Living Nostradamus: ప్రపంచాన్ని భయపెడుతోన్న లివింగ్ నోస్ట్రాడమస్ భవిష్యత్ అంచనాలు.. మూడో ప్రపంచ యుద్ధం ముంగిట దేశాలు

|

Nov 02, 2024 | 11:41 AM

'లివింగ్ నోస్ట్రాడమస్' అని పిలువబడే అథోస్ సలోమ్ చెప్పిన భవిష్యత్తు సంఘటనలు ప్రస్తుతం మళ్ళీ వార్తల్లో నిలుస్తున్నాయి. ఇప్పటికే నోస్ట్రాడమస్ చెప్పిన మైక్రోసాఫ్ట్ గ్లోబల్ షట్‌డౌన్, కరోనావైరస్ మహమ్మారి, ఎలోన్ మస్క్ ట్విట్టర్‌ను స్వాధీనం చేసుకోవడం వంటివి నిజం అయ్యాయని.. త్వరలో మూడో ప్రపంచం యుద్ధం జరిగే అవకాశం ఉందంటూ కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.

Living Nostradamus: ప్రపంచాన్ని భయపెడుతోన్న లివింగ్ నోస్ట్రాడమస్ భవిష్యత్ అంచనాలు.. మూడో ప్రపంచ యుద్ధం ముంగిట దేశాలు
Living Nostradamus
Image Credit source: social media
Follow us on

గత కొన్ని నెలలుగా మిడిల్ ఈస్ట్‌లో కొనసాగుతున్న యుద్ధం, ఉద్రిక్తతపై ప్రపంచం మొత్తం ఒక కన్ను వేసి ఉంచుతోంది. ఇందుకు సంబంధించిన అనేక వార్తలు ప్రతిరోజూ వినిపిస్తూనే ఉన్నాయి. సుదీర్ఘమైన యుద్ధాల వలన ప్రపంచంలో మూడో ప్రపంచ యుద్ధం భయం వెంటాడుతోంది. ‘లివింగ్ నోస్ట్రాడమస్’ మూడో ప్రపంచ యుద్ధం జరిగే అవకాశం ఉందని హెచ్చరించిన విషయాన్నీ గుర్తు చేస్తున్నారు. ఇరాన్, ఇజ్రాయెల్ రెండు దేశాలు తమ సైనిక వ్యూహాలలో కృత్రిమ మేధస్సును ఎక్కువగా ఉపయోగించుకుంటాయని లివింగ్ నోస్ట్రాడమస్ చెప్పారు. కృతిమ మేధస్సున దుర్వినియోగం వలన సంఘర్షణ మరింత పెరిగి ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టే అవకాశం ఉందని చెప్పారు.

ముఖ్యంగా US, రష్యా, చైనా, ఉత్తర కొరియా వంటి దేశాలు EMP (EMP అనేది సమాచార వ్యవస్థలను నాశనం చేయడానికి రూపొందించబడిన పరికరం) సాంకేతికతను ఎక్కువ ఉపయోగిస్తాయని.. ఇది ప్రమాదకరమని నోస్ట్రాడమస్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ అవస్థాపన పతనానికి, సమాజం పతనానికి దేశాల్లో అరాచకాల వ్యాప్తికి EMP సాంకేతికత కారణం అవుతుందని హెచ్చరించారు.

డైలీ మెయిల్‌కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సలోమీ మాట్లాడుతూ.. అమెరికా చైనా దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ఈ రెండు దేశాల మధ్య వైరం తో దక్షిణ చైనా సముద్రం అస్థిర ప్రాంతంగా మారే అవకాశం ఉందని చెప్పారు. దేశం భద్రతా వ్యవస్థపై సైబర్ దాడి చేయడంతో యుద్ధానికి దారితీయవచ్చని తెలిపారు.

ఇవి కూడా చదవండి

ముఖ్యంగా చైనా, రష్యా దేశాల మధ్య పెరిగుతున్న స్నేహం ప్రపంచంలో దేశాల మధ్య వివాదాలకు దారితీస్తుందని సలోమ్ హెచ్చరించారు. వేగవంతమైన ఆర్థిక వృద్ధి, గణనీయమైన భౌగోళిక రాజకీయ ప్రాముఖ్యతతో ఆసియాలో అస్థిరత నెలకొంటుందని చెప్పారు. లివింగ్ నోస్ట్రాడమస్ ఈ అంచనాలు ప్రపంచ యుద్ధం III గురించి ఆందోళనను మరింత తీవ్రతరం చేశాయి. సర్వత్రా అథోస్ సలోమ్ చెప్పిన విషయాలపై ఆసక్తి నెలకొంది.

 

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..