Flights in America: గంటల సేపు అమెరికాలో విమాన సర్వీసుల నిలిపివేత.. ఎందుకంటే..?
అమెరికాలో అన్ని విమాన సర్వీసులు నిలిచిపోయాయి. సాంకేతిక లోపాల కారణంగా అన్ని విమానాలను నిలిపివేస్తునట్టు అధికారులు ప్రకటించారు. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు
అమెరికాలో అన్ని విమాన సర్వీసులు నిలిచిపోయాయి. సాంకేతిక లోపాల కారణంగా అన్ని విమానాలను నిలిపివేస్తునట్టు అధికారులు ప్రకటించారు. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు దీనిపై ప్రయాణికులు కీలక సూచనలు చేశారు. విమానాలు ఎప్పుడు నడుస్తాయో చెప్పలేమని తెలిపారు. ముందస్తు సమచారం లేకుండా ఎక్కడికక్కడా విమానాలు నిలిపివేయడంతో అధికారుల తీరుపై ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. టెక్నికల్ సమస్య కారణంగా ఈ సమస్య వచ్చినట్టు తెలిపారు. ఎఫ్ఏఏ కంప్యూటర్ సిస్టమ్‌లో టెక్నికల్ ప్రాబ్లమ్ రావడంతో విమాన సర్వీసులను నిలిపివేయాల్సి వచ్చింది.సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తునట్టు అధికారులు తెలిపారు. తాము మళ్లీ అనుమతి ఇచ్చే వరకు విమానాలను నడపవద్దని ఆదేశాలు జారీ చేశారు.పైలట్లు, విమాన కార్యకలాపాల్లో పాల్గొన్న ఇతరులకు ముఖ్యమైన సమాచారాన్ని అందించడానికి నోటామ్ వ్యవస్థ సహాయపడుతుంది. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) కంప్యూటర్ లో సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో అమెరికా అంతటా అన్ని విమానాలు నిలిచిపోయాయి. పలు జాతీయ, అంతర్జాతీయ సర్వీసులు రద్దయ్యాయి. ప్రయాణికులతో విమానాశ్రయాలు కిటకిటలాడుతున్నాయి. ఏం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి నెలకొందని ప్రయాణికులు వాపోతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos