POK: మేం భారత్‌లో కలుస్తాం.. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో పెరుగుతున్న నిరసనలు..
తిండి గింజల కోసం లంకేయులు అల్లాడినట్లే, పాకిస్తానీయులు కూడా విలవిల్లాడుతున్నారు. దీంతో పాకిస్తాన్‌తో ఉన్నవారు పక్కకు తప్పుకుంటున్నారు. నెమ్మదిగా జారుకుంటున్నారు.
కోకొల్లలు.. తిండి లేక పాకిస్థాన్ ప్రజలు అల్లాడిపోతున్నారు. పాలు పండ్లు, గోధుమలు, బియ్యం అన్నీ ఆకాశాన్ని తాకుతున్నాయి. శ్రీలంక సిట్యువేషన్‌కు ఒక్క అడుగు దూరంలో నిలిచింది పాకిస్తాన్. లంక తరహా పరిస్థితులే ఇప్పుడు.. పాకిస్తాన్‌లో నెలకొన్నాయి. తిండి గింజల కోసం లంకేయులు అల్లాడినట్లే, పాకిస్తానీయులు కూడా విలవిల్లాడుతున్నారు. దీంతో పాకిస్తాన్‌తో ఉన్నదేశాలు నెమ్మదిగా తప్పుకుంటున్నాయి. కనిపించకుండా జారుకుంటున్నాయి. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరులోని గిల్గిట్-బాల్టిస్థాన్‌లో ఆందోళనలు పెరుగుతున్నాయి. రోడ్డెక్కుతున్నారు.. పాకిస్తాన్‌పై పెద్ద ఎత్తున నిరసనలు పెరుగుతున్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వ విధానాలు తమ పట్ల వివక్షాపూరితంగా ఉన్నాయని ఈ ప్రాంత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వంపై వీరి ఆగ్రహం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
తమ రాష్ట్రాన్ని భారత్‌తో కలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. లడఖ్‌లో భారత్‌తో తమను కలిపేయాలని స్థానిక ప్రజలు కోరుతున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. కార్గిల్ రోడ్డును తెరచి, భారత దేశంలోని లడఖ్‌లో ఉన్న తమ తోటి బాల్టిస్‌లతో తమను కలపాల నినాదాలు చేయడం మనం ఇందులో చూడచ్చు. గత కొంత కాలంగా అక్కడివారు పెద్ద ఎత్తున నిరసనలకు దిగడాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. లోడ్ షెడ్డింగ్, చట్టవిరుద్ధ భూ ఆక్రమణలు, సహజ వనరుల దోపిడీ వంటి అంశాలపై వీరు పోరాడుతున్నారు.
పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీరు మాజీ ప్రధాన మంత్రి రజ ఫరూఖ్ హైదర్ కూడా ఇదే వాదన చేస్తున్నారు అవామీ యాక్షన్ కమిటీ పూంఛ్ జిల్లాలోని హజీరా సబ్‌డివిజన్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. పాకిస్తాన్ భద్రతా దళాలు ఈ ప్రాంతంలో భూ కబ్జాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. పాక్ సైనికులు చేస్తున్న అరాచకాల తెర దించాలని డిమాండ్ చేశారు. స్థానికుల హక్కులకు రక్షణ కల్పించాలని అన్నారు. ఖల్సా భూమి నుంచి గిల్గిట్-బాల్టిస్థాన్ ప్రజలను ఖాళీ చేయించవద్దని సూచించారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం