Monkeypox: ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్న మంకీ వైరస్.. ఇప్పటి వరకు ఎన్ని దేశాలకు వ్యాపించిందంటే?

|

May 20, 2022 | 12:58 PM

ఇప్పటి వరకూ ఆఫ్రికాకు మాత్రమే పరిమితమైన మంకీపాక్స్ వైరస్ క్రమంగా ప్రపంచ దేశాల్లో వెలుగులోకి వస్తోంది. ఈ అరుదైన వైరల్ ఇన్ఫెక్షన్ కొత్త కేసులు యూరప్, అమెరికా, ఆస్ట్రేలియా సహా అనేక దేశాల్లో వెలుగులోకి వచ్చాయి.

Monkeypox: ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్న మంకీ వైరస్.. ఇప్పటి వరకు ఎన్ని దేశాలకు వ్యాపించిందంటే?
Monkeypox Outbreak
Follow us on

Monkeypox: రెండేళ్లనుంచి ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్(Corona Virus) నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం అనుకునే సమయంలో క్రమంగా మంకీపాక్స్‌ మళ్లీ విజృంభిస్తోంది. ఆఫ్రికాకే (Africa) పరిమితమనుకున్న ఈ మంకీపాక్స్‌ ఇప్పడు యూరప్‌, యూకే, నార్త్‌ అమెరికా దేశాలకు పాకింది. ఉత్తర అమెరికాతో పాటు యూరప్‌లోనూ డజన్ల కొద్దీ కేసులు వెలుగు చూస్తున్నాయి. కెనడాలో 12, స్పెయిన్‌.. పోర్చుగల్‌లో 40, బ్రిటన్‌లో తొమ్మిది కేసులు నమోదు కాగా.. తాజాగా ఫ్రాన్స్, ఇటలీ, స్వీడన్, ఆస్ట్రేలియాలో కొత్త కేసులు నమోదయ్యాయి.

వైరస్ వ్యాప్తి గురించి ఆశ్చర్యం కలిగించే నిజాలు: ఈ మంకీ వైరస్ సోకిన బాధితులను పరిశీలించగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. శారీరక కలయిక ద్వారానే ఈ వైరస్‌ వ్యాప్తి చెందినట్లు స్పష్టమయ్యింది. లేదా మంకీపాక్స్ ఉన్న వ్యక్తితో సన్నిహిత సంబంధం లేదా వ్యాధి ఉన్న కోతి నుంచి, వ్యాధి ఉన్న వ్యక్తి ఉపయోగించే దుస్తుల ద్వారా కూడా ఈ వైరస్ వ్యాప్తిస్తోందని శాస్త్రజ్ఞులు గుర్తించారు. ఈ మేరకు అమెరికా సీడీసీ ప్రకటన చేసింది. అంతేకాదు, యూకే ఆరోగ్య భద్రత సంస్థ కూడా దాదాపు ఇలాంటి ప్రకటనే చేసింది. మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా యూకే, యూరోపియన్‌ ఆరోగ్య ప్రతినిధులతో సమన్వయం అవుతూ.. పరిస్థితిని సమీక్షిస్తోంది. ఇప్పటి వరకూ నమోదైన కేసుల్లో గే, బైసెక్సువల్‌, ‘‘పురుషుల పరస్పర శృంగారంతోనే వ్యాప్తి చెందినట్లు నిర్ధారణ అయ్యింద’’ని డబ్ల్యూహెచ్‌వో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ సోసే ఫాల్‌ వెల్లడించారు. మంకీపాక్స్‌ను గతంలో లైంగికంగా సంక్రమించే ఇన్‌ఫెక్షన్‌గా వర్ణించలేదు.

మంకీపాక్స్ అంటే ఏమిటంటే..

ఇవి కూడా చదవండి

ఎలుకలు, ప్రైమేట్స్ వంటి అడవి జంతువుల్లో వెలుగులోకి వచ్చిన మంకీపాక్స్  అనంతరం ప్రజలకు సంక్రమించింది. మొదటిలో ఈ వైరస్ కేసులు చాలావరకు మధ్య, పశ్చిమ ఆఫ్రికాలోనే వెలుగులోకి వచ్చాయి. ఈ వైరస్ లో రెండు
రెండు ప్రధాన రకాలు ఉన్నాయి. కాంగో జాతి .. ఇది అత్యంత తీవ్రమైనది. ఈ రకం వైరస్ సోకిన వారిలో 10 శాతం వరకు మరణించారు. 1958లో శాస్త్రవేత్తలు దీనిని మొదటిసారిగా గుర్తించారు. 1970లో మొట్టమొదటిగా తొమ్మిదేళ్ల కాంగో బాలుడికి ఈ వైరస్ సోకింది.

మంకీపాక్స్‌ లక్షణాలు:

మంకీపాక్స్‌ వైరస్ మశూచి వైరస్ లు  ఈ రెండూ ఒకే కుటుంబానికి చెందినవి. మంకీపాక్స్‌ వైరస్‌ను మనీపాక్స్‌ వైరస్‌ అని కూడా పిలుస్తారు. మంకీపాక్స్‌.. జ్వరంతో కూడిన లక్షణాలతో మొదలవుతుంది. ఈ వైరస్‌ సోకిన వారికి జ్వరం, కండరాల నొప్పులు, చలి, అలసట, ఒంటి మీద దద్దుర్లు వంటి వాటితో బాధపడుతున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఈ వైరస్‌ ముఖ్యంగా ముఖం ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇక మంకీపాక్స్‌ బారినపడ్డ వాళ్లు కోలుకోవడానికి పదిహేను రోజుల సమయం పడుతుంది. కాగా పది మందిలో ఒకరికి మాత్రమే ప్రాణాల మీదకు వస్తుంది. ఇక ఈ వ్యాధి తుంపర్ల ద్వారా, జంతువులు, మనుషులు, వైరస్‌ సోకిన వస్తువుల ద్వారానూ మంకీపాక్స్‌ వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్‌ బారిన పడ్డవాళ్లు.. ఇతరులకు దూరంటూ, సాధారణ ఫ్లూ కోసం తీసుకునే జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని వైద్యనిపుణులు చెప్తున్నారు. అదే సమయంలో వైరస్‌ కట్టడికి తగు జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..