ఆపరేషన్ సింధూర్‌తో తీవ్రంగా నష్టపోయాం.. నిజం ఒప్పేసుకున్న పాక్ ప్రధాని

ఆపరేషన్‌ సిందూర్‌పై ఫేక్‌న్యూస్‌తో అడ్డగోలు ప్రచారం చేసిన పాకిస్తాన్‌, ఇప్పుడు నిజం ఒప్పుకుంది. పార్లమెంటు సాక్షిగా అబద్ధాలు చెప్పిన పాక్‌ పాలకులు, వాస్తవాన్ని అంగీకరించారు. భారత్‌ చేసిన దాడుల రేంజ్‌ ఎలా ఉందో స్వయంగా పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్‌ చెప్పారు. ఆపరేషన్‌ సింధూర్‌ తీవ్రతపై షహబాజ్‌ షరీఫ్‌ చేసిన కామెంట్స్‌ ప్రాధాన్యం సంతరించుకుంది.

ఆపరేషన్ సింధూర్‌తో తీవ్రంగా నష్టపోయాం.. నిజం ఒప్పేసుకున్న పాక్ ప్రధాని
Pak Pm Shehbaz Sharif

Updated on: May 17, 2025 | 8:44 AM

ఆపరేషన్‌ సిందూర్‌పై ఫేక్‌న్యూస్‌తో అడ్డగోలు ప్రచారం చేసిన పాకిస్తాన్‌, ఇప్పుడు నిజం ఒప్పుకుంది. పార్లమెంటు సాక్షిగా అబద్ధాలు చెప్పిన పాక్‌ పాలకులు, వాస్తవాన్ని అంగీకరించారు. భారత్‌ చేసిన దాడుల రేంజ్‌ ఎలా ఉందో స్వయంగా పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్‌ చెప్పారు. ఆపరేషన్‌ సింధూర్‌ తీవ్రతపై షహబాజ్‌ షరీఫ్‌ చేసిన కామెంట్స్‌ ప్రాధాన్యం సంతరించుకుంది.

భారత్‌ చేసిన దాడులను తొలిసారిగా పాక్‌ ప్రధాని షాబాజ్ షరీఫ్‌ అంగీకరించారు. బాలిస్టిక్‌ క్షిపణులతో భారత్‌ విరుచుకుపడిందని ఆర్మీ చీఫ్‌ మునీర్‌ తనతో చెప్పారని ప్రధాని షరీఫ్‌ వెల్లడించారు. మే10వ తేదీన తెల్లవారుజాము 2.30కి పాక్ ఆర్మీ చీఫ్ అసిఫ్ మునీర్‌ నుంచి తనకు ఫోన్‌ కాల్‌ వచ్చిందని పాక్ ప్రధాని చెప్పారు. నూర్‌ఖాన్‌ ఎయిర్‌బేస్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో భారత్‌ దాడులు చేసిందని మునీర్‌ తనతో చెప్పారన్నారు.

ఆపరేషన్ సిందూర్ తర్వాత మే 7 – 11 మధ్య భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. పాకిస్తాన్ నిరంతరం డ్రోన్లు, క్షిపణులతో భారతదేశంపై దాడి చేసింది, దీనికి భారత సైన్యం తగిన సమాధానం ఇచ్చింది. భారతదేశం తీసుకున్న ప్రతీకార చర్యపై పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ ఇప్పుడు ప్రకటన చేశారు. నూర్ ఖాన్ ఎయిర్‌బేస్, ఇతర స్థావరాలపై భారత వైమానిక దళం నిర్వహించిన వైమానిక దాడుల గురించి జనరల్ అసిమ్ మునీర్ తెల్లవారుజామున 2.30 గంటలకు ఫోన్‌లో తనకు సమాచారం అందించారని ఆయన అంగీకరించారు. భారతదేశం కాల్పుల విరమణను ప్రతిపాదించిందని కూడా ఆయన పేర్కొన్నారు.

“మే 9-10 రాత్రి తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో జనరల్ సయ్యద్ అసిమ్ మునీర్ తనకు సురక్షిత మార్గంలో ఫోన్ చేసి, నూర్ ఖాన్ ఎయిర్‌బేస్, మరికొన్ని ప్రాంతాలపై భారత బాలిస్టిక్ క్షిపణులు పడ్డాయని తెలియజేశారన్నారు షాబాజ్. మన వైమానిక దళం మన దేశాన్ని రక్షించడానికి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించింది. అలాగే చైనా యుద్ధ విమానాలపై ఆధునిక గాడ్జెట్‌లు, సాంకేతికతను కూడా ఉపయోగించారు” అని పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ అన్నారు. షరీఫ్ ప్రసంగానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా ఎక్స్ లో బీజేపీ ఐటీ సెల్ ఇంచార్జ్, ప్రధాన కార్యదర్శి అమిత్ మాలవీయ పోస్ట్ చేశారు. ఆపరేషన్ సిందూర్ ధైర్యం, సామర్థ్యానికి షరీఫ్ మాటలు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుతం ప్రతిచోటా, పాకిస్తాన్ సైన్యం భారతదేశానికి ఎలా స్పందించిందనే దాని గురించి చర్చ జరుగుతోంది. పాక్ సైన్యం పఠాన్‌కోట్, ఉధంపూర్, సహా అనేక ఇతర ప్రదేశాలపై దాడి చేసిందని మరోసారి అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేశారు పాక్ ప్రధాని. శత్రువులు దాక్కోవడానికి చోటు కనుగొనలేకపోయారని షాబాజ్ షరీఫ్ అన్నారు. తనకు సెక్యూర్ ఫోన్‌ ద్వారా జనరల్ అసిమ్ మునీర్ తనకు ఫోన్ చేసి, భారత్‌కు తగిన సమాధానం ఇచ్చామని, ఇప్పుడు వారు కాల్పుల విరమణ కోరుకుంటున్నారని తెలిపాడని షాబాజ్ అన్నారు. దీని కంటే పెద్దది ఏమి ఉంటుంది. శత్రువుకు గట్టి దెబ్బ ఇచ్చారు. ఇప్పుడు వాళ్లే కాల్పుల విరమణ చేయవలసి వచ్చింది. మీరు ఆలస్యం చేయకూడదని,యు కాల్పుల విరమణ ప్రతిపాదనను అంగీకరించాలని సూచించినట్లు పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్‌ చెప్పుకొచ్చాడు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..