
జపాన్‌లో మరోసారి భారీ భూకంపం జనాలను భయబ్రాంతులకు గురిచేసింది. హోన్షు తూర్పు తీరానికి సమీపంలో శనివారం సాయంత్రం ఒక్కసారిగా భూమి కంపించడం ప్రారంభించింది. దీంతో ఇళ్లు, ఆఫీస్‌లు, భవనాలలో ఉన్న జనాలు ఒక్కసారిగా భయటకు పరుగులు పెట్టారు. ప్రాణాలు చేతపట్టుకొని సుక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. ఈ భూకంపం ధాటికి చాలా ప్రాంతాల్లో భవనాలు దెబ్బతిన్నాయి. కొన్ని చోట్లు ధ్వంసమయ్యాయి. అయితే ఈ భూకంపం ధాటికి ప్రాణనష్టం ఏదైనా జరిగిందా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. కానీ కొంత మేర ఆస్తినష్టం జరిగినట్టు తెలుస్తోంది.
అయితే జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ ప్రకారం రిక్టర్ స్కేల్‌పై భూకంపం తీవ్రత 6.0గా నమోదైనట్టు తెలుస్తోంది. భూమి నుంచి సుమారు 50 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్ర ఏర్పడి ఉండవచ్చని.. అక్కడ కదలికలు సంభవించినట్
పేర్కొంది.
EQ of M: 6.0, On: 04/10/2025 20:51:09 IST, Lat: 37.45 N, Long: 141.52 E, Depth: 50 Km, Location: Near East Coast of Honshu, Japan.
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjdtw0 @DrJitendraSingh @OfficeOfDrJS @Ravi_MoES @Dr_Mishra1966 pic.twitter.com/tYInT4jlwY— National Center for Seismology (@NCS_Earthquake) October 4, 2025
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.