Congo Floods: కాంగోలో వరదల బీభత్సం.. 200 మందికి పైగా మృతి

|

May 07, 2023 | 4:38 PM

ఆఫ్రికాలోని కాంగోలో వరదలు బీభత్సం సృష్టించాయి. గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా దక్షిణ ప్రావిన్స్‌లోని కలేహలో నదులు వరదలతో పోటెత్తాయి. వరదల ధాటికి కొండచరియలు విరిగిపడటంతో దాదాపు 200 మందికిపైగా మృతి చెందారు.

Congo Floods: కాంగోలో వరదల బీభత్సం.. 200 మందికి పైగా మృతి
Congo Floods
Follow us on

ఆఫ్రికాలోని కాంగోలో వరదలు బీభత్సం సృష్టించాయి. గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా దక్షిణ ప్రావిన్స్‌లోని కలేహలో నదులు వరదలతో పోటెత్తాయి. వరదల ధాటికి కొండచరియలు విరిగిపడటంతో దాదాపు 200 మందికిపైగా మృతి చెందారు. మరికొంతమంది గల్లంతయ్యారు. ఇప్పటికే అధికారులు దాదాపు 203 మృతదేహాలను గుర్తించారు. భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లోని అనేక గ్రామాలు మునిగిపోయాయని, చాలా ఇళ్లు కొట్టుకుపోయాయని పేర్కొన్నారు. ఈ మేరకు నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత డెనిస్‌ ముక్వేగే ప్రకృతి విపత్తులో నిరాశ్రయులైన ‍ప్రజలకు తక్షణ వైద్య సాయం అందించేలా వైద్యులను, సాంకేతిక నిపుణలను ఆయా ‍ప్రాంతాలకు పంపినట్లు ‍ప్రకటించారు.

ఈ వారం రువాండాలో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో సుమారు 130 మంది దాక మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. రువాండ, కాంగోలో సంభవించిన ప్రకృతి విపత్తులకు ప్రభావితమైన ప్రజలకు యూఎన్‌ సెక్రటరీ జనరల్‌ గుటెర్రెస్‌ సంతాపాన్ని తెలియజేశారు. గ్లోబల్ వార్మింగ్‌ను ఎదుర్కొనేందుకు ఎలాంటి చర్యలు తీసుకోని దేశాలకు ఈ వినాశనమే ఓ ఉదాహరణ అని తెలిపారు. అయితే 2014లో కూడా కాంగో ఇంతే స్థాయిలో ప్రకృతి విపత్తుని ఎదర్కొన్నట్లు ఐక్యరాజ్యసమితి పేర్కొంది. ఆ విధ్వంసంలో సుమారు 130 మందికి పైగా ‍ప్రజలు గల్లంతయ్యారని..700లకు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయని తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..