ప్రతి రోజు ఏదో రకంగా వార్తలలో వినిపించే పేరు అమెజాన్. అమెజాన్ కంపెనీ గురించి తెలియనివారుండరు అంటే అతిశయోక్తి కాదు. ఈ-కామర్స్ రంగంలో కానీ, ఓటీటీ రంగంలో కానీ దీని పేరు మారుమోగుతూనే ఉంటుంది. అయితే సోమవారం నుంచి ఈ దిగ్గజ ఈ-కామర్స్ కంపెనీకి సంబంధించిన వార్త ఒకటి బాగా ట్రెండ్ అవుతోంది. అది ఏమిటంటే.. ఈ వారం మునిసేసరికకి 10 వేల మంది ఉద్యోగులను కంపెనీ నుంచి అమెజాన్ తొలగించనున్నట్లు దాని సారంశం. ‘‘ ఉద్యోగులను తొలగించడం అనేది కంపెనీ యూనిట్ల మీద ప్రభావం చూపిస్తుంది. రిటైల్ డివిజన్, మానవ వనరులు వంటి అంశాల మీద కూడా ఇది తన దృష్టి సారిస్తుంది. అందిన సమాచారం ప్రకారం ఎంత మందిని తొలగిస్తారనేది అధికారుల నిర్ణయంపైనే అధారపడి ఉంది’’ అని పలు వార్తాకథనాలు వెలువడుతున్నాయి. కాగా, అమెజాన్ కంపెనీ ఇటీవలే అమెరికాలలోని బాండ్వెగన్‌లో చేరింది.
రాబోయే ఆర్థిక మాంద్యం కోసం ఉద్యోగులకు కోత కోయడం దీని పని. 2021 డిసెంబర్ 31 నాటికి అమెజాన్‌లో మొత్తం 1608 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. తన ఉద్యోగులను తొలగించకుండా ఉండేందుకు ఆ కంపెనీ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అయితే కంపెనీ నుంచి దాదాపు 3 శాతం మంది లేదా 10 వేల మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని సోమవారం అమెరికాకు చెందిన ప్రముఖ వార్తా పత్రిక న్యూ యార్క్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. ‘‘ మారుతున్న వ్యాపార రూపాలు, అర్థిక వ్యవస్థలోని అవకతవకల నేపథ్యంలో ఈ-కామర్స్ దిగ్గజం అయిన అమెజాన్ ఉద్యోగులను తొలగించనుంది. ట్విట్టర్‌ను తన వశం చేసుకున్న ఎలాన్ మస్క్ కూడా సగం మంది ఉద్యోగులను తొలగించాడు.
ఫేస్బుక్ మాతృసంస్థ అయిన మెటా కూడా దాదాపు 11 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. లిఫ్ట్, స్ట్రిప్, స్నాప్ వంటి అనేక ఇతర సాంకేతిక సంస్థలు కూడా ఇటీవల కాలంలో తమ ఉద్యోగులను తొలగించాయి’’ అని న్యూ యార్క్ టైమ్స్ తన కథనంలో వెల్లడించింది. ఇక అమెజాన్ కంపెనీ ప్రస్తుత త్రైమాసికంలో స్వల్పంగా పుంజుకుంది. కానీ వృద్ధి రేటు మాత్రం బలహీనపడవచ్చని తన పెట్టుబడిదారులను స్వయంగా హెచ్చరించింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..