ఇండియాలోని విద్యుత్ కేంద్రాలపై చైనా కన్ను ! ముంబై పవర్ కట్ కి అదే కారణమా ?

లడాఖ్ లో నియంత్రణ రేఖ వద్ద చైనా సృష్టించిన ఉద్రిక్తత తగ్గుతున్న స్మృతులు ఇంకా చెరిగిపోకముందే మరో షాకింగ్  న్యూస్ తెలిసింది. (ఇటీవల లడాఖ్ లో పాంగాంగ్ సో సరస్సు వద్ద చైనా సైనికులు,

ఇండియాలోని విద్యుత్ కేంద్రాలపై చైనా కన్ను ! ముంబై పవర్ కట్ కి అదే కారణమా ?
Follow us

| Edited By: Team Veegam

Updated on: Mar 01, 2021 | 2:26 PM

లడాఖ్ లో నియంత్రణ రేఖ వద్ద చైనా సృష్టించిన ఉద్రిక్తత తగ్గుతున్న స్మృతులు ఇంకా చెరిగిపోకముందే మరో షాకింగ్  న్యూస్ తెలిసింది. (ఇటీవల లడాఖ్ లో పాంగాంగ్ సో సరస్సు వద్ద చైనా సైనికులు, వారి శకటాలు వెనుదిరుగుతూ ఉపసంహరణ ప్రక్రియకు శ్రీకారం చుట్టిన వీడియోలు వైరల్ అయ్యాయి). ఇండియాలో దేశవ్యాప్తంగా విద్యుత్ కేంద్రాలను చైనా టార్గెట్  గా చేసుకున్నట్టు కనిపిస్తోందని  ఓ అధ్యయనంలో వెల్లడైంది. గత అక్టోబరులో ముంబైలో చాలాసేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. విద్యుత్ సరఫరా లేక ఈ నగరంలో ఎన్నో రైళ్లు నిలిచిపోగా… ఆసుపత్రుల్లో రోగుల సేవలు స్తంభించిపోయాయి. కొన్ని గంటలపాటు స్టాక్ ఎక్స్ చెంజీ కార్యకలాపాలు కూడా నిలిచిపోయాయి. ఒక విధంగా ప్రజా జీవనమే అతలాకుతలమయింది. ఇందుకు కారణం చైనా హ్యాకర్ల కార్యకలాపాలేనని ఈ స్టడీలో పేర్కొన్నారు. చైనీస్ మాల్ వేర్..భారత దేశ వ్యాప్తంగా పవర్ సప్లయ్ మీద తీవ్ర ప్రభావం చూపుతోందనడానికి ఆధారాలున్నాయని ఈ అధ్యయనం పేర్కొంది.

‘రెడ్ ఎఖ్ ‘ అనే ఈ యాక్టివిటీ గ్రూప్ ఇండియాలో ప్రధాన విద్యుత్ ప్లాంట్లలో మాల్ వేర్ ని జొప్పించిందని అనుమానిస్తున్నారు. న్యూయార్క్ టైమ్స్ ఈ అధ్యయనాన్ని ప్రచురించింది. ఇండియన్ లోడ్ డిస్పాచ్ సెంటర్లను టార్గెట్ చేశారనడానికి ముంబై పవర్ కట్ నిదర్శనంగా కనిపిస్తోందంటున్నారు. భారత విద్యుత్ సిస్టమ్స్ లోకి చొరబడేందుకు చైనా హ్యాకర్లు అత్యంత అధునాతన సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించుకున్నారని భావిస్తున్నారు. ఆన్ లైన్ డిజిటల్ థ్రెట్స్ ని విశ్లేషించే ‘రికార్డెడ్ ఫ్యూచర్’ అనే సంస్థ (అమెరికాలోనిదీ సంస్థ) ఈ మాల్ వేర్ ని కనుగొంది. మాల్ వేర్ లో చాలాభాగం  యాక్టివేట్ కాలేదని, ఈ సంస్థ భారత విద్యుత్ సిస్టమ్స్ ని పరిశీలించినప్పుడు ఈ విషయం బయటపడిందని అంటున్నారు. ఫలితంగా హ్యాకర్ల కోడ్ ను ఈ సంస్థ కనుగొనలేకపోయింది.

2020 ఆరంభం నుంచే రికార్డెడ్ ఫ్యూచర్ కి చెందిన ఇన్ సిక్ట్ గ్రూప్.. చైనా స్పాన్సర్ చేస్తున్న గ్రూపుల నుంచి భారతీయ విద్యుత్ కేంద్రాల్లోకి చొరబడుతున్న మాల్ వేర్ ను గుర్తించిందట. 12 భారతీయ కేంద్రాలకు అనుబంధంగా ఉన్న 21 సంస్థలను క్రిటికల్ గా క్లాసిఫై చేశారని, వీటిని చైనా టార్గెట్ చేసిందని తెలుస్తోంది. ఇప్పటికైనా ఈ మాల్ వేర్ ను గుర్తించడం మంచిదేనని, ముందు జాగ్రత్తలు తీసుకోవచ్చునని అంటున్నారు.

మరిన్ని చదవండి ఇక్కడ :

వారణాసిలో బీజేపీ చీఫ్ ప్రత్యేక పూజలు, దేశ ప్రజల ఆరోగ్యం, సంక్షేమం కోసం పూజించా..జేపీ.నడ్డా

ఆసక్తికరంగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు, థర్డ్‌ ఫ్రంట్ ప్రయత్నాలను ముమ్మరం చేసిన శరత్‌కుమార్‌