North Korea vs South Korea: అంతర్జాతీయంగా మరో ఉద్రిక్తత.. కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు..

|

Nov 05, 2022 | 7:03 AM

నువ్వా, నేనా.. ఇది కొరియా దేశాల పరిస్థితి.. అమెరికా హెచ్చరించినా తగ్గేదే లే అంటూ ఉత్తర కొరియా కిమ్‌ కవ్వింపులకు దిగుతుంటే అందుకు దక్షిణ కొరియా కూడా స్ట్రాంగ్ రిప్లై ఇస్తోంది.

North Korea vs South Korea: అంతర్జాతీయంగా మరో ఉద్రిక్తత.. కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు..
North Korea Vs South Korea
Follow us on

నువ్వా, నేనా.. ఇది కొరియా దేశాల పరిస్థితి.. అమెరికా హెచ్చరించినా తగ్గేదే లే అంటూ ఉత్తర కొరియా కిమ్‌ కవ్వింపులకు దిగుతుంటే అందుకు దక్షిణ కొరియా కూడా స్ట్రాంగ్ రిప్లై ఇస్తోంది. పలితంగా ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ప్రసుత్తం కొరియా ద్వీపకల్పంలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. నిన్నటి వరకు క్షిపణి పరీక్షలతో ఈ ప్రాంతం హోరెత్తగా తాజాగా యుద్ధవిమానాల జోరు పెరిగింది. సౌత్ కొరియా, అమెరికా విన్యాసాలపై గుర్రుగా ఉన్న నార్త్‌ కొరియా.. రెండు రోజుల్లోనే 25కిపైగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది.

తాజాగా, శుక్రవారం ఉత్తర కొరియాకు చెందిన దాదాపు 180 యుద్ధ విమానాలు దక్షిణ కొరియా సరిహద్దులకు సమీపంలో కొన్ని గంటల పాటు చక్కెర్లు కొట్టాయి. దీంతో వీటిని గుర్తించిన దక్షిణ కొరియా వెంటనే అప్రమత్తమైంది. 80 ఫైటర్‌ జెట్లను రంగంలోకి దించింది. వీటిలో ఎఫ్‌ 35 ఏ స్టెల్త్ ఫైటర్స్ కూడా ఉన్నాయి. అలాగే అమెరికా, దక్షిణ కొరియా కలిసి 240 యుద్ధ విమానాలతో విన్యాసాలు నిర్వహించాయి. ఉత్తర కొరియాకు చెందిన 180 యుద్ధ విమానాలు మిలటరీ సరిహద్దుకు ఉత్తరంగా నాలుగు గంటల పాటు ఎగురుతున్నట్టు గుర్తించిన తర్వాత ఫైటర్ జెట్‌లతో వెంబడించినట్లు దక్షిణ కొరియా సైన్యం తెలిపింది.

అయితే ఎలాంటి దాడినైనా ఎదుర్కొనేందుకు అమెరికాతో కలిసి జాయింట్ డ్రిల్స్‌లో పాల్గొన్న యుద్ధ విమానాలు కూడా సిద్ధంగా ఉన్నాయని దక్షిణ కొరియా తెలిపింది. ఓ పక్క అమెరికాతో కలిసి విజిలెంట్‌ స్ట్రామ్‌ పేరిట సంయుక్త విన్యాసాలు నిర్వహిస్తుండగా.. గగనతలంలో యుద్ధవిమానాలు చక్కర్లు కొడుతుండటం ఆందోళనకు దారితీస్తోంది. మరోవైపు ఉత్తర కొరియా కవ్వింపుల నేపథ్యంలో సంయుక్త వాయు విన్యాసాలను కొనసాగించాలని అమెరికా, దక్షిణ కొరియా నిర్ణయించాయి. కిమ్‌ కవ్వింపులతో మరోసారి ఇరు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి.

అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..