AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maldives: భారత్‌తో కయ్యం.. పతనం దిశగా మాల్దీవుల ప్రెసిడెంట్ మొహమ్మద్ ముయిజు సర్కార్

మాల్దీవుల అధ్యక్షులు మహమ్మద్ ముయిజూ ప్రభుత్వానికి సమస్యలు చుట్టుముడుతున్నాయి. తమ ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోవచ్చన్నట్లుగా దేశంలో పరిస్థితి తయారైంది. సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నామని ప్రతిపక్షాలు సూచిస్తున్నాయి. సమయం వచ్చినప్పుడు మహ్మద్ ముయిజు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడతామన్నారు.

Maldives: భారత్‌తో కయ్యం.. పతనం దిశగా మాల్దీవుల ప్రెసిడెంట్ మొహమ్మద్ ముయిజు సర్కార్
Maldives President Mohamed Muizzu
Balaraju Goud
|

Updated on: Feb 01, 2024 | 10:40 AM

Share

మాల్దీవుల అధ్యక్షులు మహమ్మద్ ముయిజూ ప్రభుత్వానికి సమస్యలు చుట్టుముడుతున్నాయి. తమ ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోవచ్చన్నట్లుగా దేశంలో పరిస్థితి తయారైంది. సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నామని ప్రతిపక్షాలు సూచిస్తున్నాయి. సమయం వచ్చినప్పుడు మహ్మద్ ముయిజు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడతామన్నారు. వాస్తవానికి మహ్మద్ ముయిజ్జూ ప్రభుత్వంతో విభేదాల కారణంగా అధికార, ప్రతిపక్ష ఎంపీల మధ్య పార్లమెంట్‌లో వాగ్వాదం జరిగింది.

పార్లమెంట్‌లో జరిగిన ఘర్షణ తర్వాత మహ్మద్‌ ముయిజు ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ప్రధాన ప్రతిపక్ష పార్టీ మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ (MDP) మహమ్మద్ ముయిజుపై అభిశంసన తీర్మానం కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పార్లమెంట్‌లో గందరగోళం నెలకొనడంతో ఈ ప్లాన్‌ చేశారు. డెమోక్రాట్‌లతో పాటు మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ ఈ ప్రతిపాదనకు అవసరమైన మద్దతును పొందినట్లు సమాచారం. ప్రతిపక్షాల ఐక్యత దృష్ట్యా, ఈ సంక్షోభాన్ని అధిగమించడం మహమ్మద్ ముయిజు ప్రభుత్వానికి అంత సులభం కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

భారత ప్రధాని నరేంద్ర మోదీకి క్షమాపణలు చెప్పాలని మాల్దీవుల ప్రతిపక్ష నేతలు ఇప్పుడు అధ్యక్షుడు మహ్మద్ ముయిజుపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. భారత్‌తో సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించాలని మాల్దీవుల జంహూరీ పార్టీ నాయకుడు కాసిం ఇబ్రహీం మహ్మద్ ముయిజుకు సూచించారు. తన చైనా పర్యటన తర్వాత చేసిన వ్యాఖ్యలకు రాష్ట్రపతి భారతదేశ ప్రజలకు, ప్రధాని మోదీకి క్షమాపణలు చెప్పాలని, లేదంటే ఇది మాల్దీవులకు హాని కలిగిస్తుందని ఆయన అన్నారు.

మాల్దీవులలో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే, చైనా అనుకూల మహ్మద్ ముయిజూ భారతదేశంతో తన సంబంధాల పట్ల కఠినమైన వైఖరిని ప్రదర్శించడం ప్రారంభించాడు. ఇందులో భాగంగా తమ దేశం నుంచి సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని భారతదేశాన్ని కోరాడు. దీని తర్వాత, ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటన తర్వాత, మాల్దీవులతో పోల్చడంతో మహమ్మద్ ముయిజు మంత్రుల అనుచిత వ్యాఖ్యలు మరింత ఉద్రిక్తతను పెంచాయి. దీంతో మాల్దీవుల పర్యటన రద్దు చేసుకోవడంతో భారతీయులు ఆర్థికంగా భారీగా నష్టపోవాల్సి వచ్చింది. ఇది కాకుండా, చైనా గూఢచారి నౌక మాల్దీవుల పర్యటనకు సంబంధించి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

సౌందర్య భర్త ఇప్పుడేం చేస్తున్నారంటే.. సీనియర్ హీరో..
సౌందర్య భర్త ఇప్పుడేం చేస్తున్నారంటే.. సీనియర్ హీరో..
ఒకటి కంటే ఎక్కువ PF అకౌంట్లు ఉన్నాయా? వాటిని విలీనం చేయడం ఎలా?
ఒకటి కంటే ఎక్కువ PF అకౌంట్లు ఉన్నాయా? వాటిని విలీనం చేయడం ఎలా?
తెలంగాణ TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్ లింక్
తెలంగాణ TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్ లింక్
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.