పాకిస్థాన్‌లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వానల కారణంగా పరిస్థితి మరింత దారుణంగా మారింది. కరాచీ సహా పలు నగరాల్లో రాత్రి నుంచి వర్షం కురుస్తోంది. భారీ వర్షాలు కురువడంతో వరదలు వచ్చే పరిస్థితి నెలకొంది. మరోవైపు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు రాత్రి అంధకారంలో గడిపారు. కరాచీ నగరంలోని పలు ప్రాంతాల్లో నీటి ఎద్దడి నెలకొంది. భారీ వర్షాలతో ట్రాఫిక్ జామ్ కావడంతో పరిస్థితి మరింత దిగజారింది. ఈ రోజు కూడా దేశంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పాకిస్థాన్ వాతావరణ శాఖ హెచ్చరించింది.
శనివారం సాయంత్రం నుంచి భారీ వర్షం కురుస్తుండడంతో పరిస్థితి మరింత దిగజారింది. కరాచీలోని 700 పవర్ ఫీడర్లు నిలిచిపోయాయి. దీంతో సగానికిపైగా నగరం అంధకారంలో కూరుకుపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఇళ్లు, ఆసుపత్రుల్లోకి వర్షం నీరు చేరిందని స్థానిక మీడియా పేర్కొంది. బాల్డీ టౌన్, ఓరంగి టౌన్, నార్త్ కరాచీ, సుర్జనీ టౌన్, గుల్షన్-ఎ-మేమర్, ఓరంగి టౌన్, బహ్రియా టౌన్, సదర్, నార్త్ నజిమాబాద్, టవర్, లియాఖతాబాద్ , నజీమాబాద్‌లో భారీ వర్షం పడింది.
ఈ మునిగిపోతున్న కార్లు.. ఈ మునిగిపోతున్న ఇళ్లు..
یہ ڈوبتی گاڑیاں.. یہ ڈوبتے گھر.. لیکن بھٹو اب بھی.. زندہ ہے!!#KarachiRain pic.twitter.com/aknOERzR3c
— Ahmed (@ThisahmedR) February 3, 2024
బిలావల్ ప్రచారం కరాచీ వర్షంలో కొట్టుకుపోయింది. పంజాబ్ ప్రజలు PPPకి ఓటు వేసే ముందు కరాచీ, సింధ్‌లలో PPP 15 సంవత్సరాల పనితీరును తప్పక చూడాలి
کراچی کی بارش میں بلاول کی کمپین بہہ گئی ہے.
پنجاب والوں پی پی پی کو ووٹ دینے سے پہلے کراچی اور سندھ میں پی پی پی کی 15 سالہ کارگردگی ضرور دیکھ لینا 🤣🤣#KarachiRain pic.twitter.com/ullxjDf1rF— M waqas khan (@1waqss) February 4, 2024
ఈ మరుగుతున్న మురుగు నీరు ఈ నగరానికి PPP.. దాని మిత్రపక్షాలు ఏమి ఇచ్చాయి.. తిరిగి ఎన్నికైతే వారు మళ్లీ ఏమి ఇవ్వగలరో చూపిస్తుంది .
یہ ابلتے گٹر کا پانی بتاتا ہے کہ پیپلز پارٹی اور اسکے اتحادیوں نے اس شہر کو کیا دیا اور دوبارہ منتخب ہوکر کیا دے سکتے ہیں, کراچی ایک گھنٹے کی بارش میں ڈوب گیا- #KarachiRain pic.twitter.com/WOVsvn31uZ
— Arsalan Khan (@TheArsalanKhan2) February 3, 2024
కరాచీ పరిస్థితి PPP,వారి మిత్రపక్షాల పనితీరును చూపుతోంది.
The situation of Karachi is showing the performance of PPP and their allies.
Just vote for Pti to get away from these rascals and bastards. #DUCKY #KarachiRain #Nikkah #ImranKhan #BushraBibi pic.twitter.com/2RHCXzjXOd— Matin Khan (@matincantweet) February 3, 2024
నివేదికల ప్రకారం పాకిస్తాన్ వాతావరణ శాఖ (పిఎమ్‌డి) ఒక రోజు ముందే భారీ వర్షం పడుతుందని హెచ్చరించినప్పటికీ వర్షాన్ని ఎదుర్కోవడానికి నగర పరిపాలన ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో నగరంలోని చాలా రోడ్లు నీటితో నిండిపోయాయి.ప్రయాణికులు వారి వాహనాలలో చిక్కుకున్నారు. కరాచీ మేయర్ ముర్తాజా వహాబ్, భారీ వర్షాల తర్వాత నగరంలో పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని ప్రజలను హెచ్చరించారు.
ఐదు నిమిషాల వర్షం మరియు ఐదు గంటల ఇబ్బంది, ఇది కరాచీలో పరిస్థితి
پانچ منٹ کی بارش اور پانچ گھنٹے کی زحمت، یہ کراچی کا حال ہے#KarachiRain pic.twitter.com/o8nPxAZjdi
— Mehreen Ali (@MehreenAli99) February 3, 2024
భారీ వర్షాలతో కాలువలు నిండిపోయి పూర్తి స్థాయిలో ప్రవహిస్తున్నాయి. మేయర్ నగరంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. రోడ్లపై వర్షపు నీటిని తొలగించాలని అన్ని జిల్లాల మున్సిపల్ కార్పొరేషన్లను ఆదేశించారు. పాకిస్తాన్ వాతావరణ శాఖ సూచన ఉన్నప్పటికీ సింధ్ ప్రభుత్వం వర్షాన్ని ఎదుర్కొనేందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. జిన్నా పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడికల్ సెంటర్ (జెపిఎంసి)లోని గైనకాలజీ వార్డులోని ఆపరేషన్ థియేటర్ మరియు సివిల్ హాస్పిటల్ వార్డు నంబర్ 3లోకి వర్షం నీరు చేరింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..