China: చైనాలో సెగలు పుట్టిస్తోన్న హీట్ వేవ్.. అధిక ఉష్ణోగ్రత‌లతో రెడ్‌ అల‌ర్ట్.. అంతే కాకుండా

|

Aug 23, 2022 | 7:29 AM

చైనాలో (China) హీట్ వేవ్ సెగలు పుట్టిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా హీట్ వేవ్‌తో చైనా ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది. విద్యుత్ కొరతతో షాంఘైలో చీకట్లు అలుముకోనున్నాయి. డ్రాగన్‌ కంట్రీలో కరవు విలయతాండవం చేస్తోంది. ఫలితంగా...

China: చైనాలో సెగలు పుట్టిస్తోన్న హీట్ వేవ్.. అధిక ఉష్ణోగ్రత‌లతో రెడ్‌ అల‌ర్ట్.. అంతే కాకుండా
Heat Waves In China
Follow us on

చైనాలో (China) హీట్ వేవ్ సెగలు పుట్టిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా హీట్ వేవ్‌తో చైనా ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది. విద్యుత్ కొరతతో షాంఘైలో చీకట్లు అలుముకోనున్నాయి. డ్రాగన్‌ కంట్రీలో కరవు విలయతాండవం చేస్తోంది. ఫలితంగా స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నదులు ఎండిపోతున్నాయి. ఉక్కపోత నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలంతా విద్యుత్‌ను అధికంగా ఉపయోగిస్తున్నారు. హైడ్రో పవర్‌ (shanghai) ఉత్పత్తి సరిగా జరకపోవడంతో ఫ్యాక్టరీలు, వాణిజ్య సముదాయాలు మూతపడుతున్నాయి. కరెంట్ కోతలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. దేశంలో అత్యధిక ఉష్ణోగ్రతలు చాంగ్‌కింగ్ ప్రాంతంలోనే న‌మోదు అవుతున్నాయి. చాంగ్‌కింగ్ ప్రాంతంలో ఉన్న 34 కౌంటీల్లోని 66 న‌దులు ఎండిపోయాయి. ఇక్కడ సాధారణంతో పోలిస్తే 60 శాతం త‌క్కువ వ‌ర్షపాతం న‌మోదు అయ్యింది. అనేక ప్రాంతాల్లో నేల‌లు ప‌గుళ్లు ప‌ట్టాయి. అంతే కాకుండా చైనాలో కార్చిచ్చు ఘ‌ట‌న‌లు ఎక్కువ‌య్యాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు క‌రవు హెచ్చరిక‌లు జారీ చేశారు. యాంగ్జీ న‌దీ ప‌రివాహ‌క ప్రాంతాల్లో పంట‌ల్ని కాపాడుకునేందుకు ప్రత్యేక బృందాల‌ను రంగంలోకి దించారు. విప‌రీత‌మైన వేడి వ‌ల్ల ఆ ప్రాంతంలో ఉన్న పంట‌లు, అడువులు అగ్గికి అంటుకుంటున్నాయి. ఈ నేప‌థ్యంలో ప్రభుత్వం ఎల్లో అల‌ర్ట్ జారీ చేసింది.

చైనా తన దేశ అభివృద్ధికి చిహ్నంగా చూపించే షాంఘైలోనూ చీకట్లు కమ్ముకోనున్నాయి. ఫేస్‌ ఆఫ్‌ షాంఘైగా నిలిచే ‘ది బండ్‌’లో లైటింగ్‌ను రెండ్రోజులపాటు నిలిపివేయనున్నారు. వూహాన్‌లో యాంగ్జూ నదిపై ఉన్న లైటింగ్‌షోను కూడా నిలిపివేశారు. ముఖ్యంగా సిచువాన్‌ ప్రావిన్స్‌ గత 60 ఏళ్లలో ఎన్నడూ చూడనంత కరవును ఎదుర్కొంటోంది. దీంతో విద్యుత్తు కొరత తీవ్రం కావడంతో పంపిణీ వ్యవస్థలపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. ప్రస్తుతం సిచువాన్‌లో విద్యుత్తుపై రేషన్‌ విధించడంతో ఉత్పత్తి పడిపోయే ప్రమాదం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం చూడండి..