గాబ్రియేల్ తుఫానుతో ఇప్పటికే గజగజలాడుతున్న న్యూజిలాండ్‌ను భారీ భూకంపం వణికించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.1గా నమోదైంది. వాయవ్య పరపరము పట్టణానికి 50 కిలోమీటర్ల దూరంలో 76 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. భూకం ధాటికి పలు చోట్ల కొన్ని సెకన్లపాటు ప్రకంపనలు సంభవించాయి. లెవిన్, పొరిరువ, ఫ్రెంచ్ పాస్ సహా చాలా ప్రాంతాల్లో భూమి కంపించింది.
కొద్ది రోజులుగా న్యూజిలాండ్‌ను గాబ్రియెల్ తుఫాను వణికిస్తోంది. బలమైన గాలులు, భారీ వర్షాలతో నార్త్, సౌత్ ఐలాండ్స్ అతలాకుతలమవుతున్నాయి. కొండచరియలు విరిగిపడుతున్నాయి. చాలా చోట్ల ఇళ్లు బురదలో కూరుకుపోయాయి. అనేక మంది జనం ఇప్పటికీ రూఫ్‌టాప్‌లపైనే కాలం వెళ్లదీస్తున్నారు. రోడ్లు కుంగిపోవడం, విద్యుత్ స్తంభాలు, చెట్లు పెద్దఎత్తున విరిగిపడటంతో సహాయక కార్యక్రమాలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. విమానాల రాకపోకలను నిలిపివేశారు. న్యూజిలాండ్ ప్రభుత్వం జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించింది. 2019లో క్రిస్ట్‌చర్చిపై దాడి, ఆ తర్వాత కోవిడ్ మహమ్మారి తర్వాత దేశంలో నేషనల్ ఎమర్జెన్సీ విధించడం ఇది మూడోసారి.
తీవ్రమైన వరదలు, సైక్లోన్ గాబ్లియెన్‌తో చిగురుటాకులా వణుకుతున్న న్యూజిలాండ్‌ను భూకంపం తాకడంతో జనం విలవిలలాడుతున్నారు. సైక్లోన్ ధాటికి కొండచరియలు విరిగిపడి లెక్కకు మించిన ఇళ్లు దెబ్బతిన్నాయి. వరద నీటిమట్టం పెరుగుతుండటంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం చాలెంజింగ్‌గా మారింది. నార్త్‌లాండ్, ఆక్లాండ్, బే ఆఫ్ ఫ్లెంటీ సహా తొమ్మిది ప్రాంతాల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. పెద్ద శబ్దంతో, బయోత్పాతం సృష్టించే విధంగా భూమి కంపించింది, తాము సురక్షితంగా ఉన్నామంటూ కొంతమంది న్యూజిలాండ్ వాసులు తమకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియాలో వివరించారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..