Unemployment: అమెరికాలో ఉద్యోగాల కొరత.! ఉద్యోగాలు దొరక్క తెలుగు వారికి కష్టాలు..
అమెరికాలో గత రెండున్నర దశాబ్దాల్లో ఎన్నడూ చూడనంత నిరుద్యోగ సంక్షోభం ఏర్పడింది. ఎన్నో ఆశలతో ఉన్నత చదువుల కోసం అక్కడికి వెళ్లిన వారిలో వేల మంది మాస్టర్ డిగ్రీని చేతపట్టుకొని రోడ్ల వెంట తిరగాల్సి వస్తోంది. ఓవైపు బ్యాంకుల నుంచి తీసుకున్న విద్యారుణం వారిని భయపెడుతుండగా... మరోవైపు ఉద్యోగం ఎప్పుడొస్తుందో తెలియక తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
అమెరికాలో గత రెండున్నర దశాబ్దాల్లో ఎన్నడూ చూడనంత నిరుద్యోగ సంక్షోభం ఏర్పడింది. ఎన్నో ఆశలతో ఉన్నత చదువుల కోసం అక్కడికి వెళ్లిన వారిలో వేల మంది మాస్టర్ డిగ్రీని చేతపట్టుకొని రోడ్ల వెంట తిరగాల్సి వస్తోంది. ఓవైపు బ్యాంకుల నుంచి తీసుకున్న విద్యారుణం వారిని భయపెడుతుండగా… మరోవైపు ఉద్యోగం ఎప్పుడొస్తుందో తెలియక తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నాలుగైదేళ్లుగా ఉద్యోగాలు చేస్తున్న వారిని కూడా సాఫ్ట్‌వేర్ కంపెనీలు తొలగిస్తున్నాయి. బాధితుల్లో చాలామంది హోటళ్లలో, గ్యాస్‌స్టేషన్లలో పనిచేస్తూ మరో ఉద్యోగం సంపాదించుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు. అమెరికాలోని సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో అధిక వేతనాలతో కూడిన ఉద్యోగాలు లభిస్తాయనే నమ్మకంతో మన దేశం నుంచి ప్రతి ఏడాది విద్యార్థులు అక్కడికి వెళుతుంటారు. ఇలా 2022-23 సంవత్సరంలో దాదాపు రెండు లక్షల మంది వెళ్లారు. వీరిలో తెలుగు విద్యార్థులు 45 వేల నుంచి 55 వేల మంది వరకు ఉంటారని కన్సల్టెన్సీ సంస్థల ప్రతినిధులు తెలిపారు. అమెరికా వెళుతున్న విద్యార్థుల్లో చాలామంది ఎంఎస్‌లో కంప్యూటర్ సైన్స్, దాని అనుబంధ కోర్సులను చదివేందుకే అధిక ప్రాధాన్యమిస్తున్నారు. రెండేళ్ల కిందటి వరకు అమెరికాలో ఎంఎస్ చేసిన వారిలో దాదాపు 85% మందికి అక్కడే ఉద్యోగాలు లభించాయి.
కొవిడ్ ప్రభావం 2020 సంవత్సరంలో మొదలై ఏడాదిన్నరకు పైగా కొనసాగింది. రెండుసార్లు విధించిన లాక్‌డౌన్ కారణంగా అమెరికాలోని అన్ని రకాల పరిశ్రమలు కుదేలయ్యాయి. వాటిని రక్షించుకోవడానికి అక్కడి ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించడంతో 2021-22లో కంపెనీలకు భారీగా నిధులు అందాయి. బ్యాంకులూ తక్కువ వడ్డీకే..వేల కోట్ల రుణాలివ్వడంతో అనేక కంపెనీలు పెద్దఎత్తున ఉపయోగించుకున్నాయి. ఫలితంగా ఐటీ కంపెనీలకు అనూహ్యంగా ఆర్డర్లు వచ్చాయి. కంపెనీలు సైతం ఉద్యోగులను అదేస్థాయిలో తీసుకున్నాయి. కొవిడ్ ప్రభావం తగ్గిపోయాక.. అమెరికా ప్రభుత్వం ప్యాకేజీలను నిలిపేసింది. పారిశ్రామికరంగం మాత్రం పెద్దగా పుంజుకోలేదు. లాక్‌డౌన్ సమయంలో వివిధ సంస్థలు, వ్యక్తులకిచ్చిన రుణాలు తిరిగి వసూలు కాకపోవడంతో బ్యాంకులు కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. దీంతో అవి రుణాలివ్వడం ఆపేశాయి. అప్పటిదాకా 4 శాతం ఉన్న వడ్డీ రేటును గరిష్ఠంగా ఎనిమిది శాతానికి పెంచేశాయి. అమెరికా చరిత్రలో వడ్డీ రేట్లు ఎప్పుడూ ఇంత ఎక్కువగా లేవని ఆ దేశస్థులు పేర్కొన్నారు. దీని ప్రభావం పారిశ్రామికరంగంపై గట్టిగా పడింది. ఈ నేపథ్యంలో ఐటీ కంపెనీలకు ఒక్కసారిగా ఆర్డర్లు తగ్గిపోయాయి. చేయాల్సిన పనికంటే మానవ వనరుల సంఖ్య అధికంగా ఉండడంతో ఐటీ కంపెనీలు కొవిడ్ సమయంలో చేర్చుకున్న ఉద్యోగులను 2023 మార్చి నుంచి తొలగించడం మొదలుపెట్టాయి. అధిక జీతాలు పొందుతున్న ఉన్నతోద్యోగులను భారీగా తొలగించాయి. కొన్ని కంపెనీలు జీతాలను తగ్గించేశాయి. గతంలో వేల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఐటీ కంపెనీలు ఇప్పుడు వందల సంఖ్యలోనే నియామకాలు చేస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ భారత్ నుంచి వెళ్లిన వారిపై తీవ్రంగా చూపుతున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన వేల మందికి ఎంఎస్ పూర్తిచేసినా ఉద్యోగాలు లభించడం లేదు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.