Israeli: మారు వేషంలో ఆసుపత్రిలోకి ఇజ్రాయెల్ సైన్యం.. మిలిటెంట్లపై కాల్పులు.
పాలస్తీనా వెస్ట్‌బ్యాంక్‌లోని ఓ ఆస్పత్రిలో నక్కి ఉన్న ముగ్గురు హమాస్ మిలిటెంట్లను హతమార్చారు ఇజ్రాయెల్ సైన్యం. ఇందుకు కొత్త వ్యూహాన్ని అమలు చేశారు. ఆస్పత్రి సిబ్బందిలా వేషధారణతో ఆస్పత్రిలోకి చొచ్చుకు వెళ్లారు. ఇజ్రాయెల్ భద్రతా బలగాల్లోని మహిళలు .. ఆస్పత్రిలో నక్కి ఉన్న ముగ్గురు పాలస్తీనా మిలిటెంట్లను హతమార్చారు. జెనిన్ పట్టణంలో ఉన్న ఇబ్న్ సినా ఆస్పత్రిలోని వార్డుల్లో తాజాగా ఈ ఘటన చోటు చేసుకుంది.
పాలస్తీనా వెస్ట్‌బ్యాంక్‌లోని ఓ ఆస్పత్రిలో నక్కి ఉన్న ముగ్గురు హమాస్ మిలిటెంట్లను హతమార్చారు ఇజ్రాయెల్ సైన్యం. ఇందుకు కొత్త వ్యూహాన్ని అమలు చేశారు. ఆస్పత్రి సిబ్బందిలా వేషధారణతో ఆస్పత్రిలోకి చొచ్చుకు వెళ్లారు. ఇజ్రాయెల్ భద్రతా బలగాల్లోని మహిళలు .. ఆస్పత్రిలో నక్కి ఉన్న ముగ్గురు పాలస్తీనా మిలిటెంట్లను హతమార్చారు. జెనిన్ పట్టణంలో ఉన్న ఇబ్న్ సినా ఆస్పత్రిలోని వార్డుల్లో తాజాగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఆస్పత్రిలో ఇజ్రాయెల్ సైనికులు కాల్పులు జరిపినట్లు పాలస్తీనా ఆరోగ్య శాఖ కూడా ధ్రువీకరించింది. ఇజ్రాయెల్ దాడులను తీవ్రంగా ఖండించింది. ఆస్పత్రుల్లో ఇలాంటి దాడులు చేయకుండా ఇజ్రాయెల్‌పై అంతర్జాతీయ సమాజం ఒత్తిడి తీసుకురావాలని కోరింది.
ఆస్పత్రిని మిలిటెంట్లు రక్షణ కవచంలా వాడుకుంటున్నారని ఇజ్రాయెల్ మిలటరీ వర్గాలు ముందు నుంచీ ఆరోపిస్తూ వస్తున్నాయి. ఇజ్రాయెల్‌పై అక్టోబర్ 7 తరహా ఉగ్రదాడులకు ప్రణాళికలు రచిస్తున్న వారిని హతమార్చినట్లు తెలిపాయి. మహిళలు, డాక్టర్లు, ఆస్పత్రి సిబ్బంది మాదిరిగా వస్త్రధారణతో ఇజ్రాయెల్ సైనికులు ఆస్పత్రిలోనికి వెళ్తున్న దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సర్జికల్ మాస్క్ వేసుకున్న ఓ సైనికుడు… ఒక చేతిలో ఆయుధం మరో చేతిలో వీల్‌చైర్ పట్టుకుని వెళ్తున్నట్లు అందులో ఉంది. గాజాలో ఆస్పత్రులపై దాడుల విషయంలో ఇప్పటికే ఇజ్రాయెల్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. చాలా ఆస్పత్రులు శరణార్థ శిబిరాలుగా పని చేస్తున్నాయి. ఇజ్రాయెల్ దాడుల కారణంగా గాజాలో అనేక ఆస్పత్రులు ఇప్పటికే మూతపడగా పని చేస్తున్న కొన్ని ఆస్పత్రుల్లో కూడా ఇంధన, ఔషధాల కొరత నెలకొంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
తాత చేసిన పనితో.. అంతులేని సంపద మనవడి సొంతం..!
వామ్మో.. వీడి ట్యాలెంట్ చూసి పోలీసులే షాక్ అయ్యారు..!
మలంతో లక్షల సంపాదన.. ప్రాణాలు కాపాడుతున్న యువకుడు!
బిర్యానీ కోసం ఆశగా లోపలి వెళ్ళాడు.. తిని బయటకి రాగానే ??
సందర్శకులను కట్టి పడేస్తున్న అరుదైన పుష్పాల ఫ్లవర్ షో
ఓర్నీ.. ఈ పాము ట్యాలెంట్ మామూలుగా లేదుగా
కొబ్బరిచెట్టుపై కాయలు కోస్తున్న కోతి.. నెట్టింట వీడియో వైరల్

