Driving Licence: కువైట్ సర్కార్ మరో కీలక నిర్ణయం.. వలసదారులకు డ్రైవింగ్ లైసెన్స్‌ జారీ కఠినతరం!

కరోనా మహమ్మారి ప్రభావం రోజురోజుకీ తగ్గుముఖం పడుతుండడంతో అన్ని దేశాల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ క్రమలోనే కువైట్ దేశం కూడా విదేశీయుల రాకపోకలపై ఆంక్షలను ఎత్తివేస్తోంది.

Driving Licence: కువైట్ సర్కార్ మరో కీలక నిర్ణయం.. వలసదారులకు డ్రైవింగ్ లైసెన్స్‌ జారీ కఠినతరం!
Kuwait

Updated on: Oct 12, 2021 | 4:35 PM

Kuwait on Driving Licence: కరోనా మహమ్మారి ప్రభావం రోజురోజుకీ తగ్గుముఖం పడుతుండడంతో అన్ని దేశాల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ క్రమలోనే కువైట్ దేశం కూడా విదేశీయుల రాకపోకలపై ఆంక్షలను ఎత్తివేస్తోంది. కరోనా ఆంక్షలు తొలగించిన తర్వాత కువైత్ ఇటీవల ఎయిర్‌పోర్టుకు డైలీ రావాల్సిన ప్రయాణికుల సామర్థ్యాన్ని 10వేలకు పెంచిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటికే పలు సడలింపులు ఇచ్చింది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

వలసదారులకు డ్రైవింగ్ లైసెన్స్‌ల జారీ విషయం‌లో కఠినంగా వ్యవహరిస్తున్న కువైట్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ దేశ అంతర్గత మంత్రిత్వ శాఖ వేలాది మంది ప్రవాసుల డ్రైవింగ్ లైసెన్స్‌లను రద్దు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ప్రొఫెషన్ ఆధారంగా డ్రైవింగ్ లైసెన్స్ పొందిన సుమారు 40వేల మంది వలసదారులు ప్రొఫెషన్ మారిన తర్వాత తిరిగి వాటిని ప్రభుత్వానికి అప్పగించలేదు. ఇలా ప్రొఫెషన్ మారిన తర్వాత కూడా డ్రైవింగ్ లైసెన్సులను ప్రభుత్వానికి అప్పగించకపోవడంతో వారు ఆటోమెటిక్ ఆ లైసెన్స్‌లను కోల్పోయినట్లేనని అధికారులు పేర్కొన్నారు. కొత్త ప్రొఫెషన్ ఆధారంగా పాత లైసెన్స్‌ను మార్చుకోవాల్సి ఉంటుంది. కానీ, చాలామంది అలా చేయలేదు. అంతేగాక వీటిలో చాలా మంది లైసెన్సులకు గడువు ముగిసినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఇలా గడువు ముగిసిన వాటితో పాటు ప్రొఫెషన్ మారిన వారి లైసెన్సులను రద్దు చేయాలని మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.

Read Also… Largest Pumpkin: రైతుకి లక్షలార్జించిన భారీ గుమ్మడి కాయ..ప్రపంచంలో రెండో పెద్ద గుమ్మడికాయగా రికార్డ్