Joe Biden: ఇచ్చిన హామీని నెరవేర్చిన అమెరికా నూతన అధ్యక్షుడు.. ఒక్కో అమెరికన్ ఖాతాలో ఎంత సొమ్ము వేస్తారంటే..

|

Jan 24, 2021 | 7:17 PM

Joe Biden: కరోనా వైరస్‌తో అతలాకుతలం అయిన అమెరికా పౌరులకు తాను అండగా ఉంటానంటూ ఇచ్చిన హామీని ఆదేశ నూతన అధ్యక్షుడు..

Joe Biden: ఇచ్చిన హామీని నెరవేర్చిన అమెరికా నూతన అధ్యక్షుడు.. ఒక్కో అమెరికన్ ఖాతాలో ఎంత సొమ్ము వేస్తారంటే..
Joe Biden
Follow us on

Joe Biden: కరోనా వైరస్‌తో అతలాకుతలం అయిన అమెరికా పౌరులకు తాను అండగా ఉంటానంటూ ఇచ్చిన హామీని ఆదేశ నూతన అధ్యక్షుడు జో బైడెన్ నెరవేర్చుకోనున్నారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఒక్కో అమెరికన్ ఖాతాలో 2వేల డాలర్లు వేసే అంశానికి సంబంధించిన ఫైలుపై తొలి సంతకం చేశారు. దాంతో మరికొద్ది రోజుల్లో ఒక్కో అమెరికన్ ఖాతాలో సంబంధిత నగదు జమ కానుంది. ఈ విషయాన్ని అమెరికా వైట్‌ హౌస్ ధృవీకరించింది. కాగా, గత ఏడాది ఎన్నికల ప్రచారంలో భాగంగా కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు డొనాల్డ్ ట్రంప్ కన్నా మెరుగైన చర్యలు చేపడతానని బైడెన్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్ అమెరికా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఇటీవల 1.9 ట్రిలియన్ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించారు. ఈ ప్యాకేజీలో ఒక ట్రిలియన్ డాటర్లను అమెరికాలోని ఒక్కో కుటుంబానికి 2వేల డాలర్ల చొప్పున ప్రత్యక్ష నగదు సాయం అందించనున్నారు. మిగిలిన వాటిలో కొంత మొత్తాన్ని చిరు వ్యాపారులను ఆదుకునేందుకు, మరికొంత కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు వినియోగిస్తారని అధికారిక సమాచారం.
Also read:

హైదరాబాద్‌లో జనసేనాని పవన్‌‌తో సోమువీర్రాజు భేటీ.. అన్ని వర్గాల ఆకాంక్షల మేరకు కలిసి పని చేయాలని నిర్ణయం

FaceBook: మాస్‌ లాగౌట్‌లపై స్పందించిన ఫేస్‌బుక్‌… అకౌంట్లు వాటంతంటే అవే ఎందుకు లాగౌట్‌ అయ్యాయంటే..