Shooting in Canada: కెనడాలో దుండులు తుపాకీలతో రెచ్చిపోయారు. విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డారు. బ్రిటీష్ కొలంబియా రాష్ట్రంలోని లాంగ్లీ నగరంలో కొందరు దుండగులు పౌరులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో చాలా మంది ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి అధికారులు ప్రకటించారు. అయితే, ఎంతమంది చనిపోయారనేది స్పష్టంగా ప్రకటించలేదు. కాగా, కాల్పులు జరిగిన ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు అధికారులు. ఘటనా స్థలం వద్దకు ఎవరూ రావొద్దని సూచించారు.
లాంగ్లీ నగరంలో స్థానిక కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం ఒంటిగంటకు కాల్పులు జరిపారు దుండగులు. ఈ మాస్ కాల్పుల వెనుక దుండగులు ఏదో కుట్ర పన్నినట్లు అధికారులు భావిస్తున్నారు. ఒక అనుమానితుడు సంచరిస్తున్నాడని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఎమర్జెన్సీ అలర్ట్ జారీ చేశారు. ఈ ఘటనలో ఒక అనుమానితుడిని అరెస్ట్ చేశామని వెల్లడించారు. నిరాశ్రుయులైన వారినే లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారని తెలిపారు. ఈ ఘటన తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ.. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన మాత్రం విడుదల చేయలేదు పోలీసు అధికారులు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..