Donald Trump: నేను ఏం చేస్తానో ఎవరికీ తెలియదు.. ఇరాన్‌ టార్గెట్‌గా ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు!

మిడిల్‌ ఈస్ట్‌ దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్‌ వ్యవహారంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ఇప్పటికే చాలా చేసింది, తన హద్దులు మీరి ప్రవర్తింస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్-ఇజ్రాయోల్ మధ్య వివాదంలో అమెరికా జోక్యం చేసుకుంటే ఇరాన్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రంప్ హెచ్చరించాడు.

Donald Trump: నేను ఏం చేస్తానో ఎవరికీ తెలియదు.. ఇరాన్‌ టార్గెట్‌గా ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు!
Trump

Updated on: Jun 19, 2025 | 12:02 AM

ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేయకుండా అడ్డుకునే విషయంలో అమెరికా ఇజ్రాయెల్‌తో కలుస్తుందా లేదా అనే విషయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడారు. వైట్ హౌజ్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో జర్నలిస్ట్‌లు అడిగిన ప్రశ్నకు ఆయన సామాధానం ఇస్తూ ఇలా అన్నారు. మిడిల్‌ ఈస్ట్‌లో గత వారం క్రితం ఉన్న పరిస్థితులతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా వరకు మార్పు వచ్చిందని ఆయన తెలిపారు. ఇరాన్‌పై ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో ఆమెరికా జోక్యం ఉంటుందో లేదో చెప్పలేనన్నారు. తాను ఏం చేయబోతున్నానో ఎవరికీ తెలియదని ట్రంప్ చెప్పుకొచ్చారు.

మరోవైపు ఇరాన్‌ వైట్‌హౌస్‌తో చర్చలు జరిపేందుకు ప్రతిపాదన వచ్చినట్టు ఆయన తెలిపారు. కానీ ఆ చర్చలు ఎప్పుడు జరుగుతాయని.. ఏ విధంగా జరుగుతాయనే వివరాలను మాత్రం ఆయన ప్రస్తావించలేదు. అయితే ఇరాన్‌ ప్రస్తుతం తనను తాను రక్షించుకోలేని పరిస్థితిలో ఉందని, వారి వద్ద సరైన వైమానిక రక్షణ వ్యవస్థలు కూడా లేవని ట్రంప్ తెలిపారు. ఈ క్రమంలో ఇరాన్‌పై దాడులు కొనసాగించాలని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూకు తాను చెప్పినట్లు ట్రంప్ వెల్లడించారు. తమరు ఇరాన్‌తో యుద్దం చేయాలనే కోరిక లేదని.. కానీ ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండకూడదన్నదే తన ప్రధాన ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా, ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ గురించి ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమేనీ ఎక్కడ దాక్కున్నారో తమకు తెలుసని, ఆయన సురక్షితంగానే ఉన్నట్టు ట్రంప్ తెలిపారు. తాము అనుకుంటే ఖమేనీని లేకుండా చేయగలమని కానీ.. తమకు ఆ ఉద్దేశం లేదని ట్రంప్‌ స్పష్టం చేశారు. ఇరాన్‌ చెప్పినట్టు విని వెంటనే లొంగిపోతే మంచిదని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాలని ట్రంప్ హెచ్చరించారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ గట్టి కౌంటర్ ఇచ్చారు. ట్రంప్ బెదిరింపులకు భయపడేవారు ఎవరూ లేరని.. ఈ వివాదంలో అమెరికా జోక్యం చేసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..