US OPEC Decision: గుడ్ న్యూస్.. ఫలించిన అమెరికా ప్రయత్నాలు.. తగ్గనున్న చమురు ధరలు..!

US OPEC Decision: ఒపెక్‌ దేశాలపై అమెరికా ఒత్తిడి ఫలించింది. క్రూడాయిల్‌ ఉత్పత్తిని పెంచేందుకు అంగీకరించడంతో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గే అవకాశముంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం

US OPEC Decision: గుడ్ న్యూస్.. ఫలించిన అమెరికా ప్రయత్నాలు.. తగ్గనున్న చమురు ధరలు..!
Opec

Updated on: Jun 04, 2022 | 9:02 AM

US OPEC Decision: ఒపెక్‌ దేశాలపై అమెరికా ఒత్తిడి ఫలించింది. క్రూడాయిల్‌ ఉత్పత్తిని పెంచేందుకు అంగీకరించడంతో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గే అవకాశముంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలు పెట్టినప్పటి నుంచీ ప్రపంచ వ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు రెక్కలొచ్చేశాయి. గత 4 నెలల్లో క్రూడ్ ఆయిల్ ధర ఆకాశాన్నంటింది. ప్రస్తుతం అంతర్జాతీయ మర్కెట్‌లో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 112 నుంచి118 డాలర్ల మధ్య ఉంది. 2020లో కరోనాను నియంత్రించేందుకు పలు దేశాల్లో విధించిన లాక్‌డౌన్ల కారణంగా అప్పట్లో క్రూడ్ ఆయిల్‌కు డిమాండ్ తగ్గింది. దీంతో ధరలు కూడా తగ్గాయి. ఆ సమయంలో ధరల్ని స్థిరీకరించేందుకు క్రూడాయిల్‌ ఉత్పత్తి చేసే ఒపెక్‌ దేశాలు ఉత్పత్తి తగ్గించాయి.

ఉ్రకెయిన్‌ వార్‌ ఎఫెక్ట్‌తో భారత్‌, అమెరికా సహా ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగిపోవడంతో దీని ప్రభావం నిత్యావసర వస్తువుల ధరలపై కూడా పడింది. అమెరికాలో కూడా గతంలో ఎన్నడూ లేని రీతిలో పెట్రోల్‌ ధరలు పెరిగిపోయాయి. దీంతో అగ్రరాజ్యం క్రూడ్‌ ఆయిల్‌ ఉత్పత్తిని పెంచమని ఒపెక్‌ దేశాలను కోరింది.

ఇవి కూడా చదవండి

ఒపెక్‌ దేశాలు సానుకూలంగా స్పందించడంతో ప్రస్తుతం 4.32 లక్షల బ్యారెళ్లు ఉన్నగా ఉత్పత్తి 6.48 లక్షల బ్యారెళ్లకు చేరే అవకాశం ఉంది. దీంతో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు క్రమంగా అదుపులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా ఒపెక్ దేశాల నిర్ణయంతో న్యూయార్క్‌లో క్రూడ్ ఆయిల్ ధర 0.9 శాతం వరకూ పడిపోగా..114.26 డాలర్లకు చేరుకుంది. రానున్న రోజుల్లో మరింతగా తగ్గుతుందని అంఛనా వేస్తున్నారు.