ఆంటిగ్వా నుంచి తనను డొమినికాకు కిడ్నాప్ చేయడానికి పన్నిన కుట్రలో బార్బరా జరాబికా అనే మహిళ పాత్ర ఉందని వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ తెలిపాడు. ఈ మేరకు పోలీస్ కమిషనర్ కు ఇచ్చిన ఫిర్యాదులో ఆయన.. గత ఏడాది కాలంగా ఆమెకు, తనకు స్నేహం ఉందని, ఆమె జోలీ హార్బర్ లోని తన ఇంటి సమీపంలో ఉండేదని..ఆ తరువాత ‘కోకో బే’ అనే హోటల్ కి మారిందని ఆయన వెల్లడించాడు. నా స్టాఫ్ తో ఆమె ఫ్రెండ్లీగా ఉండేది.. మేం రెగ్యులర్ గా మాట్లాడుకునేవారం.. సాయంత్రం వేళల్లో వాకింగ్ కి వెళ్ళేవాళ్ళం….అని చోక్సీ ఈ ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే రోజూ కలుసుకునే పబ్లిక్ ప్లేస్ లో బదులు మెరీనా అనే ప్రాంతం వద్ద తనను కలుసుకోవాలని గత మే నెల 23 న ఆమె చెప్పిందని, దాంతో ఆ రోజు సాయంత్రం 5 గంటల 15 నిముషాలప్రాంతంలో అక్కడికి వెళ్లిన తనను ఆహ్వానించిందని వెల్లడించాడు. వైన్ తాగాలని ఉందని, మరికొద్ది నిముషాల్లో బయటకు వెళదామని చెప్పిందని ఆయన పేర్కొన్నాడు. తాము ఇలా మాట్లాడుతుండగానే తమ వెనుక పెద్ద శబ్దం వినబడిందని, ఆ వెంటనే 8 నుంచి 10 మంది వస్తాదుల్లాంటివారు అన్ని వైపుల నుంచి చొరబడ్డారని తెలిపాడు. తమను ఆంటిగ్వా పోలీసులమని చెప్పుకున్న వారు ..నీ గురించి అన్నీ మాకు తెలుసునని, కొంతకాలంగా నిన్ను గమనిస్తున్నామని చెప్పారని. అన్నాడు. తనను పోలీసు స్టేషన్ కు తీసుకువెళతామని చెప్పిన వారు వెంటనే తనపై తీవ్రంగా దాడి చేశారన్నాడు .. నన్ను ఇష్టం వఛ్చినట్టు కొట్టారు.. భౌతికంగా హింసించారు.. ఇంత జరుగుతున్నా బార్బరా జరాబికా నన్ను రక్షించడానికి గానీ..వారి నుంచి తప్పించడానికి గానీ రాలేదు..కనీసం కేకలు కూడా వేయలేదు..అని చోక్సీ తెలిపాడు.. దాంతో తనను కిడ్నాప్ చేయడానికి పన్నిన కుట్రలో ఆమె పాత్ర కూడా ఉందని తెలిసిందన్నాడు.
ఆ తరువాత తనను ఎత్తుకుపోయి ఓ బోటులో చేర్చారని, అందులో ఇద్దరు భారతీయులు, ముగ్గురు డొమినికావాసులు ఉన్నారని, వారిని చూస్తే కిరాయి కాంట్రాక్టర్ల మాదిరి ఉన్నారని ఇదంతా చూస్తే తనను అపహరించుకుపోవడానికి ముందే వేసుకున్న పథకంలా కనిపించిందని అన్నాడు. మొత్తానికి సినీ ఫక్కీలో జరిగిన ఈ ఉదంతంలో బార్బరా పాత్ర ఉందని స్పష్టంగా తెలిసిపోయింది. కాగా” బార్బరా ఆంటిగ్వా పౌరురాలు కాదని, ఆమె తనను తాను ప్రాపర్టీ రేనోవేషన్ ఎక్స్ పర్ట్ గా చెప్పుకుందని చోక్సీ భార్య ప్రీతి చెబుతున్నారు. తన భర్త అదృశ్యం తరువాత ఆమె ఆచూకీ కనబడలేదన్నారు. అటు-లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో బార్బరా చదివినట్టు చెబుతున్నా అక్కడి రికార్డుల్లో ఆమె పేరు మాత్రం కనిపించలేదు.
మరిన్ని ఇక్కడ చూడండి: భారత్‌లో మరో ప్రమాదకర కరోనా వేరియంట్..కొత్తరకం వైరస్ లక్షణాలు ఇవే :New Virus in India video.