SpaceX 143 Satellites: ఇస్రో రికార్డ్ ను బ్రేక్ చేసి సరికొత్త రికార్డ్ ను సృష్టించిన స్పేస్‌ఎక్స్.. 143 శాటిలైట్లు లాంఛ్

| Edited By: Pardhasaradhi Peri

Jan 25, 2021 | 10:41 AM

స్పేస్ ఎక్స్ కంపెనీ మరో చరిత్ర సృష్టించింది. ఆదివారం అర్ధరాత్రి ప్రపంచ రికార్డ్ ను బ్రేక్ చేసి.. సరికొత్త రికార్డ్ ను తన పేరున లిఖించుకుంది. అంతరిక్ష కక్షలో ఒకేసారి 143 ఉపగ్రహాలను విజయవంతంగా ప్రవేశ పెట్టింది. దీంతో 2017 ఫిబ్రవరిలో ..

SpaceX 143 Satellites: ఇస్రో రికార్డ్ ను బ్రేక్ చేసి సరికొత్త రికార్డ్ ను సృష్టించిన స్పేస్‌ఎక్స్.. 143 శాటిలైట్లు లాంఛ్
Follow us on

SpaceX 143 Satellites: స్పేస్ ఎక్స్ కంపెనీ మరో చరిత్ర సృష్టించింది. ఆదివారం అర్ధరాత్రి ప్రపంచ రికార్డ్ ను బ్రేక్ చేసి.. సరికొత్త రికార్డ్ ను తన పేరున లిఖించుకుంది. అంతరిక్ష కక్షలో ఒకేసారి 143 ఉపగ్రహాలను విజయవంతంగా ప్రవేశ పెట్టింది. దీంతో 2017 ఫిబ్రవరిలో 104 శాటిలైట్స్ ను ఒకేసారి ప్రవేశ పెట్టిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో పేరిట ఉన్న రికార్డ్ బద్దలైంది.
ఈనెల 8న ఎలన్ మాస్క్ కి చెందిన టెస్లా కంపనీ భారత్ లోకి అడుగు పెట్టింది. జస్ట్ రెండు వారాల్లోనే ఎలన్ మాస్క్ కి చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ చరిత్రను తిరగరాసింది. ప్రస్తుతం స్పేస్ ఎక్స్ దగ్గర 9 రాకెట్లున్నాయి. అవి ఒకొక్కటి పెద్ద అపార్ట్మెంట్ లా ఉంటాయి. వాటిలో శాటిలైట్స్ ఉంచి రోదసీలోకి పంపారు.

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని కేప్ కెనవరాల్ నుంచి ఈ ప్రాజెక్ట్ ను చేపట్టింది. ఈ ప్రాజెక్టు పేరు ట్రాన్స్‌పోర్టర్-1. ఈ రాకెట్ ఇండియాపై నుంచి వెళ్తున్నప్పుడు మన ఇస్రోకి చెందిన బెంగళూరులోని టెలిమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్ సిగ్నల్ అందుకుంది. 143 శాటిలైట్లు కక్ష్యలో చేరడానికి నిమిషం కూడా సమయం తీసుకోలేదు.. అన్ని శాటిలైట్స్ తమ కక్ష్యలోకి చేరి తిరుగుతున్నాయి. దీంతో ఈ ప్రాజెక్ట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది.

వీటి ద్వారా 2021 ఏడాది చివరికి ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకు ఇంటర్నెట్ అందనుంది. ఐలవ్యూ అర్థం వచ్చేలా ఉంటుందనే ఉద్దేశంతోనే సరిగ్గా 143 శాటిలైట్లే ప్రయోగించారని తెలుస్తోంది. కేజీ బరువున్న శాటిలైట్‌ను అంతరిక్షంలో వదిలేందుకు స్పేస్ ఎక్స్ రూ.10,94,625. ఛార్జ్ చేసింది. చిన్న చిన్న దేశాలు శాటిలైట్స్ ను తయారు చేసుకుని వాటిని ప్రయోగించే సామర్ధ్యం లేకపోతే తమ ద్వారా ప్రయోగించుకోవచ్చని ఎలన్ మస్క్ చెప్పారు. దీంతో ఇప్పటి వరకూ అతి తక్కువ ధరకు అంతరిక్షంలో రాకెట్స్ ను లాంచ్ చేస్తున్న ఇస్రోకి ఇప్పుడు స్పేస్ ఎక్స్ పోటీకి వచ్చినట్లు అయ్యింది. ఇన్నాళ్లూ రోదసీ ప్రాజెక్టుల్లో ముందున్న అమెరికా స్పేస్ రీసెర్ట్ సెంటర్ఈ నాసా స్పేస్‌ఎక్స్‌తో పోటీ పడలేకపోతోంది.

Also Read: నన్ను అనవసరంగా పొగుడుతున్నారు.. ఘనత అంతా కుర్రాళ్లదే” హుందాగా జవాబిచ్చిన ద్రావిడ్.