ఫిన్లాండ్, ఏప్రిల్ 2: ఫిన్నిష్ రాజధాని ఫిన్‌లాండ్‌లోని ఓ పాఠశాలలో కాల్పుల మోత కలకలం రేపింది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులకు బుల్లెట్లు తగిలాయి. వారిలో ఒక విద్యార్ధి మృతి చెందగా.. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పాఠశాలకు తుపాకీ తీసుకొచ్చి కాల్పులు చేపట్టిన 12 ఏళ్ల తోటి విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాఠశాల వద్ద ఓ భవనాన్ని పోలీసులు చుట్టుముట్టి కాల్పులు జరిపిన విద్యార్ధిని అదుపులోకి తీసుకున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను వందల మీటర్ల దూరంలో ఉన్న మరో పాఠశాల భవనం నుంచి తీసుకువెళ్లారు. పాఠశాలకు దూరంగా సిల్టమాకి శివారులో నిందిత విద్యార్ధిని పోలీసులు అరెస్టు చేసి, తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. అయితే కాల్పులకు పాల్పడిన విద్యార్ధుల గుర్తింపును పోలీసులు వెల్లడించలేదని అక్కడి స్థానిక మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
హెల్సింకి శివారు ప్రాంతమైన వాన్టాలోని వియెర్టోలా పాఠశాలలో ఈ కాల్పులు జరిగాయి. అక్కడ దాదాపు 800 మంది విద్యార్థులు ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు చదువుతున్నారు. 90 మంది టీచింగ్ ఫ్యాకల్టీ ఉన్నారు. రెండు అంబులెన్స్‌లు ఘటనా స్థలానికి చేరుకున్నటి స్థానిక మీడియా తెల్పింది. కాల్పులకు గురైన ముగ్గురు విద్యార్ధులు 12 ఏళ్ల వారే. అనుమానిత నేరస్తులను బంధించినట్లు అధికారులు తెలిపారు. స్కూల్లో కాల్పుల ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆ దేశ ప్రధాని పెట్టేరి ఓర్పో ఓ ప్రకటనలో తెలిపారు. కాగా ఫిన్‌లాండ్‌లో గతంలో కూడా పలుమార్లు పాఠశాలల్లో కాల్పులు జరిగాయి. దీంతో ఫిన్‌లాండ్ తుపాకీ విధానంపై అక్కడి ప్రభుత్వం దృష్టి సారించింది.
2007లో పెక్కా-ఎరిక్ ఆవినెన్ హెల్సింకి సమీపంలోని జోకెలా హైస్కూల్‌కి తుపాకీని తీసుకొచ్చిన ఓ విద్యార్ధి.. ఆరుగురు విద్యార్థులను, స్కూల్ నర్సు, ప్రిన్సిపాల్‌ను కాల్చి, ఆ తర్వాత తనను కాల్చుకుని మృతి చెందాడు. ఇది జరిగిన ఏడాది తర్వాత అంటే 2008లో వాయువ్య ఫిన్‌లాండ్‌లో ఉన్న కౌహజోకిలోని వృత్తి విద్యా పాఠశాలలో మరో విద్యార్థి కాల్పులు జరిపాడు. తుపాకీ తొమ్మిది మంది విద్యార్థులను, ఒక టీచర్‌ను కాల్చి చంపాడు. 2010లో ఫిన్లాండ్ తుపాకీ చట్టాన్ని కఠినతరం చేసింది. తుపాకీ లైసెన్స్ దరఖాస్తుదారులందరికీ ఆప్టిట్యూడ్ పరీక్షను ప్రవేశపెట్టింది. దరఖాస్తుదారుల వయోపరిమితిని కూడా 18 నుంచి 20కి పెంచింది. 5.6 మిలియన్ల జనాభా ఉన్న ఈ దేశంలో 1.5 మిలియన్లకు పైగా లైసెన్స్ పొందిన తుపాకీలు వినియోగిస్తున్నారు. దాదాపు 4,30,000 లైసెన్స్ హోల్డర్లు ఆ దేశంలో ఉన్నారు. ఇ
మరిన్ని అంతర్జాతీయ కథనాల కోసం క్లిక్ చేయండి.