Artemis 1: మరోసారి వాయిదా పడిన ఆర్టెమిస్-1 ప్రయోగం.. కారణం ఏంటంటే

|

Sep 04, 2022 | 12:37 AM

నాసా(NASA) ప్రతిష్ఠాత్మక ‘ఆర్టెమిస్-1(Artemis 1)’ ప్రయోగం కోసం ప్రపంచం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ప్రయోగం మరోసారి వాయిదా పడింది.

Artemis 1: మరోసారి వాయిదా పడిన ఆర్టెమిస్-1 ప్రయోగం.. కారణం ఏంటంటే
Nasa Artemis 1
Follow us on

నాసా(NASA) ప్రతిష్ఠాత్మక ‘ఆర్టెమిస్-1(Artemis 1)’ ప్రయోగం కోసం ప్రపంచం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ప్రయోగం మరోసారి వాయిదా పడింది. ఇంధన లీకేజీ కావడంతో  ఈ ప్రయోగాన్ని నిలిపేస్తున్నట్లు నాసా తెలిపింది. ఇప్పటికే ఒకసారి వాయిదా పడిన విషయం తెలిసిందే. రెండోసారి ప్రయోగాన్ని శనివారం రాత్రి చేయాలని నిర్ణయించారు. అయితే, ఈసారి కూడా ఇంధన లీకేజీ సమస్య తలెత్తడంతో.. ‘చంద్రుడిపైకి వెళ్లాల్సిన ఆర్టెమిస్- 1 మిషన్‌ వాయిదాపడింది. రాకెట్ లో ఇంధనం నింపుతుండగా లీక్ అవుతున్నట్టు గమనించారు. దాన్ని సరి చేసేందుకు ప్రయతించిన అది కుదరలేదు.ఇంధనం లీక్ అవుతుండటంతో ప్రయోగాన్ని ఆపేసింది. ఈ విషయాన్నీ నాసా సోషల్ మీడియా ద్వారా తెలిపింది.

ఫ్లోరిడాలోని కెనెడీ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ రాకెట్‌ ను ప్రయోగించాలని అనుకున్నారు. రీసెంట్ గా ఆగస్టు  29న  ఈ ప్రయోగాన్ని చేయాలనీ నాసా నిర్ణయించింది.. అప్పుడు కూడా ఇదే సమస్య తలెత్తింది. ఇంధన లీక్ అవుతుండటంతో లాస్ట్ లో ప్రయోగాన్ని నిలిపేశారు. తాజాగా మరోసారి అదే సమస్య రావడంతో ఇప్పుడు మరోసారి ప్రయోగాన్ని వాయిదా వేశారు. తిరిగి ఈ రాకెట్ ను ఎప్పుడు నింగిలోకి పంపేది త్వరలోనే వెల్లడిస్తాం అని నాసా తెలిపింది. ఈ ప్రయోగంతర్వాత 2024లో ఆర్టెమిస్‌-2, 2025లో ఆర్టెమిస్‌-3 ప్రయోగాలను నాసా చేయనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి