Meta News: అక్కడ సేవలు నిలిపేస్తామన్న మెటా.. ఫేస్ బుక్, ఇన్ట్సాగ్రామ్ కు వినియోగదారులు దూరం!

|

Feb 10, 2022 | 6:21 PM

Meta closing services: యూరప్ లో ఫేస్ బుక్, ఇన్ట్సాగ్రామ్(face book, Instagram) సేవలను నిలిపివేసే ఉద్ధేశంలో ఉన్నట్లు మాతృసంస్థ మెటా తెలిపింది. తాజాగా విడుదల చేసిన వార్షిక నివేధికలో ఈ విషయాన్ని మెటా స్పష్టం చేసింది.

Meta News: అక్కడ సేవలు నిలిపేస్తామన్న మెటా.. ఫేస్ బుక్, ఇన్ట్సాగ్రామ్ కు వినియోగదారులు దూరం!
Meta Europe
Follow us on

Meta shutting in Europe: యూరప్ లో ఫేస్ బుక్, ఇన్ట్సాగ్రామ్(face book, Instagram) సేవలను నిలిపివేసే ఉద్ధేశంలో ఉన్నట్లు మాతృసంస్థ మెటా తెలిపింది. తాజాగా విడుదల చేసిన వార్షిక నివేధికలో ఈ విషయాన్ని మెటా స్పష్టం చేసింది. యూరప్ యూజర్ల డేటాను అమెరికాలోని మెటా సర్వర్లకు ట్రాన్స్ ఫర్ చేయకుండా 2020 లో అక్కడి కోర్టు ఇచ్చిన తీర్పు దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. డేటా ప్రైవసీ పేరుతో వినియోగదారుల సమాచారాన్న (Restricting data transfer) అమెరికా సర్వర్లకు తరలించకుండా అడ్డుకోవడం సరైన పద్దతి కాదని సంస్థ వాదిస్తోంది. ఇలాంటి చర్యల వల్ల తాము అక్కడి వినియోగదారులకు సేవలను అందిచలేమని.. అటువంటి పరిస్థితి వస్తే యూరప్ లోని తమ వ్యాపారం నష్టాలను చవిచూడవలసి ఉంటుందని వెల్లడించింది.

ఒకవేళ సంస్థ సేవలను మూసివేయవలసిన పరిస్థితి ఎదురైతే.. యూరప్ ఖండం మెుత్తం తమ సేవలకు దూరమౌతుందని హెచ్చరించింది. కొత్తగా తీసుకొస్తున్న చట్టాన్ని వ్యాపార అనుకూలంగా ఉండేలా చూసేందుకు మెటా సంస్థ అమెరికా ప్రభుత్వం తరఫునుంచి ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. తమ సేవలను నిరంతరాయంగా, వినియోగదారులను టార్గెట్ చేసుకుని యాడ్లను ప్రమోట్ చేయడంలో.. డేటా ట్రాన్ఫర్ ఎంత ముఖ్యమైనదో యూరోపియన్ ప్రభుత్వానికి, కోర్టులకు వివరిస్తోంది.

డేటా ప్రైవసీ పేరుతో ప్రస్తుతం ఉన్న ఆంక్షలను తొలగించి.. వాటి స్థానంలో అందరికీ అనుకూలమైన చట్టాలను త్వరితగతిన తీసుకురాలేకపోతే తమ ఫేస్ బుక్, ఇన్ట్సాగ్రామ్ సేవలు నిలిచిపోతాయని తేల్చి చెప్పింది. కొత్త చట్టాలు, నిబంధనలు “అననుకూలమైన ఫలితాలకు” దారితీస్తాయని, కొత్త ఉత్పత్తుల అభివృద్ధిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయని, “ప్రతికూల ప్రచారం మరియు ప్రతిష్టకు హాని” కలిగించవచ్చని మెటా అభిప్రాయపడింది. ఇప్పటికే ఉన్న వ్యాపార విధానాలను సవరించడానికి లేదా నిలిపివేయడానికి యూరోపియన్ ప్రభుత్వం.. కంపెనీని బలవంతం చేయవచ్చని మెటా పేర్కొంది.

ఇవీ చదవండి..

NRI News: విదేశాల్లోని భారతీయులు మ్యూచువల్ ఫండ్లలో ఇలా సింపుల్ గా ఇన్వెస్ట్ చేయవచ్చు.. పూర్తి వివరాలు చూడండి..

AIR INDIA: ఎయిర్ ఇండియాకు అసలు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా.. పేరు వెనుక ఉన్న కథను మీరూ తెలుసుకోండి..