Paul Romer: యూఎస్‌లో అమలు చేయలేకపోయాం.. ఆధార్‌పై నోబెల్ గ్రహీత కీలక వ్యాఖ్యలు  

భారతదేశ ప్రజల ప్రయోజనాల కోసం ఆధార్ ప్లాట్‌ఫారమ్‌ ఉపయోగపడుతుందని నోబెల్ గ్రహీత పాల్ రోమర్ పేర్కొన్నాడు. ఆధార్ ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన సాంకేతిక వ్యవస్థ అని కొనియాడారు.

Paul Romer: యూఎస్‌లో అమలు చేయలేకపోయాం.. ఆధార్‌పై నోబెల్ గ్రహీత కీలక వ్యాఖ్యలు  

Edited By: Ram Naramaneni

Updated on: Oct 22, 2024 | 8:37 PM

ఆధార్ ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన సాంకేతిక వ్యవస్థ అని నోబెల్ గ్రహీత పాల్ రోమర్ పేర్కొన్నారు. ప్రత్యక్ష ప్రయోజనాల బదిలీతో సహా ప్రభుత్వ ప్రయోజనాలను ప్రజలు పొందేందుకు ఆధార్ ఎంతోగాను ఉపయోగపడుతుందని చెప్పారు. ఇటీవలే జరిగిన వరల్డ్ సమ్మిట్‌లో రోమర్ మాట్లాడుతూ.. యుఎస్‌లో ఇలాంటి ప్లాట్‌ఫారమ్‌ను విజయవంతంగా ఏర్పాటు చేయలేకపోయామని, ఎందుకంటే వారు ప్రైవేట్ రంగం గుత్తాధిపత్యంలో ఉన్నారని పేర్కొన్నారు. “ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన సాంకేతిక వ్యవస్థ ఆధార్” అని చెప్పుకొచ్చారు.

యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI), డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) వంటి వాటిలో ఎలా ఉపయోగించబడుతాయే కేంద్ర ప్రభుత్వం చేసి చూపిందన్నారు. కేంద్ర ప్రభుత్వం దేనికి భయపడకుండా UPI, DBT సేవలు అందిస్తుందన్నారు. “ఆధార్‌ను సంపదను ఉత్పత్తి చేయడానికి కాకుండా, భారతదేశ ప్రజల ప్రయోజనాల కోసం ఆధార్ ప్లాట్‌ఫారమ్‌ ఉపయోగించవచ్చు” అని ఆయన చెప్పుకొచ్చారు. ఆధార్ స్కీమ్‌కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో అనేక కేసులు ఉన్నప్పటికీ, భారతదేశంలోని ప్రభుత్వం ఈ ఆలోచనను ముందుకు తీసుకెళ్లి, న్యాయమూర్తులను అడ్డుకోనివ్వకుండా, వారు ఈ అద్భుతమైన విజయాన్ని సాధించారని రోమర్ కొనియాడారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..