H1-B వీసాపై స్వరం మార్చిన ట్రంప్‌ అంకుల్.. వైట్‌ హౌజ్‌ నుంచి మరో కీలక ప్రకటన

హెచ్‌1 బీ వీసాపై ట్రంప్‌ నిర్ణయం ఎందరో ఉద్యోగార్ధులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈక్రమంలో తాజా 1-B వీసాపై వైట్ హౌస్ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుత వీసాలకు, రెన్యువల్స్ కి తాజా ఫీజు పెంపు నిబంధన వర్తించదని..

H1-B వీసాపై స్వరం మార్చిన ట్రంప్‌ అంకుల్.. వైట్‌ హౌజ్‌ నుంచి మరో కీలక ప్రకటన
USA President Donald Trump on H-1B visa fee

Updated on: Sep 21, 2025 | 10:02 AM

వాషింగ్టన్, సెప్టెంబర్‌ 21: అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే వారికి జారీ చేసే H1-B వీసా దరఖాస్తు ఫీజు పెంపుపై ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు పుట్టిస్తుంది. ట్రంప్‌ నిర్ణయం ఎందరో ఉద్యోగార్ధులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈక్రమంలో తాజా 1-B వీసాపై వైట్ హౌస్ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుత వీసాలకు, రెన్యువల్స్ కి తాజా ఫీజు పెంపు నిబంధన వర్తించదని వెల్లడించింది. కొత్తగా వచ్చే ఏడాది నుంచి జారీ చేయనున్న వీసాలకు మాత్రమే లక్ష డాలర్ల ఫీజు వర్తిస్తుందని వైట్‌హౌస్‌ స్పష్టం చేసింది. 2025 లాటరీ వీసాలకు సైతం పాత ఫీజులే వర్తిస్తాయని వెల్లడించింది. అయితే కొత్తగా హెచ్‌1 బి వీసాకు దరఖాస్తు చేసుకునే వారు లక్ష డాలర్ల ఫీజు జీవిత కాలానికి ఒకసారి మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని స్పష్ఠీకరించింది. ఇప్పటికే H-1B వీసాలు కలిగి ఉన్నవారు, ప్రస్తుతం US వెలుపల ఉన్నవారు తిరిగి ప్రవేశించడానికి ఫీజు వసూలు చేయమని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఎక్స్‌లో చేసిన ట్వీట్‌లో స్పష్టం చేశారు.

ఇది వార్షిక రుసుము కాదు. ఇది పిటిషన్‌కు మాత్రమే వర్తించే ఒకేసారి చెల్లించాల్సిన రుసుము. H-1B వీసా హోల్డర్లు ఎప్పటి మాదిరిగానే దేశం విడిచి వెళ్లి తిరిగి ప్రవేశించవచ్చు. వీరికి నిన్నటి ప్రకటన ఏవిధంగానూ ప్రభావితం చేయదు.. ఇది కొత్త వీసాలకు మాత్రమే వర్తిస్తుంది. ప్రస్తుత వీసాదారులకు, రెన్యువల్‌కు వర్తించదు. ఇది కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి మాత్రమే వర్తిస్తుంది’ అని ఆమె తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఇక H-1B దరఖాస్తులపై భారీగా పెంచిన ధరలు ఆదివారం (సెప్టెంబర్‌ 21) తెల్లవారుజామున 12:1 గంటల, ఆ తర్వాత నుంచి దాఖలు చేసే కొత్త దరఖాస్తులకు మాత్రమే వర్తిస్తుంది. ఇప్పటికే వీసా కలిగి ఉన్నవారికి ఇది వర్తించదు. అయితే శనివారం ట్రంప్ చేసిన ప్రకటనపై క్లారిటీలేకపోవడం వల్ల అనేకమందికి ఆందోళన కలిగించింది. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న H-1B కార్మికులు గడువుకు ముందే తిరిగి రాకపోతే చిక్కుకుపోయే ప్రమాదం ఉందని ఇమ్మిగ్రేషన్ న్యాయవాదులు, టెక్ కంపెనీలు హెచ్చరించాయి. తిరిగి ప్రవేశించడానికి కూడా లక్ష డాలర్ల రుసుము చెల్లించాలేమోనని చాలామంది భయపడ్డారు. అయితే, అది నిజం కాదని తాజాగా వైట్‌ హౌజ్‌ ఇచ్చిన ప్రకటనలో తేలిపోయింది. దీంతో ప్రస్తుతం వీసా కలిగిన వారు ఊపిరిపిల్చుకున్నారు. కొత్త ఫీజు నిర్మాణం మొదట కొత్త దరఖాస్తుదారులకు రాబోయే H-1B లాటరీ సైకిల్‌కు వర్తిస్తుంది. ప్రస్తుత వీసా హోల్డర్లకు లేదా పునరుద్ధరణలకు కాదని ఓ అధికారి తెలిపారు. మరోవైపు తక్షణం యూఎస్‌కు వచ్చేయాలంటూ అక్కడి టెక్‌ కంపెనీలు తమ ఉద్యోగులకు ఈ మెయిళ్లు పంపుతున్న నేపథ్యంలో చెలరేగిన ఈ గందరగోళంపై వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ కరోలిన్‌ లీవిట్‌ ఈ మేరకు క్లారిటీ ఇచ్చారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.