Kim Jong-un: కిమ్‌ మామకు కోపమొచ్చింది.. క్షిపణి పేలింది.. అసలేమైందంటే..?

|

Sep 26, 2022 | 6:05 AM

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ తన సహజ శైలిలో అమెరికా, దక్షిణ కొరియాలను రెచ్చగొట్టే చర్యకు పాల్పడ్డారు. టైకాన్‌ ప్రాంతం నుంచి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది ఉత్తర కొరియా..

Kim Jong-un: కిమ్‌ మామకు కోపమొచ్చింది.. క్షిపణి పేలింది.. అసలేమైందంటే..?
Kim Jong Un
Follow us on

North Korea fires ballistic missile: అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ మరికొద్ది రోజుల్లో దక్షిణ కొరియాను సందర్శించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దక్షిణ కొరియాతో కలిసి సంయుక్త సైనిక విన్యాసాలు చేపట్టేందుకు అమెరికా సిద్ధమైంది. ఇప్పటికే అమెరికా అణుశక్తి ఎయిర్‌ క్రాఫ్ట్‌ క్యారియర్‌ రోనాల్డ్‌ రీగన్‌ కొరియా ద్వీపకల్పంలోని బుసాన్‌ పోర్టుకు చేరుకుంది. సరిగ్గా ఇదే సమయంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ తన సహజ శైలిలో అమెరికా, దక్షిణ కొరియాలను రెచ్చగొట్టే చర్యకు పాల్పడ్డారు. టైకాన్‌ ప్రాంతం నుంచి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది ఉత్తర కొరియా.. ఈ క్షిపణి 60 కిలో మీటర్ల ఎత్తులో 600 కిలో మీటర్ల దూరం ప్రయాణించి సముద్రంలో పడిపోయింది. ఆదివారం ఉదయం ఉత్తర కొరియా తూర్పు తీరంలో సముద్రం వైపు ఒక బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించినట్లు దక్షిణ కొరియా వెల్లడించింది. ఉత్తర ప్యోంగ్యాన్ ప్రావిన్స్‌లోని టెచోన్ ప్రాంతం నుంచి దీనిని ప్రయోగించారని తెలిపింది.

కాగా.. యూఎస్ వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ పర్యటన, దక్షిణ కొరియా, అమెరికా దళాలు సంయుక్తంగా సైనిక కసరత్తులు చేయాల్సిన సమయంలో ఈ క్షిపణి ప్రయోగంపై దక్షిణ కొరియా మండిపడింది. ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాన్ని దక్షిణ కొరియా కవ్వింపు చర్యగా అభివర్ణించింది. ఇలాంటి చర్యలను ఎదర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని హెచ్చరించింది. అమెరికాతో తమ సైనిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకుంటామని ప్రకటించారు దక్షిన కొరియా అధికారులు.. ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాన్ని జపాన్‌ కూడా ధృవీకరించింది.

దక్షిణ కొరియాలో అమెరికా జోక్యాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌.. తరచూ క్షిపణులను ప్రయోగించడం ద్వారా తమ వైఖరిని చాటి చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితమే ఉత్తర కొరియా అణ్వస్త్ర దేశంగా ప్రకటించుకుంది.. తమ దేశంలో ఆంక్షలను ఎత్తేయాలని ఐక్యరాజ్య సమితి, అమెరికాలను డిమాండ్‌ చేస్తోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..