Amazon River: పెరుగుతోన్న అమెజాన్‌ నది ఉష్ణోగ్రతలు.. 100కుపైగా డాల్ఫిన్లు మృత్యువాత!

|

Oct 02, 2023 | 3:44 PM

మెజాన్‌ నది ప్రపంచంలోని అతిపెద్ద జలపాతంగా పేరు గాంచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దాని ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఇక్కడి జలాల్లో తరచుగా 39 డిగ్రీల (102 డిగ్రీల ఫారెన్‌హీట్ కంటే ఎక్కువ) ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. పర్యావరణ సమతుల్యానికి ఇది ఆందోళన కలిగించే పరిణామంగా మామిరావా ఇనిస్టిట్యూట్‌ తెలిపింది. ప్రస్తుతం అమెజాన్‌ నదీ పరివాహక ప్రాంతంలోని ఉష్ణోగ్రతల కారణంగా నదిలో నీటి మట్టం సైతం తగ్గిపోతోంది. సుమారు 59 మున్సిపాలిటీల్లో సాధారణ స్థాయి కంటే నీటి మట్టం తక్కువగా ఉన్నట్లు పేర్కొంది. ఇది నదిలో ఇతర జీవాల మనుగడకు ప్రశ్నార్ధకంగా మారుస్తుంది...

Amazon River: పెరుగుతోన్న అమెజాన్‌ నది ఉష్ణోగ్రతలు.. 100కుపైగా డాల్ఫిన్లు మృత్యువాత!
Dolphins Dead In Amazon
Follow us on

బ్రెజిలియా, అక్టోబర్ 2: పెరుగుతున్న నీటి ఉష్ణోగ్రతల కారణంగా గత ఏడు రోజులుగా బ్రెజిల్లోని అమెజాన్‌లో 100కి పైగా డాల్ఫిన్‌లు చనిపోయాయి. అమెజాన్‌ నది నీళ్లు దాదాపు 102 డిగ్రీల ఫారెన్‌హీట్‌ ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. బ్రెజిల్లోని లేక్‌ టెఫె ప్రాంతంలో ప్రవహిస్తున్న అమెజాన్‌ నదీ జలాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగడంతో డాల్పిన్లు మృత్యువాత పడుతున్నట్లు మామిరావా ఇన్‌స్టిట్యూట్ పేర్కొంది. పెరుగుతున్న నీటి ఉష్ణోగ్రతలు నదిలోని జలచరాలకు ప్రాణాంతకంగా మారిఉండవచ్చని పర్యవరణ శాస్త్రవేత్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

కాగా అమెజాన్‌ నది ప్రపంచంలోని అతిపెద్ద జలపాతంగా పేరు గాంచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దాని ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఇక్కడి జలాల్లో తరచుగా 39 డిగ్రీల (102 డిగ్రీల ఫారెన్‌హీట్ కంటే ఎక్కువ) ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. పర్యావరణ సమతుల్యానికి ఇది ఆందోళన కలిగించే పరిణామంగా మామిరావా ఇనిస్టిట్యూట్‌ తెలిపింది. ప్రస్తుతం అమెజాన్‌ నదీ పరివాహక ప్రాంతంలోని ఉష్ణోగ్రతల కారణంగా నదిలో నీటి మట్టం సైతం తగ్గిపోతోంది. సుమారు 59 మున్సిపాలిటీల్లో సాధారణ స్థాయి కంటే నీటి మట్టం తక్కువగా ఉన్నట్లు పేర్కొంది. ఇది నదిలో ఇతర జీవాల మనుగడకు ప్రశ్నార్ధకంగా మారుస్తుంది. అంతేకాకుండా నదిలో రవాణా, చేపల వేట వంటి వాటిపై కూడా దీని ప్రభావం ఉంటుందని స్థానిక అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ పరిస్థితులను అధిగమించేందుకు బ్రెజిల్ ప్రభుత్వం ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తోంది. నదిలోని డాల్ఫిన్లను శివార్లలోని మడుగులు, చెరువులకు మార్చడం ద్వారా వాటిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే దీనిపై శాస్త్రవేత్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మామిరావా ఇన్‌స్టిట్యూట్‌లోని పరిశోధకుడు ఆండ్రీ కోయెల్హో మాట్లాడుతూ.. నదిలోని డాల్ఫిన్‌లను ఇతర నదులకు బదిలీ చేయడం అంత సురక్షితమైనది కాదు. ఎందుకంటే వాటిల్లో డాల్ఫిన్లను విడుదల చేసే ముందు క్షుణ్ణంగా తనిఖీ చేయడం ముఖ్యం. టాక్సిన్స్ లేదా వైరస్‌లు ఉన్నాయా, అవి అనుకూలమైన ప్రదేశాలా? కాదా? అనే విషయాన్ని తెలుసుకోవాలని లేదంటే అవి డాల్ఫిన్లపై మరింత ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొన్నారు. మరోవైపు అమెజాన్‌లోని ఈ విపరీత పరిస్థితులకు గత కారణాన్ని త్వరగా గుర్తించడానికి శాస్త్రవేత్తల బృందం సైతం పరిశోధనలు చేస్తోంది.

ఇవి కూడా చదవండి

రాబోయే రెండు వారాల్లో నది ఉష్ణోగ్రత మరింత తీవ్రంగా పెరిగే అవకాశం ఉందని, ఇది డాల్ఫిన్‌ల అధిక మరణాలకు దారితీయవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అమెజాన్ నదిలో ఏర్పడిన ఈ పరిణామం ఆర్థిక వ్యవస్థపైకూ ప్రతికూల ప్రభావం చూపనుంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.