రాంతీయ సమాచార డైరెక్టర్ నజీబుల్లా హసన్ అబ్దాల్ పేర్కొన్నారు. సరిహద్దు ఖోస్ట్‌ ప్రావిన్స్‌లోనూ పాక్‌ ఇదే తరహా దాడికి పాల్పడినట్లు మరో అధికారి వెల్లడించారు. కాబుల్‌లోని పాకిస్థాన్‌ రాయబారిని పిలిపించి ఈ దాడుల గురించి నిరసన వ్యక్తం చేసినట్టు విదేశాంగ శాఖ తెలిపింది.

సరిహద్దు ఖోస్ట్‌ ప్రావిన్స్‌లోనూ పాక్‌ రాకెట్ దాడులు చేసినట్టు అఫ్గాన్ అధికారులు చెబుతున్నారు. ఖోస్ట్ ప్రావిన్స్‌లోని నాలుగు గ్రామాలపై పాకిస్తాన్ హెలికాప్టర్లు బాంబులు విసిరాయని చెబుతున్నారు. ఈ దాడులను అఫ్గాన్‌ విదేశాంగ శాఖ సీరియస్‌ గా తీసుకుంది. కాబుల్‌లోని పాకిస్తాన్‌ రాయబారిని పిలిపించింది. ఈ దాడుల గురించి నిరసన వ్యక్తం చేసింది. ఇంత జరుగుతున్నా.. ఈ దాడులపై పాకిస్తాన్‌ ఇంతవరకు పెదవి విప్పలేదు. దాడులు చేసినట్టు గానీ, చేయనట్టుగానీ ఏమీ ప్రకటించలేదు.

గతేడాది ఆగస్టులో అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న తరువాత ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదాలు పెరిగిపోయాయి. ఇదే కాకుండా పొరుగుదేశం తమపై దాడులు చేస్తోందంటూ పాక్‌ పలుమార్లు ఆరోపించింది. అఫ్గాన్‌-పాక్‌ దేశాల మధ్య డ్యురాండ్‌ రేఖగా పిలిచే 2,700 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ఉంది.

Also Read

Viral Wedding Gifts: కొత్త దంపతులకు ఫ్రెండ్స్‌ అదిరిపోయే గిఫ్ట్‌.. నోరెళ్ల బెడుతున్న నెటిజన్లు.. వైరల్ వీడియో

Delhi Violence: ఢిల్లీ హనుమాన్ జయంతి ఊరేగింపుపై రాళ్ల దాడి.. వాహనాలకు నిప్పుపెట్టిన ఆందోళనకారులు..

Weather Report: చల్లని కబురు.. భానుడి భగభగలకు మరో రెండు రోజులపాటు చెక్.. తెలంగాణలోని..