వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అమెరికాలో నిరసనలు.. జాతిపిత గాంధీ విగ్రహం ధ్వంసం.. ఖలిస్థానీ మద్దతుదారుల దుశ్చర్య..

|

Dec 13, 2020 | 11:42 AM

అమెరికాలో దారుణం చోటు చేసుకుంది. వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయం ముందు ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు.

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అమెరికాలో నిరసనలు.. జాతిపిత గాంధీ విగ్రహం ధ్వంసం.. ఖలిస్థానీ మద్దతుదారుల దుశ్చర్య..
Follow us on

Mahatma Gandhi’s statue Defaced: అమెరికాలో దారుణం చోటు చేసుకుంది. వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయం ముందు ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఖలిస్థానీ మద్దతుదారులు ధ్వంసం చేశారు. విగ్రహానికి రంగులు పూసి బ్యానర్లు కప్పేశారు. భారత్​లో కొత్తగా తీసుకొచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా సిక్కు-అమెరికన్లు చేపట్టిన నిరసనల సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది.

ఇండియాలో నిరసనలు చేస్తోన్న రైతులకు సంఘీభావంగా.. గ్రేటర్​ వాషింగ్టన్​ డీసీ, మేరీలాండ్​, వర్జీనియాలతో పాటు న్యూయార్క్​, న్యూజెర్సీ, పెన్సిల్వేనియా, ఇండియానా, ఓహియో, నార్త్​ కరోలినా వంటి రాష్ట్రాల నుంచి వందల మంది సిక్కులు ఆందోళనలు చేపట్టారు. వాషింగ్టన్​ డీసీలోని భారత రాయబార కార్యాలయం వద్ద కార్ల ర్యాలీ నిర్వహించారు.

అయితే.. శాంతియుతంగా జరుగుతున్న నిరసనల్లో వేర్పాటువాద సిక్కులు ఖలిస్థానీ జెండాలు, భారత వ్యతిరేక పోస్టర్లు, బ్యానర్లతో ప్రవేశించటంతో ఉద్రిక్తంగా మారాయి. వారంతా ‘ద రిపబ్లిక్​ ఆఫ్​ ఖలిస్థాన్​’కు చెందినవారిగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా చాలా మంది ఖలిస్థానీ అనుకూల సిక్కు యువత.. మహాత్మా గాంధీ విగ్రహం వద్దకు వెళ్లి భారత్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోస్టర్లను గాంధీ విగ్రహంపై ఉంచారు. కాగా, ఈ ఘటన పట్ల వాషింగ్టన్ మెట్రోపాలిటన్ అధికారులు భారత రాయబార కార్యాలయానికి క్షమాపణలు తెలిపారు. అటు ఈ ఘటనపై పోలీసులు పలువురు ఆందోళనకారులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.