ఆపరేషన్ సింధు.. ఇరాన్ నుంచి ఢిల్లీ చేరుకున్న మరో 311 మంది, ఇప్పటివరకు ఎంత మందిని తరలించారంటే!

అటు ఇజ్రాయోల్, ఇటు అమెరికా దాడులతో రణరంగంగా మారిన ఇరాన్‌లోని భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన 'ఆపరేషన్ సింధు' విజయవంతంగా కొనసాగుతోంది. ఈ ఆపరేషన్‌లో భాగంగా ఇప్పటికే వందల మందిని స్వదేశానికి తీసుకొచ్చిన భారత్‌.. తాజాగా మరో 311 మంది భారతీయులను ఇరాన్‌లోని మష్హద్ నగరం నుంచి ప్రత్యేక విమానంలో దేశ రాజధాని ఢిల్లీకి తీసుకొచ్చింది.

ఆపరేషన్ సింధు.. ఇరాన్ నుంచి ఢిల్లీ చేరుకున్న మరో 311 మంది, ఇప్పటివరకు ఎంత మందిని తరలించారంటే!
Operation Sindh,

Updated on: Jun 22, 2025 | 9:13 PM

ఇరాన్‌-ఇజ్రాయోల్‌ మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్నారు. గత 10 రోజులుగా రెండు దేశాలు చేసుకుంటున్న పరస్పర దాడులతో పచ్చిమాసియాలో యుద్ద వాతావరణం నెలకొంది. ఇదిలా ఉండగా తాజాగా ఇజ్రాయెల్‌తో చేతులు కలిపిన అగ్రరాజ్యం అమెరికా కూడా ఇరాన్‌పై దాడులను ప్రారంభించింది. ఈ క్రమంలోనే అమెరికా శనివారం ఇరాన్‌లోని మూడు ప్రధాన అనుకేంద్రాలను టార్గెట్‌గా చేసుకొని దాడులకు పాల్పడింది. తమ సైన్యం చేసిన దాడిలో ఇరాన్‌లోని మూడు అణుకేంద్రాలు దెబ్బతిన్నట్టు అమెరికా పేర్కొంది. అయితే, అటు ఇజ్రాయెల్, ఇటు అమెరికా దాడులతో రణరంగంగా మారిన ఇరాన్‌లోని భారతీయుల భద్రతపై దృష్టి సారించిన భారత్‌.. వారిని స్వదేశానికి రప్పించేందుకు ఆపరేషన్ సింధు ను చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా ఆదివారం ఇరాన్‌లోని మష్హద్ నగరం నుంచి 311 మంది భారతీయులను ప్రత్యేక విమానంలో దేశ రాజధాని ఢిల్లీకి తీసుకొచ్చింది.

ఇరాన్‌లోని భారతీయులను స్వదేశానికి తరలిస్తున్న వివరాలను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఎప్పటికప్పుడూ తన ఎక్స్‌ ఖాతా ద్వారా తెలియజేస్తూనే ఉన్నారు. తాగాజా “ఆపరేషన్ సింధు తో భాగంగా జూన్ 22వ తేదీ సాయంత్రం 4:30 గంటలకు మష్హద్ నుంచి ప్రత్యేక విమానంలో 311 మంది భారతీయ పౌరులు ఢిల్లీకి చేరుకున్నారని ఆయన తన ఎక్స్‌ ఖాతా ద్వారా వెల్లడించారు. దీంతో ఇరాన్ నుంచి ఇప్పటివరకు మొత్తం 1,428 మంది భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురాగలిగాం అని ఆయన తన ప్రకటనలో తెలిపారు.

అయితే గల్ఫ్ దేశమైన ఇరాన్ నుంచి భారత్‌ తరలిస్తున్న వారిలో ఎక్కువ శాతం కశ్మీర్‌కు చెందిన విద్యార్థులే ఉన్నట్టు విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. దీంతో యుద్ద వాతావరణంతో అట్టుడుకుతున్న భయానక ప్రాంతం నుంచి విద్యార్థులను సురక్షితంగా తీసుకొచ్చినందుకు జమ్మూకశ్మీర్ విద్యార్థుల సంఘం కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపినట్టు తెలుస్తోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..