బంగ్లాదేశ్ లో బుధవారం అనేక చోట్ల పిడుగులు పడ్డాయి. తుపాను ప్రభావం తీవ్రంగా ఉండడంతో బాటు చాపేనవాబ్ గంజ్ జిల్లాలోని శిబ్ గంజ్ అనే చోట కేవలం కొన్ని సెకండ్ల కాలంలో పిడుగులు పడి ఓ పెళ్లిబృందంలోని 16 మంది మృతి చెందారు. ఈ బృందంలోని వరుడు గాయపడినట్టు అధికారులు తెలిపారు.మొత్తం 14 మంది గాయపడ్డారని…వారిని ఆసుపత్రికి తరలించామని వారు పేర్కొన్నారు. ఇక్కడి నదీ తీరంలో బోటు నుంచి దిగి షెల్టర్ కోసం వెళ్తున్నవారిపై పిడుగులు పడ్డాయని.. ఈ బృందంలో పెళ్లికూతురు లేకపోవడంతో ఆమె ప్రాణాలతో బయట పడిందని వారు చెప్పారు. బంగ్లాలో గత వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాక్సో బజార్ జిల్లాలో ఆరుగురు రోహింగ్యా శరణార్థులతో బాటు సుమారు 20 మంది మరణించారు. వాతావరణ మార్పుల కారణంగా ప్రతి సంవత్సరం ఈ దేశంలో పిడుగుల బారిన పడి వందలాది మంది మృతి చెందుతుంటారు.2016 లో 200 మంది మృత్యు బాట పట్టారు. ఆ ఏడాది మే నెలలో ఒకే రోజున 82 మంది మరణించారు. అయితే అధికారికంగా ఇంకా తెలియని మరణాలు ఎన్నో ఉన్నాయని ప్రభుత్వ వర్గాలే అంగీకరిస్తున్నాయి.
కనీసం 350 మంది మృతి చెందారని ఓస్వతంత్ర స్వచ్చంద సంస్థ వెల్లడించింది. బంగ్లాదేశ్ లో అనేక చోట్ల అడవుల నరికివేత ఈ ప్రకృతి వైపరీత్యానికి కారణమవుతోందని నిపుణులు చెబుతున్నారు. వేలాది కొబ్బరి చెట్లను నాటడం వల్ల పిడుగుల ప్రభావం కొంత తగ్గుతుందని వీరు అంచనా వేస్తున్నారు. ఒకరకంగా మానవ తప్పిదాలు కూడా కారణమవుతున్నాయని, భారీ ప్రాజెక్టులు నిర్మించడం వీటిలో ఒకటని వారు పేర్కొన్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: పెగాసస్ పై మళ్ళీ రభస.. రాజ్యసభ నుంచి ఆరుగురు తృణమూల్ కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్
AP Corona Cases: ఆ జిల్లాలో భారీగా పెరిగిన పాజిటివ్ కేసులు.. ఏపీలో కొత్తగా 2,442 కరోనా కేసులు..