యూఎస్ లో గ్రీన్ కార్డులు కోరేవారికి శుభవార్త ! త్వరలో రానున్న కొత్త చట్టం, బైడెన్ సంతకమే తరువాయి

| Edited By: Anil kumar poka

Feb 20, 2021 | 3:17 PM

యూఎస్ లో గ్రీన్ కార్డు సౌకర్యాన్ని పొందగోరేవారికి శుభవార్త ! వారికోసం యూఎస్ సిటిజెన్ షిప్ యాక్ట్-2021 ని తెచ్చే విషయాన్ని జోబైడెన్ ప్రభుత్వం చురుకుగా పరిశీలిస్తోంది.

యూఎస్ లో గ్రీన్ కార్డులు కోరేవారికి శుభవార్త ! త్వరలో రానున్న కొత్త చట్టం, బైడెన్ సంతకమే తరువాయి
Follow us on

యూఎస్ లో గ్రీన్ కార్డు సౌకర్యాన్ని పొందగోరేవారికి శుభవార్త ! వారికోసం యూఎస్ సిటిజెన్ షిప్ యాక్ట్-2021 ని తెచ్చే విషయాన్ని జోబైడెన్ ప్రభుత్వం చురుకుగా పరిశీలిస్తోంది. అమెరికాలో శాశ్వత నివాసం ఏర్పరచుకోవాలనుకునే ఐటీ ప్రొఫెషనల్స్, ఇతరులకు కూడా ఇది ప్రధాన వార్తే.. ఈ కొత్త చట్టాన్ని (బిల్లును) వచ్ఛే గురువారం చట్ట సభలో ప్రవేశపెట్టనున్నారు. గ్రీన్ కార్డు కోసం 10 ఏళ్లకు పైగా వేచి చూస్తున్న వారికివెంటనే శాశ్వత నివాస సౌకర్యం లభిస్తుంది.   వీసా ‘బ్యాన్’ నుంచి వీరిని మినహాయిస్తారు. దేశాధ్యక్షునిగా గత జనవరి 20 న జోబైడెన్ ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటల్లోనే ఈ చట్టం తాలూకు బిల్లును కాంగ్రెస్ కు పంపారు. చట్ట విరుద్ధంగా ఉన్న సుమారు 11 మిలియన్ల మంది  ఇక్కడ ఈ చట్టం కింద శాశ్వత నివాసం పొందాలనుకుంటే ఎనిమిదేళ్లు ఆగాల్సి ఉంటుంది. చట్టసభ ఈ బిల్లును ఆమోదించి వైట్ హౌస్ కు పంపగానే బైడెన్  దీనిపై సంతకం చేయాల్సి ఉంటుంది.

ఇక యూఎస్ యూనివర్సిటీల నుంచి ‘స్టెమ్’ డిగ్రీలు తీసుకున్న గ్రాడ్యుయేట్లకు మరింత వెసులుబాటు ఉంటుంది. ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డులకు గల అన్ని అనవసరమైన అవరోధాలను తొలగించాలని ఈ బిల్లులో నిర్దేశించారు. ఏమైనా ఈ చర్య లక్షలాది ఇండియన్ ప్రొఫెషనల్స్ కి గొప్ప వరమే కానుంది. నూతన చట్టం కింద డైవర్సిటీ వీసాలను 55 వేలనుంచి 80 వేలకు పెంచనున్నారు.

మరిన్ని చదవండి ఇక్కడ :

గాల్వన్ లోయలో ఘర్షణలు, తాజాగా వీడియో రిలీజ్ చేసిన చైనా, ఉద్రిక్తతకు నాడే బీజం.

Elephants Attack Man Video: యువకుడిని తొక్కి చంపిన ఏనుగుల గుంపు.