Haiti Gas Tanker Explosion: ఘోర ప్రమాదం.. గ్యాస్ ట్యాంకర్ పేలి 50 మంది దుర్మరణం..

Haiti Gas Tanker Explosion: హైతీ దేశంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కేప్-హైతియన్లో​గ్యాస్ ట్యాంకర్ పేలి 50 మందికిపైగా దుర్మరణం చెందారు. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా

Haiti Gas Tanker Explosion: ఘోర ప్రమాదం.. గ్యాస్ ట్యాంకర్ పేలి 50 మంది దుర్మరణం..
Haiti Gas Tanker Explosion
Follow us

|

Updated on: Dec 14, 2021 | 8:30 PM

Haiti Gas Tanker Explosion: హైతీ దేశంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కేప్-హైతియన్లో​గ్యాస్ ట్యాంకర్ పేలి 50 మందికిపైగా దుర్మరణం చెందారు. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మంగళవారం ఉదయం హైతీలోని క్యాప్-హైటియన్ నగరంలో జరిగింది. ఈ ఘటనను స్థానిక డిప్యూటీ మేయర్‌ పాట్రిక్ అల్మోనోర్ ధ్రువీకరించారు. ఘటనా స్థలంలో 50-54 మంది సజీవ దహనాన్ని చూశానంటూ పాట్రిక్ అల్మోనోర్ పేర్కొన్నారు. పేలుడు కారణంగా సంభవించిన మంటలు అంటుకొని దాదాపు 20 ఇళ్లు కూడా కాలిపోయినట్లు ఆయన వెల్లడించారు. మృతుల సంఖ్యను ఇప్పుడే చెప్పలేమని.. ఇంకా చాలామంది మరణించి ఉండొచ్చని పేర్కొన్నారు.

కాగా ఈ ఘటనపై ఆ దేశ ప్రధాని ఏరియల్​హెన్రీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అయితే ఇళ్లల్లో చిక్కుకుపోయి మరణించిన వారితో కలిపి మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నట్లు హైతీ పోలీసులు పేర్కొంటున్నారు. ఇదిలాఉంటే.. దేశంలోని ముఠాలు ఇటీవల గ్యాస్ లైన్లను స్వాధీనం చేసుకోవడంతో హైతీ తీవ్ర ఇంధన కొరత ఏర్పడింది. కాగా.. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read:

Crime News: ‘అమ్మా’నుషం.. ఏడుస్తుందని పసికందును దారుణంగా.. అసలేమైందంటే..?

Crime News: ‘అమ్మా’నుషం.. ఏడుస్తుందని పసికందును దారుణంగా.. అసలేమైందంటే..?