NASA: అంతరిక్ష నౌకలో సాంకేతిక సమస్యలు.. సునీత విలియమ్స్‌ రాక మరింత ఆలస్యమయ్యే ఛాన్స్‌

|

Jun 28, 2024 | 6:52 AM

భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ రోదసి యాత్ర ఇది మూడోసారి.. ఎప్పుడైతే రోదసి యాత్ర అని ప్రకటించారో అప్పటి నుంచి అడుగడుగునా ఆటంకాలతోనే సాగుతోంది. మరో వ్యోమగామి బుల్ విల్మోర్‌తో కలిసి జూన్ 5న బోయింగ్ స్టార్‌ లైనర్‌ రాకెట్ లో అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న ఆమె... తిరుగు ప్రయణానికి ఇబ్బందులు కలగడంతో స్పేస్‌లోనే ఉండిపోయారు.

NASA: అంతరిక్ష నౌకలో సాంకేతిక సమస్యలు.. సునీత విలియమ్స్‌ రాక మరింత ఆలస్యమయ్యే ఛాన్స్‌
Sunita Williams Stuck In Space (2)
Image Credit source: NASA
Follow us on

భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ స్పేస్‌లో చిక్కుకున్నారు. ఆటంకాలతోనే మొదలైన ఆమె స్పేస్‌ ప్రయాణం… ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. అసలు ఆమె భూమిపైకి ఎప్పుడొస్తారన్న క్లారిటీ రావట్లేదు. నాసా కూడా ఆమె తిరుగు ప్రయాణంపై ఎలాంటి స్పష్టతనివ్వట్లేదు. భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ రోదసి యాత్ర ఇది మూడోసారి.. ఎప్పుడైతే రోదసి యాత్ర అని ప్రకటించారో అప్పటి నుంచి అడుగడుగునా ఆటంకాలతోనే సాగుతోంది. మరో వ్యోమగామి బుల్ విల్మోర్‌తో కలిసి జూన్ 5న బోయింగ్ స్టార్‌ లైనర్‌ రాకెట్ లో అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న ఆమె… తిరుగు ప్రయణానికి ఇబ్బందులు కలగడంతో స్పేస్‌లోనే ఉండిపోయారు.

అప్పటి నుంచి సునీతా విలియమ్స్, బుల్ విల్మోర్ అంతరిక్ష కేంద్రంలో భూమి చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అంతరిక్షంలోకి వెళ్లి దాదాపు రెండు వారాలు గడిచిపోయినా… వారు భూమిపైకి ఎప్పుడొస్తారన్నది దానిపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రావట్లేదు. ఇటు నాసా కూడా వారి తిరుగు ప్రయాణంపై ఎలాంటి స్పష్టతనివ్వపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

వాస్తవానికి బోయింగ్ స్టార్ లైనర్‌ అంతరిక్ష కేంద్రంలో అడుగు పెట్టిన తర్వాత మళ్ళీ జూన్ 14వ తేదీన భూమిపైకి రావాల్సి ఉంది. అయితే పరిశోధనలు మిగిలే ఉండటంతో డేట్‌ను జూన్ 26 కు మార్చారు. కానీ అంతరిక్ష నౌకలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వారి రిటర్న్‌ జర్నీ మరింత వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్‌లో సమస్యలతో పాటు, అవసరమైన అదనపు పరీక్షల కారణంగా వ్యోమనౌక రావడం ఆలస్యం అవుతోంది.

ఇవి కూడా చదవండి

బోయింగ్ వ్యోమనౌక ద్వారా గతంలో రెండు మానవ రహిత పరీక్షలు నిర్వహించారు. అయితే ఈ రెండు సక్సెస్ కాలేదు. దీంతో మూడో సారి రూపొందించిన వ్యోమనౌకలో సునీతా విలియమ్స్, బుల్ విల్మోర్ లను అంతరిక్షంలోకి పంపించారు. అయితే జూన్ 5న విజయవంతంగా నింగిలోకి బయలు దేరినా కూడా అక్కడకు చేరిన తర్వాత ఐఎస్ఎస్‌తో అనుసంధానంలోనూ జాప్యం జరిగింది.

సునీతా విలియమ్స్‌కు ఇది మూడో అంతరిక్ష యాత్ర కాగా.. 1998లో నాసాకు ఎంపికైన ఆమె తొలిసారి 2006లో రోదసి యాత్ర చేశారు. ఆ తర్వాత మరోసారి 2012లో అంతరిక్షంలోకి వెళ్లి వచ్చారు. అప్పుడు మొత్తం 50 గంటల 40 నిమిషాలు సునీతా స్పేస్ వాక్ చేశారు. 322 రోజుల పాటు ఆమె స్పేస్‌లో గడిపారు. ఓ సారి స్పేస్‌లో మారథాన్ కూడా చేశారు సునీత విలియమ్స్‌. మొత్తంగా… అన్నీ అనుకూలిస్తే జూలై 2న సునీత విలియమ్స్‌ భూమిపై ల్యాండ్‌ అయ్యే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. మరి చూడాలి ఏం జరుగుతుందో..!

 

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..