Czech Woman Marry Gujranwala : ఔను.. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఆ ఇద్దరి వివాహం సంచలనంగా మారింది. ఆసియా దేశాల్లో చర్చకు దారి తీసింది. అది ఎక్కడో కాదు మన పక్క దేశం పాకిస్తాన్‌లో.. ఇక్కడ 23 ఏళ్ల కుర్రాడిని 65 ఏళ్ల మహిళ వివాహం చేసుకుంది. వీరి వివాహం ఆ తర్వాత పెద్ద చర్చకు దారి తీసింది. వీరి వివాహం వెనుక పెద్ద కథే ఉందండోయ్..
వీరిద్దరికి ఫేస్ బుక్‌లో పరిచయం ఏర్పడింది. అనుకోకుండా ఫేస్‌బుక్‌లో పరిచయం అయ్యారు… ఆ తరువాత ఫొటోలు చూసుకుని ఒకరినొకరు ఇష్టపడ్డారు… ఆ ఇష్టం ప్రేమగా మారింది. అలా రెండేళ్ల పాటు ఆన్‌లైన్ లోనే ప్రేమించుకున్నారు. ఆ క్రమంలోనే ఇరువురి పెద్దలను ఒప్పించారు…ఫైనల్ గా పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు.
23 ఏళ్ల అబ్దుల్లా పాకిస్తాన్.. అతని కంటే 42 సంవత్సారలు పెద్ద మహిళది.. చెక్ రిపబ్లిక్. వృత్తిపరంగా అబ్దుల్లా చిత్రకారుడు. అయితే చెక్ రిపబ్లిక్‌లో స్థిరపడేందుకు గత కొంత కాలంగా ప్రయత్నిస్తున్నాడు. అంతలో ఫేస్ బుక్ పరిచయం ఏర్పడటం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే…
అరియానా గత ఒక సంవత్సరం నుండి వీసా కోసం ప్రయత్నిస్తున్నది. కానీ ప్రతిసారీ ఆమె వీసా తిరస్కరించబడింది. అబ్దుల్లా కూడా వీసా కోసం దరఖాస్తు చేసుకున్నాడు కాని అతని వీసా కూడా తిరస్కరించబడింది. అనేక ప్రయత్నాలు.. అనేక ఫోన్ కాల్స్ తరువాత, అరియానా చెక్ రిపబ్లిక్ దేశంలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయం సంప్రదించింది. అబ్దుల్లా చివరకు అరియానాను కలవగలిగాడు. 3 సంవత్సరాల తర్వాత ఇద్దరూ ఇక్కటయ్యారు.
వివాహం తరువాత.. వీరిద్దరూ చెక్ రిపబ్లిక్లో ఉండాలని ప్లాన్ చేస్తున్నారు. అబ్దుల్లా ఇప్పుడు తన పెంపుడు జంతువులను అక్కడకు మార్చాడు. అరియానా రిటైర్డ్ స్కూల్ టీచర్. ఆమె తన భర్త అబ్దుల్లాకు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి కూడా సహాయం చేస్తోంది. కానీ అతనే ఉర్దూ, పంజాబీ భాషలను కూడా నేర్పిస్తున్నాడు. వివాహం కోసం తన తల్లిదండ్రులను ఒప్పించడం అబ్దుల్లాకు అంత కష్టం కాలేదు.
ఇప్పుడు సరికొత్త ఇన్నింగ్‌ను మొదలు పెట్టారు. తమ కొత్త జీవితంలోకి మూడో వ్యక్తిని ఆహ్వానించాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే వైద్యులు మాత్రం నో అంటున్నారు. ఎందుకంటే.. అరియానా వయస్సు రిత్యా అలా చేయవద్దని చేయవద్దని డాక్టర్లు సలహా కూడా ఇచ్చారు.
పాకిస్తాన్ నగరమైన గుంజరవాలా.. పంజాబ్అ తిపెద్ద నగరాల్లో ఒకటి. జనాభా అత్యధికంగా ఉన్న దేశంలో ఇది ఐదవ నగరం. ఈ నగరం 18 వ శతాబ్దంలో స్థిరపడింది మరియు నేడు ఇది ఆధునిక నగరాలలో లెక్కించబడుతుంది. ఈ ప్రదేశం మహారాజా రంజిత్ సింగ్ జన్మస్థలం. నేడు, ఈ నగరం కరాచీ మరియు ఫైసలాబాద్ తరువాత అతిపెద్ద పారిశ్రామిక నగరం. నగరం గోల్డెన్ ట్రయాంగిల్‌లో భాగం.
ఇవి కూడా చదవండి
ఏడాది గడిచిన అదే జోరు.. వ్యాక్సిన్ వచ్చిన తగ్గని తీవ్రత.. మాయదారి మహమ్మారికి అంతమెప్పుడు..?
Farm Laws: ఆ చట్టాలు.. రైతులు, కార్మికులకే కాదు.. యావత్ దేశానికి ప్రమాదకరం: రాహుల్ గాంధీ