AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP, Telangana News Live: రేపటి నుండి జీఎస్టీ పొదుపు పండుగ.. ప్రతి ఇల్లు స్వదేశీకి చిహ్నంగా మారాలిః మోదీ

Telugu News Headlines today: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సాయంత్రం 5 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. కొత్త GST 2.0 రేట్లు, స్వదేశీని ప్రోత్సహించడం, అమెరికా సుంకాలను పరిష్కరించడంలో భారతదేశం వ్యూహం వంటి కీలక అంశాలను ఆయన ప్రస్తావించే అవకాశం ఉంది. ఇవాళ్టి ప్రధాని మోదీ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

AP, Telangana News Live: రేపటి నుండి జీఎస్టీ పొదుపు పండుగ.. ప్రతి ఇల్లు స్వదేశీకి చిహ్నంగా మారాలిః మోదీ
Andhra Pradesh News Telangana News India News Live Updates
Srilakshmi C
|

Updated on: Sep 23, 2025 | 10:06 AM

Share

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: హెచ్‌-1బీ వీసాకు సంబంధించి అమెరికా లక్ష డాలర్ల షరతు విధించిన సంగతి తెలిసిందే. ధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జారీ చేసిన ఈ కొత్త నిబంధనలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి. ట్రంప్‌ నిర్ణయం ఎంతో మంది భవిష్యత్తుపై ప్రభావం పడనుంది. మరోవైపు భారత్ టెకీలను తక్షణమే అమెరికాకు రావాలంటూ టెక్‌ కంపెనీలు తమ ఉద్యోగులకు కబురు పంపుతున్నాయి. ఈ క్రమంలో అమెరికా కొత్త నిబంధనలపై భారత్‌ స్పందించింది.

అమెరికా నిర్ణయం ఇరు దేశాల్లో సంస్థలను ప్రభావితం చేస్తుందనీ, ఎన్నో కుటుంబాలకు ఇబ్బందికర అంశమని పేర్కొంది. వీటి పరిణామాలను సంబంధిత భారత్‌ కంపెనీలు, భాగస్వామ్య కంపెనీలు అధ్యయనం చేస్తున్నాయని తెలిపింది. ఇక ఆవిష్కరణలు, సృజనాత్మకత వంటి అంశాల్లో రెండు దేశాల్లోని సంస్థలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని భారత్‌ తన ప్రకటనలో పేర్కొంది. నిపుణుల రాకపోకల వల్ల పలు రంగాల్లో సంపద సృష్టించడంలో ఇరు దేశాలు పరస్పరం లబ్ధి పొందినట్లు గుర్తు చేసింది. ప్రస్తుతం అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం ఇరుదేశాల ప్రజలతో ముడిపడిన అంశం. అందువల్ల కొత్త వీసా నిబంధనలతో తలెత్తే ఇబ్బందిని అమెరికా గుర్తెరగాలనీ భారత్ సూచించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తా కథనాలు ఇక్కడ తెలుసుకోండి.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 21 Sep 2025 05:27 PM (IST)

    ప్రతి ఇల్లు స్వదేశీకి చిహ్నంగా మారాలిః మోదీ

    దేశ ప్రజలను ఉద్దేశించి 19 నిమిషాల పాటు చేసిన ప్రసంగంలో, ప్రతి ఇల్లు స్వదేశీకి చిహ్నంగా మారాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. “నేను స్వదేశీని కొంటున్నానని గర్వంగా చెప్పండి” అని అన్నారు.

  • 21 Sep 2025 05:22 PM (IST)

    అభివృద్ధి పోటీలో ప్రతి రాష్ట్రానికి సమాన భాగస్వామ్యంః మోదీ

    జీఎస్టీ సంస్కరణలు తదుపరి తరం సంస్కరణలని ప్రధాని మోదీ అన్నారు. దేశ అవసరాలకు అనుగుణంగా మేము వాటిని అమలు చేసాము. ఈ సంస్కరణలు భారతదేశ వృద్ధిని వేగవంతం చేస్తాయి, వ్యాపారాన్ని సులభతరం చేస్తాయి. పెట్టుబడిని మరింత ఆకర్షణీయంగా చేస్తాయి. అభివృద్ధి రేసులో ప్రతి రాష్ట్రాన్ని సమాన భాగస్వామిగా చేస్తాయి. ఈ జీఎస్టీ సంస్కరణలు “నాగరిక్ దేవో భవ” (ప్రజలే దేవుళ్ళు) అనే మంత్రాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తాయి. అభివృద్ధి చెందిన భారతదేశం లక్ష్యాన్ని సాధించడానికి, మనం స్వావలంబన భారతదేశం వైపు పయనించాలి.’’ అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.

  • 21 Sep 2025 05:20 PM (IST)

    పన్నుల వలలో చిక్కుకున్న చిన్న వ్యాపారులుః మోదీ

    “మన వ్యాపార సోదరులు, సోదరీమణులు పన్నుల వలలో చిక్కుకున్నారు. MSMEలతో అనుబంధించిన వ్యాపారాల నుండి గొప్ప అంచనాలు ఉన్నాయి. మన చిన్న పరిశ్రమలు ఏమి ఉత్పత్తి చేసినా, అవి ప్రపంచంలోనే అత్యుత్తమంగా ఉండాలి” అని ప్రధాని మోదీ అన్నారు.

  • 21 Sep 2025 05:18 PM (IST)

    ‘ఒకే దేశం, ఒకే పన్ను’ కల సాకారమైందిః మోదీ

    జీఎస్టీని సంస్కరించాలనే ఈ నిర్ణయం స్వావలంబన భారతదేశం వైపు ఒక ప్రధాన అడుగు” అని ప్రధాని మోదీ జాతినుద్దేశించి అన్నారు. “జీఎస్టీ సంస్కరణ దేశంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరుస్తుంది. వివిధ పన్నుల కలయికగా ఉన్న మునుపటి పన్ను వ్యవస్థ సామాన్య పౌరుడికి మేలు చేస్తుంది. ప్రజా ప్రయోజనం కోసం, జాతీయ ప్రయోజనం కోసం జీఎస్టీని అమలు చేసాము. ఇప్పుడు దేశం డజన్ల కొద్దీ పన్నుల భారం నుండి విముక్తి పొందింది. ‘ఒకే దేశం, ఒకే పన్ను’ కల సాకారమైంది.” అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

  • 21 Sep 2025 05:11 PM (IST)

    అందరితో కలిసి జీఎస్టీ సంస్కరణను అమలు

    “మేము అన్ని రాష్ట్రాలతో మాట్లాడాము. అందరి ఆందోళనలను పరిష్కరించాము. అందరినీ కలిపి జీఎస్టీ సంస్కరణను అమలు చేయగలిగాము. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కృషి ఫలితంగా జీఎస్టీ సంస్కరణను అమలు చేయగలిగాము” అని ప్రధాని మోదీ అన్నారు. కొత్త జీఎస్టీ సంస్కరణలు నిత్యావసర వస్తువులను చౌకగా చేస్తాయని పేర్కొన్నారు. అటువంటి వస్తువులు పన్ను రహితంగా ఉంటాయి లేదా 5 శాతం పన్ను మాత్రమే విధించడం జరుగుతుందని ప్రధాని తెలిపారు.

  • 21 Sep 2025 05:09 PM (IST)

    రేపటి నుండి అందరికీ తీపి కబుర్లుః ప్రధాని మోదీ

    నవరాత్రి మొదటి రోజున స్వావలంబన దిశగా ఒక పెద్ద అడుగు వేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రేపటి నుండి అందరికీ తీపి కబుర్లు అందుతాయన్నారు. పొదుపు పండుగ నుండి అందరూ ప్రయోజనం పొందుతారన్నారు. ఈ కొత్త రేట్లు అనేక వస్తువుల ధరలను తగ్గిస్తాయని, సామాన్యులకు గణనీయమైన ఉపశమనం కలిగిస్తాయని అన్నారు. జీఎస్టీ అమలు తర్వాత ఇది అతిపెద్ద సంస్కరణగా భావిస్తున్నారు.

  • 21 Sep 2025 05:05 PM (IST)

    జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం

    జీఎస్టీ సంస్కరణలపై జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతున్నారు. లైవ్ దిగువన చూడండి …

  • 21 Sep 2025 05:05 PM (IST)

    జీఎస్టీ పొదుపు పండుగ ప్రారంభంః ప్రధాని

    జాతినుద్దేశించి ప్రసంగిస్తూ ప్రధాని మోదీ, “రేపు జీఎస్టీ పొదుపు పండుగ ప్రారంభమవుతుంది; అందరికీ ఒక  పండుగ తీసుకువచ్చిందన్నారు ప్రధాని. ఈ పొదుపులు భారతదేశ వృద్ధిని పెంచుతాయి” అని అన్నారు.

  • 21 Sep 2025 04:07 PM (IST)

    రియాలిటీ షో బిగ్ బాస్ 9ను నిలిపివేయాలిః ఓయూ జేఏసీ

    తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు భంగం కలిగిస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ 9ను నిలిపివేయాలని ఓయూ జేఏసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. బతుకమ్మ, దసరా నవరాత్రుల సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో బిగ్ బాస్ షోను నిలిపివేయాలని ఓయూ జేఏసీ ప్రభుత్వాన్ని కోరింది. బతుకమ్మ అంటేనే తెలంగాణ ప్రజల జీవన విధానం అలాంటి బతుకమ్మ సంబరాలు జరుగుతున్న సమయంలో రాష్ట్రంలో ఒక పక్క “బిగ్ బాస్ షో” పేరుట తెలంగాణ సంస్కృతిని, అస్తిత్వాన్ని దెబ్బ తీయాలని ప్రయత్నిస్తున్న షో లను తక్షణమే నిలిపివేయాలని హెచ్చరించారు.

  • 21 Sep 2025 04:04 PM (IST)

    60 రోజులు సభకు రాకపోతే అనర్హులుః ఆర్ఆర్ఆర్

    వైసీపీ నేతల తీరును తప్పుబట్టారు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. ఎవరైనా లీవ్ ఆఫ్ ఆక్షన్స్ అడగకుండా 60 రోజులు సభకు రాకపోతే ఎమ్మెల్యే, ఎంపీ సభ్యత్వానికి అనర్హులన్నారు. అసెంబ్లీ రూల్స్‌లో ఇది స్పష్టంగా ఉందన్నారు. మాజీ సీఎం, వైసీపీ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఏపీ డిప్యూటీ స్పీకర్ మండిపడ్డారు.

  • 21 Sep 2025 03:27 PM (IST)

    ఇవాళ, రేపు ఉరుములు, మెరుపులతో భారీ వర్షం

    ఈశాన్య బంగాళాఖాతం ప్రాంతం నుండి మధ్య బంగాళాఖాతం మీదుగా ఉత్తర తమిళనాడు దాని సమీపంలోని దక్షిణ ఆంధ్ర కోస్తా తీరం వరకు సగటు సముద్రమట్టం నుండి 5.8 కి మీ మధ్యలో ద్రోణి కొనసాగుతోంది. ఈనెల 25న తూర్పు మధ్య బంగాళాఖాతం దాని సమీపంలోని ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. పశ్చిమ వాయువ్యదిశలో కదిలి వాయువ్య దాని సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో దక్షిణ ఒడిస్సా ఉత్తర ఆంధ్ర కోస్తా తీరం సమీపంలో ఈనెల 26వ తారీకు నాటికి అల్పపీడనం వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. వాయుగుండం దక్షిణ ఒడిస్సా ఉత్తరాంధ్ర కోస్తా తీర ప్రాంతంలో ఈ నెల 27వ తారీఖు నాటికి తీరాన్ని దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఈ రోజు, రేపు తెలంగాణలోని కొన్ని జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు , మెరుపులతో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో అక్కడక్కడ గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్లు హెచ్చరించారు.

  • 21 Sep 2025 03:20 PM (IST)

    జలాల్లో వాటా కోసం ఎవరితోనైనా పోరాడతాంః ఉత్తమ్

    ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపునకు తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకమన్నారు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి. ఆల్మట్టి డ్యాంపై సుప్రీంలో కేసు నడుస్తోందని చెప్పారు తాను రేపు ఢిల్లీకి వెళ్తానని.. ఆల్మట్టి ఎత్తు పెంపుపై వ్యతిరేకంగా తమ వాదనలు వినిపిస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరుగుతోందని.. తప్పు చేసినవాళ్లు ఎంతటి వారైనా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కృష్ణా, గోదావరి జలాల్లో రావాల్సిన వాటా కోసం ఏ రాష్ట్రంతోనైనా పోరాడతామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

  • 21 Sep 2025 03:18 PM (IST)

    బతుకమ్మ పండగ వేళ పూల మార్కెట్స్‌లో సందడి

    బతుకమ్మ పండగ వేళ పూల మార్కెట్స్‌లో సందడి నెలకొంది. బతుకమ్మ, నవరాత్రుల సందర్భంగా హైదరాబాద్‌లోని పూల మారెట్లన్నీ కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. దీంతో పూలకు గిరాకీ పెరిగింది. పూలకు డిమాండ్‌ ఎక్కువే ఉన్నా ధర మాత్రం గతం కంటే తక్కువే ఉందని కొనుగోలుదారులు చెబుతున్నారు.

  • 21 Sep 2025 03:17 PM (IST)

    బతుకమ్మ వేడుకలకు సర్వం సిద్ధం

    తెలంగాణలో బతుకమ్మ వేడుకలకు సర్వం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ప్రారంభం కాబోతున్నాయి. హనుమకొండలోని వేయి స్తంభాల గుడి ఆవరణలో నిర్వహించే ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలకు అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు నలుగురు మంత్రులు పాల్గొననున్నారు.

  • 21 Sep 2025 03:14 PM (IST)

    జీఎస్టీ రేట్ల తగ్గింపుతో లక్ట్రానిక్‌ మార్కెట్‌ ఫుల్ జోష్!

    జీఎస్టీ రేట్ల తగ్గింపుతో ఎలక్ట్రానిక్‌ మార్కెట్‌లో ఫుల్‌ జోష్‌ కనిపిస్తోంది. 28 నుంచి 18శాతానికి ఎలక్ట్రానిక్ గూడ్స్‌ తగ్గటంతో కస్టమర్లు క్యూ కట్టబోతున్నారు. ఎయిర్ కండిషనర్ల రేట్లు తగ్గబోతున్నాయి. 32 ఇంచెస్‌ కంటే పెద్ద టెలివిజన్లు తగ్గముఖం పడతాయని భావిస్తున్నారు. వీటితో పాటు మానిటర్లు, ప్రొజెక్టర్లు, డిష్ వాషింగ్ మెషీన్ల రేట్లు కూడా తగ్గబోతున్నాయి.

  • 21 Sep 2025 03:12 PM (IST)

    మరోసారి దేశ ప్రజలకు ప్రధాని సందేశం

    ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారిగా నవంబర్ 8, 2016న దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు, నోట్ల రద్దును ప్రకటించారు. ఆ తర్వాత COVID-19 మహమ్మారి సమయంలో ఆయన లాక్‌డౌన్ ప్రకటించారు. అయోధ్యలోని రామమందిరంపై సుప్రీంకోర్టు నిర్ణయం, జమ్మూ కాశ్మీర్ నుండి ఆర్టికల్ 370 రద్దు తర్వాత కూడా ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. తాజాగా మరోసారి దేశ ప్రజలకు సందేశం ఇవ్వబోతున్నారు.

  • 21 Sep 2025 03:05 PM (IST)

    బంగ్లాదేశ్‌లో భారీ భూకంపం

    ఆదివారం బంగ్లాదేశ్‌లో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం బంగ్లాదేశ్‌లో ఉన్నప్పటికీ, అది భారత సరిహద్దుకు చాలా దగ్గరగా ఉంది. ఈ భూకంపం కారణంగా, భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో కూడా భూమి కంపించింది. ఈ భూకంపం గరిష్ట ప్రభావం మేఘాలయలో కూడా కనిపించింది. అయితే, ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదు. బంగ్లాదేశ్‌ను ఆనుకుని ఉన్న మేఘాలయ సరిహద్దు సమీపంలో భారత కాలమానం ప్రకారం ఉదయం 11.49 గంటలకు భూకంపం సంభవించిందని అధికారులు తెలిపారు. మేఘాలయలో ఎటువంటి నష్టం లేదా ప్రాణనష్టం సంభవించినట్లు తక్షణ వార్తలు లేవని వారు తెలిపారు. మేఘాలయతో పాటు, త్రిపుర, అస్సాం మరియు మిజోరాంలోని అనేక ప్రాంతాలలో కూడా భూకంపం ప్రకంపనలు సంభవించాయి.

  • 21 Sep 2025 01:21 PM (IST)

    సామాన్యుడికి గుడ్‌న్యూస్‌.. నేటి అర్ధరాత్రి నుంచి వీటి ధరలు ఢమాల్!

    జీఎస్టీ పన్ను రేట్లు తగ్గడంతో వస్తువుల ధరలు దిగిరానున్నాయి. నేటి అర్ధరాత్రి నుంచి వస్తువుల ధరలపై అమలు కానున్న నూతన పన్ను రేటు. స్వల్పంగా తగ్గనున్న పాలు, నెయ్యి, పన్నీర్, చీజ్, డ్రై ఫ్రూట్స్, స్వీట్స్, ఫ్రూట్ జ్యూస్ ధరలు. స్వల్పంగా తగ్గనున్న సబ్బులు, షాంపూ, టూత్‌పేస్ట్, టూత్‌బ్రష్, ఫేస్ పౌడర్, హెయిర్ ఆయిల్, టాల్కం పౌడర్ ధరలు. ఎయిర్ కండీషనర్లు, డిష్‌వాషర్లు, టీవీలు (LCD/LED), రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు పై 5-10వేల వరకు తగ్గనున్న ధరలు. కార్లు (హ్యాచ్‌బ్యాక్, SUVలు), 350సీసీ వరకు బైకులు పై 50వేల నుంచి లక్ష వరకు తగ్గనున్న ధరలు. రూ.50,000-1.5 లక్షలు తగ్గనున్న మారుతి, మహీంద్రా, కియా, స్కోడా కార్ల ధరలు

    • తగ్గనున్న టెక్స్‌టైల్స్, షూస్ ధరలు
    • తగ్గనున్న పెన్సిల్స్, క్రేయాన్స్, ఎక్సర్‌సైజ్ బుక్స్, నోట్‌బుక్స్, మ్యాప్స్, గ్లోబ్స్, ఎరేసర్ల ధరలు
    • తగ్గనున్న లైఫ్ హెల్త్ ఇన్సూరెన్స్, యోగా జిమ్ సర్వీసెస్, బ్యార్బర్/సెలూన్ సర్వీసెస్, మెడిసిన్స్, బ్యాటరీల ధరలు
    • లగ్జరీ ఉత్పత్తులు, ఎరేటెడ్ డ్రింక్స్, పొగాకు పై 40శాతం పన్నులు
  • 21 Sep 2025 12:59 PM (IST)

    కేఏ పాల్‌పై కేసు.. యువతి లైంగిక వేధింపుల ఆరోపణలు

    ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌పై పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఓ యువతి తనను లైంగికంగా వేధించాడంటూ కేఏ పాల్‌పై ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

  • 21 Sep 2025 12:52 PM (IST)

    తిరుమల శ్రీవారి సన్నిదిలో పలువురు VIPలు

    తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న పలువురు VIPలు. మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం, బళ్లారి రూరల్ ఎమ్మెల్యే నాగేంద్ర, బీజేపీ నేత విష్ణు వర్ధన్ రెడ్డి, నటుడు రఘు.. శ్రీవారిని దర్శించుకున్నారు.

  • 21 Sep 2025 12:50 PM (IST)

    బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలతోపాటే జూబ్లిహిల్స్ ఎన్నికలు కూడా..

    బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటే జూబ్లిహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల. సెప్టెంబర్ 30న జూబ్లిహిల్స్ తుది ఓటర్ల జాబితా ప్రకటించనున్న ఎన్నికల సంఘం. సెప్టెంబర్ 2 న డ్రాఫ్ట్ ఎలక్టరల్ రోల్ ప్రచురించిన ఈసీ. క్లెయిమ్స్ ఆబ్జెక్షన్స్ ఫైలింగ్ కి సెప్టెంబర్ 17 తో ముగిసిన గడువు. సెప్టెంబర్ 25 న ముగియనున్న క్లెయిమ్స్ డిస్పోజల్. జూబ్లీ హిల్స్ లో మొత్తం 3.92 లక్షల ఓటర్లు. జూబ్లిహిల్స్ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ. గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రూపొందిస్తున్న బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ. మరో రెండు వారాల్లో అభ్యర్థులపై రానున్న స్పష్టత. BRS ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ జూన్ 8న అనారోగ్యంతో మరణించడం వల్ల జూబ్లిహిల్స్ స్థానానికి ఏర్పడిన ఉప ఎన్నిక.

  • 21 Sep 2025 12:01 PM (IST)

    బాబోయ్‌.. ఇవాళ మళ్లీ కుండపోత వాన!

    ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం (సెప్టెంబర్‌ 21) కుండపోత వాన కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబాబాద్, మహబూబ్ నగర్, కామారెడ్డి జిల్లాల్లో భారీవర్షాలు కురవనున్నాయి. దీంతో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. సోమవారం కూడా కొన్ని జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

  • 21 Sep 2025 11:28 AM (IST)

    నేటి అర్ధరాత్రి నుంచి కొత్త GST ధరలు.. సాయంత్రం 5 గంటలకు మోదీ ప్రసంగం

    ఈ సాయంత్రం 5 గంటలకు జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం. నేటి అర్థరాత్రి నుంచి అమల్లోకి రానున్న జీఎస్టీ కొత్త ధరలు. జీఎస్టీ కొత్త రేట్ల ముందు ఆసక్తిగా మారిన మోదీ ప్రసంగం. రేపటి నుంచి అమలులోకి జీఎస్టీ 2.0. ఇవాళ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్న 56వ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలు. ఇకపై 5, 18, 40 శాతం పన్ను స్లాబులు. 200పైగా వస్తువులపై పన్ను తగ్గించి, మధ్యతరగతి, సామాన్యులకు ఊరట కల్పించిన కేంద్రం. గతంలో 12 శాతం స్లాబ్‌లోని 99 శాతం వస్తువులు 5 శాతం స్లాబ్‌లోకి వస్తాయి. 28 శాతం స్లాబ్‌లోని 90 శాతం వస్తువులు 18 శాతంలోకి రాబోతున్నాయి

  • 21 Sep 2025 11:26 AM (IST)

    జీఎస్టీ ఎఫెక్ట్.. భారీగా దిగొస్తున్న ధరలు!

    జీఎస్టీ పన్ను రేట్లు తగ్గడంతో తగ్గనున్న వస్తువుల ధరలు. వస్తువు ధరలపై అమలు కానున్న నూతన పన్ను రేటు. స్వల్పంగా తగ్గనున్న పాలు, నెయ్యి, పన్నీర్, చీజ్, డ్రై ఫ్రూట్స్, స్వీట్స్ ,ఫ్రూట్ జ్యూస్, సబ్బులు, షాంపూ, టూత్‌పేస్ట్, టూత్‌బ్రష్, ఫేస్ పౌడర్, హెయిర్ ఆయిల్, టాల్కం పౌడర్ ధరలు. ఎయిర్ కండీషనర్లు, డిష్‌వాషర్లు, టీవీలు (LCD/LED), రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు పై 5-10వేల వరకు తగ్గనున్న ధరలు. కార్లు (హ్యాచ్‌బ్యాక్, SUVలు), 350 సీసీ వరకు బైకులు పై 50వేల నుంచి లక్ష వరకు తగ్గనున్న ధరలు. రూ.50,000-1.5 లక్షలు తగ్గనున్న మారుతి, మహీంద్రా, కియా, స్కోడా కార్లు, టెక్స్‌టైల్స్, షూస్ ధరలు తగ్గనున్నాయి.

  • 21 Sep 2025 11:03 AM (IST)

    పవర్ స్టార్ ‘OG’ ట్రైలర్ వాయిదా.. రిలీజ్ ఎప్పుడంటే?

    పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘ఓజీ’ ట్రైలర్ వాయిదా పడింది. సినిమా రిలీజ్‌కు ఇంకా ఐదు రోజులు మాత్రమే ఉండటంతో చిత్ర బృందం హడావిడి చేస్తుంది. ఇందులో భాగంగానే ఈరోజు ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయాలని భావించింది. కానీ కొన్ని గంటలు వాయిదా వేసిన‌ట్లు తెలిపింది. ఇదే రోజు సాయంత్రం ‘ఓజీ’ కాన్సర్ట్‌లో విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. కాగా దసరా కానుకగా స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ ఓజీ సెప్టెంబర్ 25న విడుదల చేయనున్న సంగతి తెలిసిందే.

  • 21 Sep 2025 10:47 AM (IST)

    100 ఎకరాలకుపైగా ప్రభుత్వ స్థలం కబ్జా.. భారీ ఫోర్స్‌తో రంగంలో హైడ్రా

    మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజక వర్గం గాజులరామారం సర్వేనెంబర్ 307 342.329/1. 348. సర్వే నెంబర్లలో అక్రమ కట్టడాలను కూల్చివేతలకు రంగం సిద్ధం చేస్తున్న హైడ్రా అధికారులు, సిబ్బంది. కుత్బుల్లాపూర్ మండలంలోని గాజులరామారంలో హైడ్రా కూల్చివేతలు. 100 ఎకరాలకు పైగా ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించిన కబ్జాదారులు. 60 నుంచి 70 గజాల్లో ఇండ్లను నిర్మించి 10 లక్షల చొప్పున విక్రయిస్తున్న ఆక్రమణదారులు. ఆక్రమణలపై ఫిర్యాదులు అందడంతో భారీ ఫోర్స్‌తో రంగంలోకి దిగిన హైడ్రా. సర్వే నంబర్ 307,329,342,348ల లో నిర్మించిన అక్రమ ఇళ్లను కూల్చి వేస్తున్న హైడ్రా. పేదల ఇళ్లను ఖాళీ చేయించి కుల్చమని గతంలో చెప్పిన కమిషనర్. కబ్జాదారులపై చర్యలు తీసుకుని పేదల గృహాలను కూల్చోద్దని అంటున్న బాధితులు.

  • 21 Sep 2025 10:43 AM (IST)

    ఏటిగట్టుపై రోడ్డుకు అడ్డంగా భారీ కొండ చిలువ.. స్థానికులపై దాడి

    కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం గోవలంక ఏటిగట్టు పై భారీ కొండ చిలువ హల్చల్ చేసింది. యానాం నుండి జొన్నడా వెళ్లే గోవలంక వద్ద ఏటిగట్టు పై దారికి అడ్డంగా ఎటు కదలకుండా భారీ కొండచిలువ కనబడటంతో ప్రయాణికులు, స్థానికులు భయబ్రాంతులకు గురైనారు. దారికి అడం గా ఉన్న కొండ చిలువ పై కర్రలతో దాడి చేసిన స్థానికులు.. దాడి చేయడం తో కొండచిలువ స్థానికులు. దీంతో కొండ చిలువ తిరగబడడంతో స్థానికులు పరుగులు తీశారు. స్థానికుల దాడితో చీకటిలో ప్రక్కనే ఉన్న పొదల లోకి కొండ చిలువ వెళ్లి పోవడంతో ఏమి చేయలేక వెనుదిరిగిన స్థానికులు.

  • 21 Sep 2025 10:23 AM (IST)

    రేపట్నుంచి అమూల్‌ బ్రాండ్‌ ఉత్పత్తుల ధరలు తగ్గుతున్నాయ్‌!

    అమూల్‌ బ్రాండ్‌ డెయిరీ ఉత్పత్తుల ధరలు తగ్గనున్నాయి. ఈ మేరకుగుజరాత్‌ కోఆపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ (జీసీఎంఎంఎఫ్‌).. తయారు చేస్తున్న 700కు పైగా ఉత్పత్తుల ధరలను సెప్టెంబర్‌ 22 నుంచి తగ్గించనున్నట్లు ప్రకటించింది.

  • 21 Sep 2025 10:20 AM (IST)

    కూరగాయల సంతలో నకిలీ రూ.200 నోట్ల కలకలం..!

    సిద్దిపేట జిల్లా దుబ్బాకలో నకిలీ రూ.200 నోట్లు కలకలం రేపాయి. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు నిన్న శనివారం సంత కావడంతో సంతలో ఎక్కువ జనాభా రద్దీగా ఉంటుందని తెలుసుకున్న కొందరు వ్యక్తులు రూ.200 నోట్లను తీసుకువచ్చి మార్కెట్లో కూరగాయలు విక్రయిస్తున్న మహిళకు ఈ నకిలీ నోట్లోను ఇచ్చి వెళ్లారు. కూరగాయలు విక్రయించే వ్యక్తి మరో వ్యక్తికి ఇచ్చే సందర్భంలో ఆ నోట్లు నకిలీవిగా గుర్తించారు. అన్ని నోట్లపై ఒకే సీరియల్ నంబర్లు ఉండడంతో నకిలీ నోట్లుగా గుర్తించి అక్కడున్న వారంతా.. మార్కెట్లో నకిలీ నోట్లు చేలమని అవుతున్నాయని జాగ్రత్తగా ఉండాలంటూ ప్రచారం చేశారు. దుబ్బాకలో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. కేటుగాళ్లు జనాలు రద్దీగా ఉండే ప్రాంతాన్ని ఎంచుకొని దొంగ నోట్ల చలామానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.

  • 21 Sep 2025 10:16 AM (IST)

    పొంగి పొర్లుతున్న వెదుళ్లు వాగు.. నిలిచిపోయిన రాకపోకలు

    ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం చౌటపల్లి – జి.కొత్తూరు మధ్య ఉన్న వెదుళ్లు వాగు ప్రమాదకరంగా పొంగుతుంది. రాత్రి ఎగువున కుర్చిన వానకు వరద ప్రభావం ఎక్కువగా ఉంది. రాకపోకలు పూర్తిగా నిలిసిపోయిన వైనం.

  • 21 Sep 2025 10:10 AM (IST)

    గ్యాస్ లారీని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

    అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం వేంపాడు టోల్ ప్లాజా వద్ద తప్పిన పెను ప్రమాదం. ఆగి వున్న గ్యాస్ లారీని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు. ప్రయాణికులు సురక్షితం.

  • 21 Sep 2025 10:08 AM (IST)

    విద్యార్థులను చితకబాదిన ప్రిన్సిపల్.. నోటీసులు జారీ చేసిన DEO

    అనకాపల్లి జిల్లాలో ప్రిన్సిపల్ విద్యార్థులను చితకబాదిన ఘటన కలకలం రేపింది. ప్రిన్సిపల్ రాజశేఖర్ పై కేసు నమోదు. 181(1), జువైనల్ జస్టిస్ యాక్ట్ BNS 75 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు. స్కూలు యాజమాన్యానికి నోటీసులు జారీయే చేసిన డీఈఓ.

  • 21 Sep 2025 10:05 AM (IST)

    వాగు దాటుతుండగా.. కొట్టుకుపోయిన కారు!

    యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక – గట్టుప్పల్ మధ్యలో గల ఆర్మల్ల వాగులో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి కారు కొట్టుకుపోయింది. గత నాలుగైదు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు ఒక్కసారిగా వరద రోడ్డుపై నుంచి రావడంతో వాగు దాటే ప్రయత్నం చేసిన కార్ డ్రైవర్, వాగు మధ్యలోకి రాగానే వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. డ్రైవర్‌ సమయస్ఫూర్తితో కారులో నుంచి కిందికి దిగి ప్రాణాలు కాపాడుకున్నాడు. కారులో డ్రైవర్ ఒక్కడే ఉండడంతో హుటాహుటిన కారులోనుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు.

  • 21 Sep 2025 08:05 AM (IST)

    నేడే ‘ఓజీ’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌.. అంచనాలు వేరే లెవెల్‌!

    పవన్‌కల్యాణ్‌ హీరోగా సుజీత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న గ్యాంగ్‌స్టర్‌ మూవీ ‘ఓజీ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్)’. ఇప్పటికే ఈ మువీ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ రోజు ఉదయం 10.8 గంటలకు ‘ఓజీ’ ట్రైలర్ విడుదల కానుంది. ఇక ఈ మూవీ సెప్టెంబరు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • 21 Sep 2025 07:34 AM (IST)

    నేడు, రేపు ఉరుములు, మెరుపులతో వానలు

    మధ్యప్రదేశ్ మీదుగా పశ్చిమ విదర్భ వరకు సగటు సముద్రమట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్న ఉపరితల చక్రవత ఆవర్తనం. దక్షిణ కోస్తా ఆంధ్ర తీరం, రాయలసీమ, ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ మహారాష్ట్ర తీరం వరకు కొనసాగుతున్న ద్రోణి. ఈ రోజు తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలలో అక్కడక్కడ మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉంది.

    రేపు ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల్, నిజామాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాలలో అక్కడక్కడ మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ రోజు, రేపు తెలంగాణలోని అన్ని జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది.

  • 21 Sep 2025 07:28 AM (IST)

    మెగా డీఎస్సీ నియామక పత్రాల అందజేతకు డేట్‌ ఫిక్స్.. ఇంతకీ ఎప్పుడంటే?

    ఆంధ్రప్రదేశ్‌ మెగా డీఎస్సీలో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 25న నియామక పత్రాలు ఇవ్వనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. అమరావతిలో నిర్వహించే కార్యక్రమంలో సీఎం చేతుల మీదుగా అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఈనెల 19న నిర్వహించాల్సి ఉండగా, వర్షాల కారణంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

  • 21 Sep 2025 07:26 AM (IST)

    అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు.. సీఎం రేవంత్‌ కీలక నిర్ణయం

    సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మంత్రులతో కీలక సమావేశం. గంటపాటు సాగిన సమావేశంలో ముఖ్య నిర్ణయాలు తీసుకున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు నిర్ణయంపై త్వరలో GO జారీ చేయనున్న ప్రభుత్వం. సెప్టెంబర్ నెలాఖరులోపు ఎన్నికలు జరపాలని హైకోర్టు ఆదేశం. ఈ ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్‌లో ఎన్నికలకు వెళ్ళేలా ప్రణాళిక. ఈ మేరకు హైకోర్టును సమయం కోరాలని నిర్ణయించారు.

  • 21 Sep 2025 07:24 AM (IST)

    హైవేపై అదుపుతప్పి డివైడర్‌ని ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

    బాపట్ల జిల్లా మార్టూరు మండలం కోలలపూడి దగ్గర హైవేపై అదుపుతప్పి డివైడర్ ని ఢీకొట్టిన కారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి. మరో ఇద్దరికి స్వల్ప గాయాలు. మృతులను దామర్ల లక్ష్మణ్ (70), భార్య సుబ్బాయమ్మ (65), మనవడు హేమంత్ (25)గా గుర్తింపు.

  • 21 Sep 2025 07:21 AM (IST)

    H1-B వీసా ఫీజు పెంపుపై ట్రంప్ యూటర్న్

    H1-B వీసా ఫీజు పెంపుపై వైట్ హౌస్ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుత వీసాలకు, రెన్యువల్స్ కి ఫీజు పెంపు వర్తించదని వెల్లడించింది. కొత్తగా వచ్చే ఏడాది నుంచి జారీ చేయనున్న వీసాలకు మాత్రమే లక్ష డాలర్ల ఫీజు వర్తిస్తుందని స్పష్టం చేసింది.2025 లాటరీ వీసాలకు సైతం పాత ఫీజులే వర్తిస్తాయని వెల్లడించింది. లక్ష డాలర్ల ఫీజు జీవిత కాలానికి ఒకసారి మాత్రమే ఉంటుందని స్పష్ఠీకరణ.

  • 21 Sep 2025 06:50 AM (IST)

    నిర్లక్ష్యానికి పరాకాష్ఠ.. రోగికి ‘O’ పాజిటివ్‌కు బదులు ‘B’ పాజిటివ్‌ బ్లడ్‌ గ్రూప్‌ ఎక్కించిన వైద్యులు

    వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిలో వైద్యులు నిర్లక్ష్యంగా ఓ రోగికి ఒక గ్రూపు రక్తానికి బదులుగా మరో గ్రూపు రక్తం ఎక్కించారు. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం అయోధ్యపురానికి చెందిన జ్యోతి (34) జ్వరం, శ్వాసకోశ సమస్యతో బాధపడుంది. వైద్యులు ఆమెకు రక్తం ఎక్కించాలని చెప్పడంతో శాంపిల్‌ తీసి రక్తనిధి కేంద్రానికి పంపించారు. అయితే ఆమెది ‘ఓ’ పాజిటివ్‌ బ్లడ్‌ గ్రూప్‌గా నిర్ధారనైంది. అయితే జూనియర్‌ డాక్టర్లు సెప్టెంబర్‌ 18న ఆమెది ‘ఓ’ పాజిటివ్‌ బ్లడ్‌ అయితే ఎంత చెప్పినా వినిపించుకోకుండా ‘బీ’ పాజిటివ్‌ బ్లడ్‌ ప్యాకెట్‌ ఎక్కించినట్లు బాధితురాలి ఆరోపణ. దీంతో జ్యోతికి కడుపులో నొప్పి, విరేచనాలు మొదలయ్యాయి. శనివారం మరో ప్యాకెట్‌ రక్తం ఎక్కించాల్సి ఉండగా ఆమె బ్లడ్‌గ్రూప్‌ మరోమారు టెస్ట్‌ చేయగా ఈ వ్యవహారం బయటపడింది.

  • 21 Sep 2025 06:40 AM (IST)

    పూలను దేవతగా కొలిచే బతుకమ్మ పండగ… అందుకే వెరీ స్పెషల్: మాజీ సీఎం కేసీఆర్

    పూలను దేవతగా కొలిచే తెలంగాణ బతుకమ్మ పండగ ప్రపంచ సంస్కృతీ సంప్రదాయాల్లో ప్రత్యేకతను చాటుతోందని మాజీ సీఎం కేసీఆర్‌ తెలిపారు. నాటి తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ అస్తిత్వ ఆకాంక్షలకు బతుకమ్మ ప్రధాన సాంస్కృతిక వేదికగా నిలిచిందని అన్నారు.

  • 21 Sep 2025 06:33 AM (IST)

    బతుకమ్మ మనందరి జీవితాల్లో వెలుగులు నింపాలని గౌరమ్మను ప్రార్ధిస్తున్నా.. సీఎం రేవంత్‌

    ఎంగిలిపూల నుంచి సద్దుల వరకూ తొమ్మిది రోజులు ఆడబిడ్డలందరూ కలిసి ఆట పాటలతో బతుకమ్మ పండగ జరుపుకోనున్నారు. ఈ పండగ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని, అందరూ ఆరోగ్య ఆనందాలతో ఉండాలని గౌరమ్మను ప్రార్థిస్తున్నాట్లు సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ సామూహిక జీవన విధానానికి, ఐక్యతకు బతుకమ్మ పండగ నిదర్శనమని అన్నారు.

  • 21 Sep 2025 06:31 AM (IST)

    బతుకమ్మ సంబరాలకు గిన్నిస్ బుక్ రికార్డ్స్‌‌‌‌‌‌‌‌లో స్థానం.. GHMC స్పెషల్‌ ఏర్పాట్లు

    బతుకమ్మ వేడుకలను ఈ నెల 21 నుంచి 30 వరకు ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాదు తెలంగాణ సంప్రదాయాలను అంతర్జాతీయ స్థాయిలో చాటిచెప్పాలన్న సంకల్పంతో ఈ సారి బతుకమ్మ సంబురాలను ఘనంగా జరిపేందుకు పర్యాటకశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 28న హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో 10 వేల మంది మహిళలతో బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌‌‌‌‌‌‌‌లో స్థానం సంపాదించేలా జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ ఈ సంబురాలను నిర్వహిస్తోంది.

  • 21 Sep 2025 06:29 AM (IST)

    బతుకమ్మ పండగకు పొలిటికల్‌ ఫ్లేవర్‌

    బతుకమ్మ పండగకు ఈసారి పొలిటికల్‌ ఫ్లేవర్‌ కూడా యాడ్‌ అయింది. తెలంగాణ ఉద్యమం నుంచే బతుకమ్మను ఓన్‌ చేసుకున్న బీఆర్‌ఎస్‌… అధికారంలోకి వచ్చాక కల్వకుంట్ల కవిత సారథ్యంలోని తెలంగాణ జాగృతి సంస్థ ద్వారా బతుకమ్మను తమ బ్రాండ్‌గా మార్చుకుంది. అయితే ఈసారి అన్ని పార్టీలు పోటాపోటీ కార్యక్రమాలకు రెడీ అయ్యాయి.

  • 21 Sep 2025 06:28 AM (IST)

    నేటి నుంచే బతుకమ్మ సంబరాలు.. మహిళలకు గవర్నర్, సీఎం శుభాకాంక్షలు

    తెలంగాణ బతుకమ్మ సంబరాలు ఆదివారం (సెప్టెంబర్‌ 21) నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ, సీఎం రేవంత్‌రెడ్డి మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ మాతృ ప్రకృతితో ముడిపడి ఉన్న ఒక ప్రత్యేకమైన పండగని, ఇది తెలంగాణ మహిళల జీవిత వేడుక. గౌరీదేవి ఆశీస్సులతో అందరికీ మంచి ఆరోగ్యం సమకూరాలని గవర్నర్‌ ఆకాంక్షించారు.

Published On - Sep 21,2025 6:23 AM

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..