Sher Bahadur Deuba: నేపాల్‌ కొత్త ప్రధానిగా షేర్‌ బహదూర్‌ డ్యూబా.. శుభాకాంక్షలు తెలిపిన మోదీ

|

Jul 19, 2021 | 7:31 AM

Nepal PM Sher Bahadur Deuba: నేపాల్‌ ప్రధానమంత్రిగా షేర్‌ బహదూర్‌ డ్యూబా అధికారికంగా ఎన్నికయ్యారు. నేపాల్ కోర్టు ఆదేశాల అనంతరం ఈ నెల 12న నేపాల్ కాంగ్రెస్ చీఫ్

Sher Bahadur Deuba: నేపాల్‌ కొత్త ప్రధానిగా షేర్‌ బహదూర్‌ డ్యూబా.. శుభాకాంక్షలు తెలిపిన మోదీ
Sher Bahadur Deuba
Follow us on

Nepal PM Sher Bahadur Deuba: నేపాల్‌ ప్రధానమంత్రిగా షేర్‌ బహదూర్‌ డ్యూబా అధికారికంగా ఎన్నికయ్యారు. నేపాల్ కోర్టు ఆదేశాల అనంతరం ఈ నెల 12న నేపాల్ కాంగ్రెస్ చీఫ్ షేర్ బహదూర్ డ్యూబాను ప్రధానిగా నియమితులయ్యారు. దీంతోపాటు కేపీ శర్మ ఓలి మే 21న రద్దు చేసిన ప్రతినిధుల సభను కూడా నేపాల్ కోర్టు పునరుద్ధరించింది. ఈ క్రమంలో ఆదివారం ఖాట్మాండులోని ఆ దేశ పార్లమెంట్‌లో జరిగిన విశ్వాస పరీక్షలో ఆయన నెగ్గారు. మొత్తం 275ఓట్లలో ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి 136ఓట్లు సాధించాల్సి ఉంది.

అయితే.. షేర్‌ బహదూర్‌ డ్యూబా 165 ఓట్లను గెలుచుకున్నారు. 83 ఓట్లు మాత్రమే ఆయనకు వ్యతిరేకంగా వచ్చాయి. 249 మంది ఎంపీలు ఈ ఓటింగ్‌లో పాల్గొన్నారు. నేపాలీ కాంగ్రెస్, సిపిఎన్ మావోయిస్ట్ సెంటర్, జనతా సమాజ్ వాదీ పార్టీ-నేపాల్ ఎంపీలు డ్యూబాకు అనుకూలంగా ఓటు వేశారు. కాగా.. గతంలో షేర్ బహదూర్ డ్యూబా నేపాల్‌ ప్రధానిగా నాలుగుసార్లు పని చేశారు. 75 షేర్ బహదూర్ డ్యూబా ఈ పదవీ చేపట్టడం ఐదోసారి.

ఇదిలాఉంటే.. నేపాల్ ప్రధానిగా ఎన్నికైన షేర్‌ బహదూర్‌ డ్యూబాను భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు మోదీ ట్విట్ చేశారు. అన్ని రంగాల్లో ఆయనతో కలిసి భాగస్వామ్యాన్ని కొనసాగించడానికి.. రెండు దేశాల మధ్య ప్రజా సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు.


Also Read:

ఆఫ్గనిస్తాన్ లో ఇండియా నిర్మిస్తున్న కట్టడాలను టార్గెట్ చేయాలని తాలిబన్లకు పాక్ ఐఎస్ఐ ఆదేశాలు..

Shocking viral video: మొసలి పంటితో బీర్ క్యాన్ ఓపెన్ చేశాడు.. ఈ వీడియో చూస్తే మీరు కూడా షాక్ అవుతారు..