India-Pakistan Agreement: పాకిస్తాన్ జైళ్లలో ఇండియన్ పౌరులు ఎంతమంది ఉన్నారో తెలుసా? దీనిపై అధికారిక ప్రకటన..

India-Pakistan Agreement: భారత్‌-పాక్‌ ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా ఏళ్ల నుంచి పాకిస్తాన్‌లో మగ్గుతున్న ఇండియన్ పౌరుల లెక్క తేలింది.

India-Pakistan Agreement: పాకిస్తాన్ జైళ్లలో ఇండియన్ పౌరులు ఎంతమంది ఉన్నారో తెలుసా? దీనిపై అధికారిక ప్రకటన..

Updated on: Jan 02, 2021 | 8:34 AM

India-Pakistan Agreement: భారత్‌-పాక్‌ ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా ఏళ్ల నుంచి పాకిస్తాన్‌లో మగ్గుతున్న ఇండియన్ పౌరుల లెక్క తేలింది. ఇస్లామాబాద్‌లో ఉన్న భారత హైకమిషన్‌కు పాకిస్తాన్ 319 మంది భారతీయ ఖైదీల జాబితాను పంపింది. ఈ ఒప్పందంలో భాగంగా భారత్‌ కూడా దిల్లీలోని పాకిస్థాన్‌ హై కమిషన్‌కు 340 మందితో కూడిన జాబితాను అందించింది.

ముప్పై ఏళ్లుగా భారత్, పాక్ మధ్య కొనసాగుతున్న ఒప్పందం ప్రకారం సమాచార మార్పిడి జరిగింది. ఇరు దేశాల శత్రుత్వం వల్ల ఏ దేశానికి ఇబ్బంది రాకూడదనే ఈ నిర్ణయాలను తీసుకున్నారు. ఈ లెక్క ప్రకారం పాకిస్తాన్‌లో 49 మంది పౌరులు, 270 మంది మత్స్యకారులు అక్కడి జైల్లో మగ్గుతున్నారు. అలాగే భారత్‌లో కూడా పాకిస్తాన్‌కు చెందిన 263 మంది పౌరులు, 77 మంది మత్స్యకారులు జాబితాలో ఉన్నారు. అలాగే అణ్వాయుధాల వివరాలను కూడా ఒకరికొకరు సమర్పించుకున్నారు. 1988, డిసెంబరు 31న ఈ ఒప్పందంపై ఇరుదేశాలు సంతకాలు చేయగా 1991, జనవరి 27 నుంచి అమలులోకి వచ్చింది.