Sanna Marin Divorce: 19 ఏళ్ల స్నేహానికి.. మూడేళ్ళ వైవాహిక బంధానికి తెర.. విడాకులు తీసుకోనున్న ఫిన్లాండ్‌ ప్రధాని

అతిచిన్న వయసులోనే దేశ అత్యున్నత పదవి చేపట్టి ఫిన్లాండ్‌ లో డైనమిక్‌ ప్రధానిగా పేరు తెచ్చుకున్న సనా మారిన్‌ తమ బంధం గురించి గుర్తు చేసుకున్నారు. మేమిద్దరం చిన్నతనం నుంచి కలిసి ఉన్నాం.. కలిసి పెరిగాం.. కలిసి తిరిగాం.. 19 ఏళ్లుగా కలిసి జీవించాం..

Sanna Marin Divorce: 19 ఏళ్ల స్నేహానికి.. మూడేళ్ళ వైవాహిక బంధానికి తెర.. విడాకులు తీసుకోనున్న ఫిన్లాండ్‌ ప్రధాని
Sanna Marin Divorce

Updated on: May 11, 2023 | 1:17 PM

ఫిన్లాండ్ ప్రధానిగా పనిచేసిన సన్నీ మారిన్ తన వైవాహిక బంధానికి గుడ్ బై చెప్పనున్నారు. సనా మారిన్  భర్తకు విడాకులు ఇవ్వనునున్నారు. సనా మారిన్ సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. సనా మారిన్, ఆమె భర్త కలిసి కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలిపారు. సన్నా మారిన్ ప్రధాన మంత్రి పదవి చేపట్టిన తరువాత మార్కస్ రైకోనెన్ ను ప్రధానమంత్రి అధికారిక నివాసంలో కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో 2020లో వివాహం చేసుకున్నారు.

అతిచిన్న వయసులోనే దేశ అత్యున్నత పదవి చేపట్టి ఫిన్లాండ్‌ లో డైనమిక్‌ ప్రధానిగా పేరు తెచ్చుకున్న సనా మారిన్‌ తమ బంధం గురించి గుర్తు చేసుకున్నారు. మేమిద్దరం చిన్నతనం నుంచి కలిసి ఉన్నాం.. కలిసి పెరిగాం.. కలిసి తిరిగాం.. 19 ఏళ్లుగా కలిసి జీవించాం.. మా ఇద్దరినీ కలిపి ఉంచిన మా అందమైన కుమార్తెకు కృతఙ్ఞతలు.. మేము విడిపోయినా మేము మంచి స్నేహితులం.. తమ కూతురుకి తల్లిదండ్రులం.. ఇక నుంచి కుమార్తె కోసం సమయం కేటాయిస్తానని ఇన్ స్టాగ్రామ్ లో ద్వారా తెలియజేశారు.

ఇవి కూడా చదవండి

 2020లో వివాహం  
వీరిద్దరూ 18 ఏళ్ల నుంచి డేటింగ్‌లో ఉన్న తర్వాత.. 2020 లో వివాహం చేసుకున్నారు. ఇద్దరికీ ఎమ్మా అనే ఐదేళ్ల కూతురు ఉంది. తన వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచాలని భర్తకు విజ్ఞప్తి చేశారు సనా మారిన్.

ప్రపంచంలో ప్రసిద్ధి.. కానీ ఎన్నికల్లో ఓటమి 
ప్రపంచంలో తన రచనలతో పేరుగాంచిన సనా మారిన్ ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో  ఓటమిపాలయ్యారు. 34 సంవత్సరాల వయస్సులోసనా 2019 లో ఫిన్లాండ్ ప్రధానమంత్రి అయ్యారు. వ్యక్తిగత జీవితంలో వివాదాలు ఎక్కువ అవ్వడంతో ప్రధాని పదవికి రాజీనామా చేశారు. అయితే, కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..