Earthquake: 45 నిమిషాల వ్యవదిలోనే 2 భారీ భూకంపాలు.. భయంతో వణికిపోయిన ప్రజలు
నేపాల్- టిబెట్ సరిహద్దులో గత ఆగస్ట్ సంభవించిన భారీ జల ప్రలయం 1400 మందిని పొట్టనపెట్టుకున్న ఘటన మరువక ముందే తాజాగా టిబెట్‌ను రెండు భారీ భూకంపాలు వణికించాయి. గంట వ్యవధిలోనే అరుణాచల్ సమీపంలో 7.0, 5.0 తీవ్రతతో రెండు భూకంపాలు సంభవించాయి.

రెండు నెలల క్రితం నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతాన్ని అతలాకుతలం చేసిన ఆకస్మిక వరదలు ఘటన మరువక ముందే తాజాగా గురువారం టిబెట్‌ను రెండు భూకంపాలు వణికించాయి. జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం ప్రకారం గంట వ్యవధిలోనే ఈ రెండు భూకంపాలు సంభించాయి. రాత్రి 8.03 గంటలకు , అరుణాచల్ ప్రదేశ్‌లోని పాండిన్‌కు సుమారు 489 కిలోమీటర్ల ఉత్తర-వాయువ్య దిశలో టిబెట్‌లో 7.0 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం సముద్ర మట్టానికి 173 కిలోమీటర్ల లోతులో సంభవించిందని NCS తెలిపింది.
అయితే అది సంభించిన కాసేపటికే రాత్రి సుమారు 8.42 గంటలకు, అరుణాచల్ ప్రదేశ్‌లోని బసర్‌కు ఉత్తర-వాయువ్యంగా 323 కిలోమీటర్ల దూరంలో 5.0 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. ఈ భూకంపం సముద్ర మట్టానికి 15 కిలోమీటర్ల లోతులో సంభవించినట్లు NCS డేటా వెల్లడించింది. అయితే ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తి నష్టంపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటనణు రాలేదు.
పోస్ట్ చూడండి..
7.0-MAGNITUDE QUAKE HITS TIBET
A powerful 7.0-magnitude earthquake has struck Tibet, just weeks after deadly flash floods battered the region. Details on damage and casualties are awaited. #Tibet #Earthquake #BreakingNews #NaturalDisaster #China #WorldNews
Video: IRENE https://t.co/RfR3l1lIeY
— Diganta Guha (@diganta_guha) October 22, 2026
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
