Disha Ravi case : పానకంలో పుడకలా పాకిస్తాన్ ఎంట్రీ, తాము మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించిన ప్రధాని ఇమ్రాన్ పార్టీ

|

Feb 16, 2021 | 12:48 PM

Disha Ravi case : టూట్‌కిట్‌, దిశరవి.. ఇప్పుడు ఈ రెండు పేర్లు దేశమంతటా మార్మోగుతున్నాయి. ఒకవైపు ఆందోళనలు.. మరోవైపు మద్దతులు. టూల్‌కిట్‌ కేసులో అరెస్ట్‌..

Disha Ravi case : పానకంలో పుడకలా పాకిస్తాన్ ఎంట్రీ, తాము మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించిన ప్రధాని ఇమ్రాన్ పార్టీ
Follow us on

Disha Ravi : టూట్‌కిట్‌, దిశారవి.. ఇప్పుడు ఈ రెండు పేర్లు దేశమంతటా మార్మోగుతున్నాయి. ఒకవైపు ఆందోళనలు.. మరోవైపు మద్దతులు. టూల్‌కిట్‌ కేసులో అరెస్ట్‌ అయిన దిశారవికి మద్దతుగా ఆందోళనలు జరుగుతుంటే, మరోపక్క పానకంలో పుడకలా పాక్‌ ఎంట్రీ ఇచ్చింది. దిశారవికి తాము మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. అంతటితో ఆగిందా ఇండియా హైజాక్‌ హ్యాష్‌ట్యాగ్‌తో అంటూ చేసిన ట్వీట్‌ ప్రపంచ వ్యాప్తంగా హాట్‌టాఫిక్‌గా మారింది.

ఇలా.. మరోసారి భారత్‌ అంతర్గత వ్యవహారల్లో పాక్‌ తల దూర్చింది. దిశారవి అరెస్ట్‌పై దాయాది ప్రధాని ఇమ్రాన్‌కు చెందిన పాకిస్తాన్‌ తెహ్రీక్‌ ఈ ఇన్సాఫ్‌ పార్టీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దిశారవిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నాని ప్రకటించింది ఆపార్టీ. అంతేకాదు, కేంద్రంలోని మోదీ, ఆర్‌ఎస్‌ఎస్‌ సర్కార్‌ పౌరులు హక్కులను కాలరాస్తోంది.. కశ్మీర్‌ విభజనతో మోనార్టీలను తన గుప్పిట్లోకి తీసుకుంది అంటూ అరోపించింది. దేశంలో క్రీడాకారులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను తమకు అనుకూలంగా మలుచుకుంటోంది అంటూ ట్వీట్‌ చేసింది. ఇండియా హైజాక్‌ ట్విటర్‌ అనే హ్యాష్‌ట్యాగ్‌తో జతచేసింది.

భారత్‌ అంతర్గత వ్యవహారాల్లో పాకిస్తాన్‌ తల దూర్చడం ఇదే తొలిసారి కాదు.. గతంలో అనేక సందర్భాల్లో బహిరంగ ప్రకటనలు చేసి వివాదాన్ని మరింత రాజేసింది పాక్‌. ఇటు దిశారవి అరెస్ట్‌ను ఖలిస్థాన్‌ అనుకూల సంస్థ పొయిటిక్‌ జస్టిస్‌ ఫౌండేషన్‌ కూడా తీవ్రంగా ఖండించింది. ట్వీటక్లు, హ్యండిల్స్‌, హ్యాష్‌ట్యాగ్స్‌, ఉన్న డాక్యుమెంట్‌ ఆధారంగా దిశాను అరెస్ట్‌ చేయడం దారుణమని ట్విట్టర్‌ వేదికగా మండిపడ్డింది.

Read also : Job News : గెయిల్‌లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగ అవకాశాలు, కెమికల్, ఇన్స్ట్రుమెంటేషన్ విభాగాల్లో నియామకాలు