Corona Fear: కరోనా మహహ్మారి భయం అంతా ఇంతా కాదు. ఓ వ్యక్తి కరోనా భయంతో ఎయిర్ పోర్టులో ఏకంగా మూడు నెలలు దాక్కున్న ఘటన అమెరికాలోని చికాగో విమానాశ్రయంలో చోటు చేసుకుంది. ఆదిత్య సింగ్ అనే వ్యక్తి మూడు నెలల పాటు ఎయిర్‌పోర్టును విడిచి వెళ్లకుండా అందులోనే ఉండిపోయాడు. విమానాశ్రయంలోని నిషేధిత ప్రాంతంలో ఉంటున్న అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. కాలిఫోర్నియాకు చెందిన ఆదిత్య సింగ్ గత సంవత్సరం అక్టోబర్ 19న చికాగోలోని ఓ విమానాశ్రయానికి చేరుకున్నాడు. అయితే 36 ఏళ్ల ఆదిత్యసింగ్.. ఆ విమానాశ్రయంలోనే నకిలీ ఐడీతో ఓ ఉద్యోగిలా ఉండిపోయాడు. కరోనా వైరస్ సోకుతుందన్న భయంతో అతను తిరిగి లాస్ ఏంజిల్స్‌కు వెళ్లలేదు. జనవరి 16న పోలీసులు ఆదిత్య సింగ్‌ను అరెస్టు చేశారు.
మూడు నెలలుగా ఓ వ్యక్తి ఎయిర్‌పోర్టులో నివసిస్తుంటే మీరేం చేస్తున్నారని చికాగో కౌంటీ జడ్జి సుసానా ఆర్జిజ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఉద్యోగులు 911కు ఫోన్ చేసి పట్టించారు. హాస్పిటాలిటీలో అతనికి మాస్టర్స్ డిగ్రీ ఉంది. లాస్ ఏంజిల్స్‌కు అతను రూమ్‌మేట్స్‌తో ఉంటున్నాడు. వెయ్యి డాలర్లకు అతనికి బెయిల్ ఇచ్చేందుకు కోర్టు అంగీకరించింది.
Also Read:
FBI Screens US : పెద్దన్న జో ప్రమాణస్వీకారోత్సవానికి భారీ భద్రత.. అమెరికా చరిత్రలోనే ఇలా తొలిసారి