ఆ శునకాన్ని తమ కుటుంబంలో మెంబర్ గా చూసుకున్నాడా యజమాని.. ఎంతో ఆప్యాయంగా పెంచుకుంటూ వచ్చాడు. దాన్ని తనతో బాటు లండన్ శివార్లలోని బ్రెకన్ బెకన్స్ ప్రాంతంలో గల ఎత్తయిన కొండలపైకి తనతో తీసుకువెళ్ళేవాడు. తనకు ఇష్టమైన ఈ ట్రెక్కింగ్ ని ఆ జాగిలానికి కూడా అలవాటు చేశాడు. మోంటీ అనే పేరుగల ఈ శునకం కూడా దీన్ని ఎంతో ఎంజాయ్ చేసేది. లండన్ లోని కార్లో ఫ్రెస్కో అనే ఈ యజమాని ఉదంతాన్నే తీసుకుంటే…సుమారు పదేళ్ల క్రితం లాబ్రడార్ జాతికి చెందిన ఈ కుక్కను ఈయన తెచ్చుకుని పెంచుకున్నాడు. తన ఫ్రెండ్ లా, తన ఫ్యామిలీ మెంబర్ లా దానిమీద అభిమానం పెంచుకున్నాడు. సహజంగా మోంటీ కూడా ఆయనకు మాలిమి అయిపోయింది. కార్లో తనకు ఇష్టమైన ‘పెన్ వై ఫ్యాన్’ అని వ్యవహరించే ఎత్తయిన కొండ ప్రాంతానికి ఈ కుక్కను కూడా తనవెంట బెట్టుకుని తీసుకువచ్చేవాడు. ఫ్రెండ్స్ లాగే దానితో సరదాగా ఆడుకుంటే అది కూడా అలాగే ఆయనతో పరుగులు తీసేది. ఎవరూ లేని చోట నిర్మానుష్యమైన ఆ కొండల్లో చల్లని గాలుల వాతావరణం మధ్య వీరి ఎంజాయ్ సాగుతూ వచ్చింది. అప్పుడప్పుడు అక్కడికి వచ్చే ప్రజలు, టూరిస్టులు కూడా ఈ ఆటలు చూసి ముచ్చట పడేవారు. మోంటీని ఆప్యాయంగా నిమిరేవారు.
అయితే ఎలా సోకిందో గానీ మోంటీకి క్యాన్సర్ సోకింది. దీంతో రోజురోజుకీ చిక్కిపోతూ వచ్చింది. ఇక దానికి మరణం తధ్యమని తెలిసి..కార్లో..దాన్ని వీల్ చైర్ వంటి దాన్లో ఈ కొండ ప్రాంతానికి తీసుకురావడం ప్రారంభించాడు. చివరకు జూన్ 21 న మోంటీ ..ల్యుకేమియాతో చనిపోయింది. కార్లో దుఃఖానికి అంతులేకపోయింది. తన ‘డియరెస్ట్ ఫ్రెండ్’ లాస్ట్ జర్నీ ఇదే అని ఇప్పటికీ తలచుకుని ఆయన కుమిలిపోతున్నాడు.
మరిన్ని ఇక్కడ చూడండి : కేటీఆర్ మాటలకు సోను సూద్ ఫిదా..ప్రగతి భవన్ లో రియల్ హీరో తెలంగాణ మంత్రి ప్రశంసలు :Sonu Sood meet ktr Video.
మాట నిలుపుకున్న సోను సూద్..!నెల్లూరు వాసులు ఖుషి..ఆక్సిజన్ ప్లాంట్ పంపిన రియల్ హీరో:Sonu Sood video.