Women in Technology 2022: అబ్బబ్బ.. ఏమి సేస్తిరి! మహిళల అవార్డును ఓ పురుషుడికి ఇస్తిరా? ఏమి ఉదారతా..

|

Sep 03, 2022 | 1:17 PM

విమెన్ ఇన్ టెక్నాలజీ 2022 అవార్డు ప్రధానోత్సవంలో ఫైనల్‌ అవార్డు ఒక పురుషుడికి ఇవ్వడంపై సోషల్‌ మీడియాలో తీవ్ర దుమారం రేగింది. ప్రపంచ వ్యాప్తంగా..

Women in Technology 2022: అబ్బబ్బ.. ఏమి సేస్తిరి! మహిళల అవార్డును ఓ పురుషుడికి ఇస్తిరా? ఏమి ఉదారతా..
Women In Technology
Follow us on

Inspiring Diversity in STEM Awadrs: విమెన్ ఇన్ టెక్నాలజీ 2022 అవార్డు ప్రధానోత్సవంలో ఫైనల్‌ అవార్డు ఒక పురుషుడికి ఇవ్వడంపై సోషల్‌ మీడియాలో తీవ్ర దుమారం రేగింది. వుమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు పురుషులకు కట్టబెట్టడం విడ్డూరంగా ఉందంటూ సర్వత్రా విమర్శిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో అత్యున్నత ప్రతిభ, గుర్తింపు పొందిన మహిళలను ప్రోత్సహించేందుకు ఈ అవార్డులను ప్రధానం చేస్తారు. నిజానికి Inspiring Diversity in STEM’ అవార్డులనేవి ఇండస్ట్రీ లీడర్లలో సమానత్వం, లింగ వైవిధ్యాన్ని ప్రోత్సహించేందుకు ఉద్ధేశించబడినవి. దీనిలో భాగంగా ఈ యేడాది కూడా ఆస్ట్రేలియాలో విమెన్ ఇన్ టెక్నాలజీ 2022 అవార్డు ప్రధానోత్సవం జరిగింది. ఐతే ఈ అవార్డు ప్రధానోత్సవంలో ఆస్ట్రేలియాలో సీనియర్ ఎగ్జిక్యూటివ్, డిజిటల్ లీడర్ సైమన్ బటన్ అనే వ్యక్తిపేరుతోపాటు, మరో ముగ్గురు మహిళల పేర్లను కూడా ‘ఇన్‌స్పైరింగ్ డైవర్సిటీ ఇన్‌ స్టెమ్ కేటగిరీ’కి నామినేట్ చేశారు. ‘ఇన్‌స్పైరింగ్ డైవర్సిటీ ఇన్ STEM’ వార్షిక అవార్డులకు ఎంపికైన నలుగురు ఫైనలిస్టులలో సైమన్ బటన్‌ పేరు కూడా ఉండటంతో సోషల్ మీడియాలో అభ్యంతరాలు నెలకొన్నాయి.

‘జండర్‌, వయసు, నేపథ్యాలతో సంబంధంలేకుండా లీడర్లందరికీ మొదటి సారిగా WiT అవార్డులు ప్రధానం చేస్తున్నట్లు. మా కమ్యూనిటీ వైఖరిలో ఏ విధమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయో తెల్పేందుకు ఇది ప్రతీక’ అని ఆస్ట్రేలియాకు చెందిన విమెన్ ఇన్ టెక్నాలజీ తన ఫేస్‌బుక్ ఖాతాలో షేర్‌ చేసిన పోస్ట్‌లో తెల్పింది.

ఇవి కూడా చదవండి

దీనిపై కొందరు నెటిజన్లు ఈ విధంగా కామెంట్‌ చేస్తున్నారు.. ‘టెక్నాలజీలో మహిళల ప్రతిభకు గుర్తింపుగా ఇచ్చే అవార్డులను ఒక పురుషుడికి ఇవ్వాలనుకుంటున్నారా? ఇది చాలా కామెడీగా ఉందని’ ఒకరు, మహిళల అవార్డును సైమన్ బటన్‌కు ఇవ్వడానికి బదులు స్థానిక, శ్వేత లేదా నల్ల జాతి మహిళకు ఇవ్వవచ్చు. ఎంతో ఉదారతతో ఒక పురుషుడికి ఇస్తారా? అని మరికొందరు అభిప్రాయపడ్డారు.

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.