గగనతల మార్గాలు మూసేసిన పాక్.. ఇబ్బంది లేదన్న ఎయిర్ ఇండియా

ఆర్టికల్ 370ను రద్దు చేయడం, జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను ఇస్తూ మోదీ ప్రభుత్వం నిర్ణయం తరువాత భారత్, పాకిస్తాన్ మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రద్దు ప్రకటనను విద్వేషపూరితంగా వ్యాఖ్యానించిన పాక్ ఇప్పడు ద్వైపాక్షిక వాణిజ్యం నిలిపివేయాలని, అలాగే దౌత్య సంబంధాలను కూడా తగ్గించాలని నిర్ణయించుకుంది. మరోవైపు భారత రాయబారిని కూడా బహిష్కరించింది. ఇక తాజాగా భారత విమానాలకు ఎయిర్‌స్పేస్‌ను పాక్షికంగా మూసివేసింది పాకిస్తాన్. దీనిపై బుధవారం ఎయిర్ ఇండియా స్పందించింది. ‘‘పాక్ ఎయిర్‌స్పేస్‌ను మూసివేసింది. […]

గగనతల మార్గాలు మూసేసిన పాక్.. ఇబ్బంది లేదన్న ఎయిర్ ఇండియా
Follow us

| Edited By:

Updated on: Aug 08, 2019 | 10:10 AM

ఆర్టికల్ 370ను రద్దు చేయడం, జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను ఇస్తూ మోదీ ప్రభుత్వం నిర్ణయం తరువాత భారత్, పాకిస్తాన్ మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రద్దు ప్రకటనను విద్వేషపూరితంగా వ్యాఖ్యానించిన పాక్ ఇప్పడు ద్వైపాక్షిక వాణిజ్యం నిలిపివేయాలని, అలాగే దౌత్య సంబంధాలను కూడా తగ్గించాలని నిర్ణయించుకుంది. మరోవైపు భారత రాయబారిని కూడా బహిష్కరించింది.

ఇక తాజాగా భారత విమానాలకు ఎయిర్‌స్పేస్‌ను పాక్షికంగా మూసివేసింది పాకిస్తాన్. దీనిపై బుధవారం ఎయిర్ ఇండియా స్పందించింది. ‘‘పాక్ ఎయిర్‌స్పేస్‌ను మూసివేసింది. దీనివలన విమానాల మళ్లింపులకు మరో 12నిమిషాలు అదనంగా సమయం పడుతుంది’’ ఎయిర్‌ఇండియా అధికారులు పేర్కొన్నారు. అయినా పాక్ నిర్ణయం వలన తమకేమీ పెద్ద ఇబ్బంది లేదని వారు పేర్కొన్నారు.

కాగా ఎయిర్ ఇండియాకు చెందిన దాదాపు 50 విమానాలు రోజు పాకిస్తాన్ మార్గం ద్వారా పయనించేవి. ఇవన్నీ అమెరికా, యూరప్, మిడిల్ ఈస్ట్ దేశాలకు ప్రయాణించేవి. ఇదిలా ఉంటే బాలాకోట్‌లోని ఉగ్రస్థావరాలపై భారత ప్రభుత్వం సర్జికల్ స్టైక్ నిర్వహించిన సమయంలో తమ గగనతలాన్ని ఫిబ్రవరి 26న మూసేసింది పాక్. ఆ తరువాత జూలై 16నుంచి మళ్లీ అనుమతినిచ్చింది. తాజాగా ఆర్టికల్ 370 నేపథ్యంలో మరోసారి తమ గగన తలంలోని మార్గాలను మూసివేసి వక్రబుద్ధిని బయటపెట్టింది పాక్.

శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన