
డబ్బున్న చాలా మంది వ్యక్తులు చిన్నచిన్న పనలు చేయడానికి ఇష్టపడరు. అలా చేస్తే వాళ్ల వ్యాల్యూ తగ్గుతుందని ఫీల్‌అవుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం వీళ్లకు భిన్నంగా ఉన్నాడు. ఏడాది రూ. రెండు కోట్ల ఆధాయం ఉన్నా కేవలం రూ.60వేల జీతానికి ఫ్లోర్ క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. కోట్ల ఆదాయం ఉన్నా నెలకు వేలల్లో వచ్చే జీతం కోసం పనిచేస్తున్న ఈ వ్యక్తి పేరు కోయిచి మత్సుబారా. జపాన్‌కు చెందిన 56 ఏళ్ల ఇతనికి ఇంటి అద్దె, గతంలో పెట్టిన పెట్టుబడలతో ఏడాదికి రూ.2 కోట్ల వరకు ఆధాయం వస్తుంది. కానీ ఇతను మాత్రం కేవలం రూ.60వేలకు సాధారణ క్లీనర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
అయితే ఇతను వారానికి మూడు రోజులు, నాలుగు గంటల షిఫ్టులలో పనిచేస్తాడు. ఇందుకుగానూ ఆయనకు నెలకు సుమారుగా 100,000 యెన్లు ( ఇండియన్ కరెన్సీలో సుమారు రూ. 60,354) జీతం వస్తుంది. SCMP ప్రకారం, ఇది టోక్యోలో సగటు నెలవారీ జీతం 350,000 యెన్లు (సుమారు రూ. 211,240) కంటే చాలా తక్కువ.
మత్సుబారా ఒక పేద కుటుంబంలో పెరిగాడు. తన సాధారణ జీవితం తన సొంత ఎంపిక అని అతను చెబుతాడు. రోజువారి పని, శారీరక శ్రమ ద్వారా ఆరోగ్యంగా ఉండటానికి అతను ఇష్టపడతాడు. అందుకే, తన ఈ వయస్సులో కూడా తను ఆనందాన్ని కలిగించే ఈ క్లీనర్ ఉద్యోగం చేస్తున్నట్టు చెబుతున్నాడు.
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.